విజయం ఎవరిదో...? | who are the winners | Sakshi
Sakshi News home page

విజయం ఎవరిదో...?

Published Sun, Mar 23 2014 3:35 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

who are the winners

నెల్లిమర్ల, న్యూస్‌లైన్: మండలంలో ఎంపీపీ పీఠం కోసం నేతలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. గ్రామాల్లో పోటాపోటీగా ప్రచారం నిర్వస్తున్నారు. ఎంపీపీ అభ్యర్థులుగా ప్రకటించిన ముగ్గురు మహిళామణులూ హేమాహేమీలైన నేత ల సతీమణులు కావడంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారారుు. ముగ్గురు నేత లూ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా అత్యధిక ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని తమ సతీమణులు ఎంపీపీ పీఠాన్ని అధిష్ఠి ంచేలా పావులు కదుపుతున్నారు.
   
మండల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ అభ్యర్థులుగా ఈ సారి ముగ్గురు మహిళామణులు పోటీలో నిలిచారు. ప్రధా న పార్టీలైన వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీల తరఫున హే మాహేమీలైన నేతల సతీమణులు ఈసారి ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోనున్నారు. మొన్నటి వరకు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన మత్స విజయ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
 
ఏఎంసీ చైర్మన్ అంబళ్ళ శ్రీరాములనాయుడు సతీమణి సుధారాణి వైఎ స్సార్ సీపీ తరఫున, టీడీపీ అధికార ప్రతినిధి సువ్వాడ రవి శేఖర్ సతీమణి వనజాక్షి ఆ పార్టీ తరఫున ఎంపీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులు ఇప్పటికే రాజకీయాల్లో అనుభవం ఉం డగా.. టీడీపీ అభ్యర్థి మాత్రం మొదటిసారిగా పోటీ చేస్తున్నారు.
 
గత ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బూరాడపేట ఎంపీటీసీ సభ్యురాలిగా మత్స విజయ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె ఎంపీపీగా ఎన్నికై.. 2011 వర కు పదవిని చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా మారి న ఆమె  భర్త మత్స సత్యనారాయ ణ ప్రోత్సాహంతో విజయ ఎంపీటీసీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్నా రు. ఈసారి ఆమె బొప్పడాం స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆమెనే పార్టీ అధిష్ఠానం ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్ సీపీ తరఫున ఏఎంసీ చైర్మన్ అంబళ్ళ శ్రీరాములునాయుడు భార్య సుధారాణి ఎంపీటీసీ అభ్యర్థిగా ఒమ్మి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
 
గత ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందిన ఆమె అప్పట్లో మండల ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో ఆమెనే ఎంపీపీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటిం చింది. అలాగే టీడీపీ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి సువ్వాడ రవిశేఖర్ సతీమణి వనజాక్షిని ఆ పార్టీ పెద్దలు ఎంపీపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆమె వల్లూరు ఎంపీటీసీ స్థానం నుంచి పో టీ చేస్తున్నారు. ఆమె రాజకీయ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ అనుభవం మాత్రం లేదు. తొలిసారిగా ఎంపీటీసీ ఎన్నికల్లో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుని, ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement