
తెలంగాణలో 105 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 పార్లమెంట్, 105 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసింది. మంగళవారం 13 మంది పార్లమెంట్, 81 మంది అసెంబ్లీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయగా... బుధవారం ఉదయం మరో 24 మందికి బీ-ఫారాలు అందజేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన వారి సంఖ్య 105కు చేరింది.