నేడు, రేపు షర్మిల ‘జనభేరి’ | tomorrow ys sharmila janabheri | Sakshi
Sakshi News home page

నేడు, రేపు షర్మిల ‘జనభేరి’

Published Thu, May 1 2014 1:40 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

నేడు, రేపు షర్మిల ‘జనభేరి’ - Sakshi

నేడు, రేపు షర్మిల ‘జనభేరి’

  •  తొలిరోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటన
  •  ఉదయం జంగారెడ్డిగూడెంలో రోడ్ షో
  •  సాయంత్రం కొయ్యలగూడెం,కొవ్వూరులో బహిరంగ సభలు
  •  ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం నుంచి రెండు రోజులపాటు జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలిరో జు మూడు నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని జంగారెడ్డిగూడెంలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం పోలవరం నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కొవ్వూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. షర్మిల శనివారం కూడా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆరోజు ఏయే నియోజకవర్గాల్లో పర్యటించేది శుక్రవారం వెల్లడిస్తారు. షర్మిల పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. జనభేరి సభలకు ఆయూ నియోజకవర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement