ఇందూరును ఏలిన నాయకులు నగర అభివృద్ధిని గత 40 ఏళ్లుగా విస్మరించారు. చాలా తెలివైన ఇక్కడి ప్రజలు ఈ విషయాన్ని పసిగట్టారు. అ భివృద్ధి చేపట్టని నాయకులకు గుణపాఠం చె ప్పారు. దీంతో ఇక ఇక్కడ తమ పప్పులుడకవని తెలుసుకున్న నాయకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించిన ఎంతో మంది యువకులు అడ్డ కూలీలుగా మారి నగరంలోని నెహ్రూపార్క్ వద్ద పనికోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. వీరి దయనీయస్థితిని ఏ ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకున్న పాపా న పోలేదు. తెలంగాణ తెచ్చామని కొందరు, తెలంగాణ ఇచ్చామని మరికొందరు ప్రచారం చేస్తూ ప్రజల ను మభ్యపెడుతున్నారు.
ఈ వ్యాఖ్యలు కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయి. ఇవన్నీ కట్టిపెట్టాలి. తెలంగాణ తెచ్చాం, ఇచ్చాం అంటూ.. మాకు ఓట్లు వేయండంటూ అభ్యర్థిస్తున్నారు. లంచం రూపం లో ఓట్లు అడుగడం ఎంతవరకు సమంజసం? వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలతో తెలంగాణలోని ప్రతి ఇల్లు ఏదో ఒక రూపంలో లబ్ధి పొందింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన పార్టీ తరపున పోటీ చేస్తున్న నన్ను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు నా విజయానికి కొండంత అండ గా ఉంటాయి.
వైఎస్ పథకాలు అమోఘం
జిల్లాలో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతలు, వైద్య కళాశాల, తెలంగాణ యూనివర్సిటీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే ఏర్పడ్డాయి. క్షీణ దశలో ఉన్న కాంగ్రె స్ పార్టీని ఆయన వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేసి 2004లో అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఏర్పడి న వెంటనే రాష్ట్రం లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం వ్యవసాయానికి ఉ చిత విద్యుత్‌ను అ మలు చేశారు. రై తులకు రుణమాఫీ చేశారు. డ్వాక్రా గ్రూపులకు రుణా లు మంజూరు చేసి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడ్డారు. భారీ ఎత్తున గృహనిర్మాణం, పింఛన్లను అందించారు.
ఆరోగ్యశ్రీ పథ కం ద్వారా అనేక మంది పేద రోగులకు కా ర్పొరెట్ వైద్య అందించి ప్రాణాలు కాపాడారు. ఈ పథకాలన్నీ వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల విజయం ద్వారానే తిరిగి మెరుగుపడతాయి. ఈ ఆకాంక్షతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. రైలు మార్గాలతోనే జిల్లా అభివృద్ధి బోధన్ నుంచి బీదర్ వరకు రైల్వేమార్గం నిర్మిస్తే జి ల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. బాన్సువాడ, నిజాంసాగర్ మీదుగా ఈ రై లు మార్గం వెళ్తుంది. ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుంది.
ఈ విషయాన్ని మా జీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో ప్రస్తావిస్తే, రైలు మార్గం తన పరిధిలోకి రాదని ఎంపీ మధుయా ష్కీ దృష్టికి తీసు కె ళ్లాలని ఉచిత సల హా ఇచ్చారు. బో ధన్‌కు చెందిన నే ను 25 సంవత్సరాలుగా విదేశాల్లో ఉ న్నాను. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప థకాలకు ఆకర్షితుడనై, ఆయన స్ఫూర్తితో ప్రజలకు నా వంతు సేవచేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చాను. దశాబ్దాలుగా పూర్తికాని పెద్దపల్లి-నిజామాబాద్ రైలు మార్గం పనులు, ఆర్మూర్-నిర్మల్ మీ దుగా ఆదిలాబాద్‌కు కొత్త రైలు మార్గం, సికింద్రాబాద్-నిజామాబాద్ డబుల్ లైన్ ఏర్పాటుకు కృషి చేయాలనే సంకల్పంతో ఉన్నాను.
ఒక్క అవకాశం ఇవ్వండి
Published Mon, Apr 14 2014 2:24 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement