
రాజమండ్రి రాజెవరో
గోదావరి ప్రవాహంలాగే రాజమహేంద్రి రాజకీయాలు నిలకడగా ఉండవు. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రమైన రాజమండ్రి.. ఆధ్యాత్మిక కార్యకలాపాలకూ నెలవుగా ఉంది. రాజకీయ చైతన్యం కలిగిన రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గానికి సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలోనే అత్యధిక నామినేషన్లు పడ్డాయి. గత ఎన్నికల్లో ఈ పీఠాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
- సాక్షి, రాజమండ్రి
ముందెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ, బీజేపీమధ్య ప్రధాన పోటీ నెలకొంది. పోటీలో మేమూ ఉ న్నామని చాటుకోవడానికి కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీ తాపత్రయపడుతున్నాయి. రాజమండ్రిలో 1951 ఎన్నికల నుంచి పోలింగ్ 65 నుంచి 70 శాతం లోపు జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో 85 శాతం ఉండాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది.
పోటీలో వీరే..
వైఎస్సార్ సీపీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మన రాజ్‌కుమార్ బరిలో ఉన్నారు. ఈయన గతంలో పీఆర్పీలో పని చేసి, 2011లో వైఎస్సార్ సీపీలోకి చేరారు. బీజేపీ/టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ పోటీలో ఉన్నారు. ప్రముఖ వైద్యుడు. ఆర్థికంగా స్థితిమంతుడు. బీజేపీ పార్లమెంట్ టిక్కెట్‌ను ఆశించారు. పొత్తులో బీజేపీకి రాజమండ్రి సిటీ స్థానం దక్కడంతో.. ఈయనను బరిలోకి దింపింది. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వాసంశెట్టి గంగాధరరావు పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల కోసం వెతుకులాడిన పార్టీ అనూహ్యంగా వాసంశెట్టిని బరిలోకి దింపింది.
ఇదీ పరిస్థితి..
బీజేపీతో పొత్తుకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. పొత్తు అనంతర పరిణామాల్లో ఈ సీటు బీజేపీకి కేటాయిం చడంతో టీడీపీ వర్గాలు ఆ పార్టీకి మొండిచేయి చూ పిస్తున్నాయి. రాజమండ్రి సిటీలో కొద్దోగొప్పో పట్టు న్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమండ్రి రూరల్‌కు వెళ్లిపోవడంతో ఇతడి వ్యతిరేకవర్గమైన గన్ని కృష్ణ వెంటఉన్న కొద్దిమంది మాత్రమే బీజేపీకి పని చేస్తున్నారు. పోటీ ఇస్తుందనుకున్న టీడీపీ బరిలో లేకపోవడం, బీజేపీకి అంతగా కలిసిరాని టీడీపీ వె రసి నగరంలో మంచి పేరున్న బొమ్మనకు సానుకూలపవనాలు వీస్తున్నాయి. వివాదరహితునిగా, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిగా బడుగు వర్గాల్లో బొమ్మనకు ఆదరణ ఉంది. పార్టీ గాలి కూడా బలంగా వీ స్తుండడం ప్లస్‌పాయింట్ కాగలదంటున్నారు. రాజ మండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్, మైనారిటీల మద్ధతు లాభిస్తుందని బొమ్మన ఆశిస్తున్నారు. బీజేపీకి నగరంలో పెద్దగా ప్రజాబలం లేదు. కేవలం మోడీ పేరు చెప్పి లాభపడాలని అభ్యర్థి ఆకుల సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారు. టీడీపీ మద్దతు ఉండడంతో చెప్పుకోదగ్గ ఓట్లు వస్తాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో టీడీపీ మద్దతు లభించకపోవడం వీరిని ఇబ్బంది పెడుతోంది. జై సమైక్యాంధ్ర అభ్యర్థి శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం పార్టీ ఇమేజ్ కంటే తనుకున్న పరిచయాలపైనే ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వాసంశెట్టి గంగాధరరావు పార్టీలో మిగిలి ఉన్న కార్యకర్తల సహకారంతో ప్రచారం సాగిస్తున్నారు.
ఏ పార్టీ ఎన్నిసార్లు
రాజమండ్రి నియోజకవర్గానికి ఇప్పటివరకు
13 సార్లు ఎన్నికలు జరిగాయి.
కాంగ్రెస్ - 6, టీడీపీ - 4, కమ్యూనిస్టులు : 2, ప్రజాపార్టీ-1