పరిషత్ ఎన్నికల్లో టీడీపీ హవా
సాక్షి ప్రతినిధి, విజయనగరం:పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ హవా కనబరిచింది. పదేళ్ల తర్వాత పూర్తి ఆధిక్యతతో జిల్లా పరిషత్ పీఠాన్ని ఆ పార్టీ దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని ఆ పీఠం వరించనుంది. జిల్లావ్యాప్తంగా ఆ పార్టీకి 23జెడ్పీటీసీ స్థానాలు లభించాయి. వైఎస్సార్‌సీపీకి 10 జెడ్పీటీసీ స్థానాలు దక్కాయి. విజయనగరం డివిజన్‌లో టీడీపీ పూర్తి ఆధిక్యతను సాధించగా, పార్వతీపురం డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యత కనబరిచింది. ఇక, మండల పరిషత్‌ల కొచ్చేసరికి 21చోట్ల టీడీపీ, ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీ పాగా వేసింది. ఏడు చోట్ల హంగ్ ఏర్పడింది.
పరిషత్ ఎన్నికల కౌంటింగ్ తొలుత నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ప్రారంభంలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యత కనబరచగా చివరికొచ్చేసరికి టీడీపీదే పైచేయి అయ్యింది. 23జెడ్పీటీసీ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోగా, వైఎస్సార్‌సీపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే కడపటి సమాచారం మేరకు 245స్థానాల్లో టీడీపీ, 155స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 40చోట్ల కాంగ్రెస్, 20చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు.
పార్టీల వారీగా జెడ్పీటీసీ స్థానాలు
విజయనగరం, గుర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, గరివిడి, భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, ఎస్‌కోట, వేపాడ, లక్కవరపుకోట, జామి, కొత్తవలస, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మక్కువ, బాడంగి, కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, పార్వతీపురం, బలిజిపేట జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ దక్కిం చుకుంది. మెంటాడలో టీడీపీ అధిక్యంలో ఉం ది. నెల్లిమర్ల, దత్తిరాజేరు, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాచిపెంట, బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, సీతానగరం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.
మండల పరిషత్‌లలో టీడీపీదే ఆధిక్యత
మండల పరిషత్‌లకొచ్చేసరికి పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతానగరం, బొబ్బిలి, తెర్లాంలలో వైఎస్సార్‌సీపీ పాగా వేయగా, బాడంగి, రామభద్రపురం, మక్కువ, భోగాపురం, దత్తిరాజేరు, మెరకముడిదాం, సాలూరు మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మిగతా మండలాలన్నింటిలోనూ టీడీపీ ఆధిక్యతను కనబరిచింది.
బాడంగిలో టై
బాడంగి మండల పరిషత్‌లో 14స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ ఏడు, టీడీపీ ఏడు స్థానాలను గెలుచుకుని సమ ఉజ్జీలుగా నిలిచాయి. దీంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులేం చేస్తారో చూడాలి.
రెండు స్థానాలకు రీ కౌంటింగ్
మెంటాడ మండలంలోని చల్లపేట ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి, ఇప్పలవలస లోఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తక్కువ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చల్లపేటలో 8ఓట్ల ఆధిక్యత, ఇప్పలవలసలో ఆరు ఓట్ల ఆధిక్యత రావడంతో ప్రత్యర్థుల డిమాండ్ మేరకు రీకౌం టింగ్ నిర్వహించగా ఇప్పలవలసలో అదే ఫలితం