విజయమ్మ ప్రచార భేరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ జిల్లాలో ప్రచార భేరి మోగించనున్నారు. ఈ మేర కు ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమం ఖరారైంది. రెండు దశల్లో విజ యమ్మ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ టూర్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా పరిశీలకుడు కొయ్యా ప్రసాదరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం విజయమ్మ ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో మొదటి దశ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 27 రాత్రికి శ్రీకాకుళం చేరుకుంటారు. 28న ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. 29న నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. రెండో దశ ప్రచార షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు.
మొదటి దశ ప్రచార షెడ్యూల్ ఇలా ఉంది...
28-04-14 (సోమవారం) :
ఉదయం 9.30: ఇచ్ఛాఫురం నియోజకవర్గం కవిటిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
ఉదయం 11: పలాస నియోకవర్గం వజ్రపుకొత్తూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
సాయంత్రం 4: పాతపట్నంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 6: ఆమదాలవలసలో ప్రచార సభలో పాల్గొంటారు.
29-04-14 (మంగళవారం) :
ఉదయం 9.30: నరసన్నపేట నియోజకవర్గం పోలాకిలో ప్రచార సభలో పాల్గొంటారు.
ఉదయం 11: టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.
సాయంత్రం 4: శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం శ్రీకూర్మంలో ప్రచార సభలో పాల్గొంటారు.
సాయంత్రం 6: శ్రీకాకుళం వైఎస్సార్ జంక్షన్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
రాత్రి 8: ఎచ్చెర్లలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.