కొవ్వూరు రూరల్/కొవ్వూరు టౌన్, న్యూస్‌లైన్ : పేదల గుండె చప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అజెండా అని ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి అన్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనితతో కలిసి ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగేళ్లుగా ప్రజల కష్టాలు తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి పేదలను ఆదుకునే అంశాలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారని బొడ్డు పేర్కొన్నారు. అమ్మ ఒడి, డ్వాక్రా రుణాల రద్దు, వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల విద్యుత్, పింఛన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలు అమలుతోపాటు పేదల ఇంట్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో రూ.100లకే 150 యూనిట్ల విద్యుత్ సరఫరాకు వైస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కొవ్వూరు టోల్‌గేట్ వద్ద బొడ్డు, నేతలు పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. విజయవిహార్ సెంటరు, బస్టాండు, మెరకవీధి మీదుగా ఏటిగట్టుపై నుంచి గ్రామాల మీదుగా చాగల్లు మండలానికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యేలు పెండ్యాల కృష్ణబాబు, జొన్నకూటి బాబాజీరావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు మైపాల విజయ రామ్మోహనరావు(రాంబాబు), ముళ్లపూడి కాశీ విశ్వనాధ్, జిల్లాకమిటీ సభ్యులు పరిమి హరిచరణ్, వర్రే శ్రీనివాస్, కాకర్ల సత్యనారాయణ , వరిగేటి సుధాకర్, ముదునూరి నాగరాజు, రాష్ట్ర దళిత విభాగం నాయకులు ముప్పిడి విజయరావు, పరిమి రాధాకృష్ణ, గారపాటి వెంకట కృష్ణ, ఉప్పులూరి సూరిబాబు, సలాది సందీప్ కుమార్, కప్పల రాజేష్, పాశం సాయిప్రతాప్, చిడిపి సర్పంచ్ పామెర్ల సూర్యారావు, కోడూరి సత్యనారాయణ (సత్తులు) తదితరులు పాల్గొన్నారు.
వైసీపీతోనే రైతులకు న్యాయం
తాళ్లపూడి : రైతులకు పూర్తి స్థాయి న్యాయం వైఎస్సార్ సీపీతోనే జరుగుతుందని ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ ఎన్నికల పరిశీలకులు, మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్ రావు అన్నారు. తాళ్లపూడి మండలంలో మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బొడ్డు వెంకట రమణ చౌదరి, తానేటి వనిత, జీఎస్ రావు, జి.శ్రీనివాసనాయుడు ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ.. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ మండల కన్వీనర్ కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ అభ్యర్థి కొమ్మిరెడ్డి వీర్రాఘవమ్మ, జిల్లా కమిటీ సభ్యులు పరిమి హరిచరణ్, గూడా విజయరాజు, జి.మాణిక్యాలరావు, బండి పట్టాభి రామారావు, పోచవరం సర్పంచ్ కె.రమేష్, గన్నిన రత్నాజీ, యాళ్ల బాబూరావు, డి.భీష్మాంబ, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
పేదల గుండెచప్పుడు వైసీపీ అజెండా
Published Wed, Apr 30 2014 1:48 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement