వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనం | YSRCP gets 9 seats in kadapa district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనం

Published Fri, May 16 2014 6:38 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

YSRCP gets 9 seats in kadapa district

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో ఎదురులేదని మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించింది. జిల్లాలో ఫ్యాన్ గాలికి టీడీపీ ఎదురు నిలవలేకపోయింది. జిల్లాలోని రెండు లోక్సభ  సీట్లను, పది అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది సీట్లను కైవసం చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 75 వేల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

కడప లోక్సభ నియోజవర్గం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. మిథున్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని ఓడించారు. కమలాపురం నుంచి వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రా రెడ్డి విజయం సాధించారు. జిల్లాలో రాజంపేటలో మాత్రమే టీడీపీ బోణీ కొట్టింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు జయరాములు (బద్వేల్),  అంజద్‌ బాషా
(కడప అసెంబ్లీ),  శ్రీనివాసులు (రైల్వేకోడూరు), శ్రీకాంత్‌రెడ్డి  (రాయచోటి), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), ప్రసాదరెడ్డి  (ప్రొద్దుటూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు) విజయకేతనం ఎగురవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement