ఇందూరు కోటలో పాగా వేసేదెవరు? | who will win from Indhuru lok sabha constituency ? | Sakshi
Sakshi News home page

ఇందూరు కోటలో పాగా వేసేదెవరు?

Published Tue, Apr 22 2014 1:24 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఇందూరు కోటలో పాగా వేసేదెవరు? - Sakshi

ఇందూరు కోటలో పాగా వేసేదెవరు?

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
 నియోకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూరు, జగిత్యాల, కోరుట్ల (కరీంనగర్ జిల్లా)  నియోజకవర్గం ప్రత్యేకతలు: వ్యవసాయం ప్రధాన జీవనాధారం. గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులూ ఎక్కువే.    

ప్రధాన అభ్యర్థుల వీరే
 సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి  (వైఎస్సార్ సీపీ)
 కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్)
 మధుయాష్కీ గౌడ్ (కాంగ్రెస్)
 యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)  
 
నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. కేసీఆర్ కూతు రు కల్వకుంట్ల కవిత మొదటిసారిగా ఎన్నిక ల బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి మధుయాష్కీగౌడ్, బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ ఆమెతో పోటీ పడుతున్నారు. తొలిసారిగా సింగిరెడ్డి రవీందర్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది.
 
 గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్: తెలంగాణవాదం అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి. అభ్యర్థులందరూ తెలంగాణవాదులే కావడంతో అదే నినాదంతో ప్రజల వద్దకు వెళుతున్నారు.  
 
 ఆత్మవిశ్వాసంతో టీఆర్‌ఎస్
 తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినా టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత గెలుపుపై ధీమాగా ఉన్నారు. తెలంగాణవాదం, తెలంగాణ జాగృతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలు కలిసి వస్తా యని ఆత్మవిశ్వాసం తో ఉన్నారు.
 
 మోడీ మంత్రం గట్టెక్కిస్తుందని..
 మోడీపై సానుకూలత తనకు మేలుచేస్తుందనేది బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఆలోచన. టీడీపీతో పొత్తు ఉన్నా ఆ పార్టీ శ్రేణుల సహకారంపై పెద్దగా ఆశ ల్లేని ఆయన తెలంగాణవాదంపైనే నమ్మకం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
 
 తెలంగాణ ఇచ్చిన పార్టీగా..
 తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా తనకు గుర్తింపు ఉంటుందని, అదే తనను విజయ తీరాలకు  తీసుకెళ్తుందని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ భావిస్తున్నారు.  
 
 రాజన్న పథకాలే తోడుగా..
 దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తోడుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి ముందుకుసాగుతున్నారు. వైఎస్ పథకాలతో లబ్ధిపొందిన వారు తనకు అండగా ఉంటారనే ధీమా కనబరుస్తున్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు రాజన్నను గుర్తు చేసుకుంటుండడంతో ‘ఫ్యాన్’గాలికి తిరుగుండదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  
 
 మధుయాష్కీగౌడ్ (కాంగ్రెస్)
 అనుకూలం
 -    తెలంగాణ గురించి మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీగా పేరుండడం
 -   బాబ్లీ ప్రాజెక్టును ఆపాలని కోర్టులో కేసువేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం
 ప్రతికూలం
 -    ఎన్నికలప్పుడు తప్పితే మళ్లీ గ్రామాలకు వెళ్లిన దాఖలాలు లేకపోవడం
 -    ఎంపీ కోటా కింద విడుదలైన నిధులను సరిగా వాడుకోలేదన్న విమర్శలు
 -    హామీలకే అభివృద్ధి పరిమితం కావడం
 
 కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్)
 అనుకూలం
 -    తెలంగాణ జాగృతి, బతుకమ్మ ద్వారా ప్రజలకు చేరువ కావడం
 -    తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం, కేసీఆర్ కుమార్తె కావడం
 ప్రతికూలం
 -    సెటిలర్ల నుంచి వ్యతిరేకత
 -    రాజకీయాలకు కొత్త.. నియోజకవర్గ ప్రజలకు కొత్తముఖం
 
 సి.రవీందర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ)
 అనుకూలం
 -    దివంగత నేత వైఎస్సార్ సంక్షేమ పథకాలు  
 -    తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం
 -    ఎలాంటి ఆరోపణలు లేకపోవడం
 ప్రతికూలం
 -    రాజకీయాలకు కొత్త {పత్యర్థులు అర్థికంగా బలంగా ఉండటం
 
 వై.లక్ష్మీనారాయణ (బీజేపీ)
 అనుకూలం
 -    ఉప ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా గెలవడం
 -    తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర
 ప్రతికూలం
 -    అభివృద్ధి పనులు చేపట్టకపోవడం
 -    ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కేడర్‌ను పట్టించుకోలేదన్న విమర్శ
 -    టీడీపీతో పొత్తు   
 
 నే.. గెలిస్తే..
 - నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ నుంచి నాందే డ్ వరకు రైల్వేలైన్ విద్యుదీకరణ, డబ్లింగ్ పనుల పూర్తి
 -    డిచ్‌పల్లి నుంచి వర్ని వరకు బోధన్ మీదుగా మహారాష్ట్రలోని నర్సి వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం
 -    సాప్ట్‌వేర్ హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు.
 - సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి  (వైఎస్సార్ సీపీ)
 
 -    పసుపుబోర్డు, పసుపు శుద్ధి కేంద్రం, చెరకు పరిశోధన కేంద్రాల ఏర్పాటు.  
 - జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు
 - గల్ఫ్ బాధితులు, బీడీ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం
 - గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ
 - కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్)
 
 - గల్ఫ్ బాధితులు, యువకులకు ఉద్యోగవకాశాలు
 - బీడీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు
 - పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన
 -    నిజామాబాద్‌లో భూగర్భ డ్రైనేజీకి రూ.147 కోట్లు వెచ్చించి పూర్తి చే యడం.

మధుయాష్కీ గౌడ్ (కాంగ్రెస్)


 -    గోదావరి నుంచి సాగు, తాగునీరు
 -    వ్యవసాయాధార పరిశ్రమలు ఏర్పాటు
 -    రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్, గ్రామాలకు 24 గంటల విద్యుత్,
 -    పెద్దపల్లి- నిజామాబాద్, బోధన్ - బాన్సువాడ - బీదర్ రైల్వేలైన్లను పూర్తి  చేయడం
 - యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement