
అవును.. టీఆర్ఎస్ కుటుంబ పార్టీయే
టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అన్న విషయం మరోసారి స్పష్టంగా రుజువైందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ కుమార్తె కవితకు నిజామాబాద్ లోక్సభ టికెట్ ఖరారు చేయడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఆయన విమర్శించారు.
తెలంగాణ నిర్మాణానికి కావాల్సింది కాలమే తప్ప కత్తి కాదని.. కేసీఆర్ మాత్రం ఓట్లు అనే కత్తి తనకు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. ఆ కత్తి ఇస్తే కేసీఆర్ కేంద్రంపై యుద్ధం చేస్తానంటున్నారని.. కానీ ఎవరిపైనా అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎవరిమీద యుద్ధం చేస్తారని ప్రశ్నించారు.