అంతుచిక్కని లెక్కలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికలు అయిపోయి నాలు గు రోజులు గడిచిపోవడంతో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలంతా తమ అభ్యర్థుల ఇళ్ల్లకు వెళ్లి కలుస్తున్నారు. గెలుపునకు ఢోకా లేదని, పక్కా గ్యారంటీ అని, మనకిన్ని ఓట్లు వస్తాయని, ఎలా చూసినా మనదే గెలుపని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పుకొస్తున్నారు. విశేషమేమిటంటే కొన్నిచోట్ల, కొన్ని గ్రామాల్లో, మండలాల్లో మెజార్టీ ఎంత వస్తుందో కూడా ముందే లెక్కలేసి చెప్పేస్తున్నారు. ఫలానా మె జార్టీతో గెలవవచ్చునన్న ధీమా కూడా ఇచ్చేస్తున్నారు. ఈ రకమైన పలకరింపులు, చెప్పుకోవడాలు విజయనగరం, చీపురుపల్లి, గజపతినగ రం, పార్వతీపురం, ఎస్‌కోట, సాలూరు నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. విజయనగరంలోని రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇదే తాకిడి కన్పిస్తోంది. టీడీపీ అభ్యర్థి మీసాల గీత అభ్యర్థిత్వాన్ని తొలి నుంచీ వ్యతిరేకించిన నాయకులు అనుకున్నట్టే ఎన్నికల్లో తమ పంతం నెగ్గించుకున్నారన్న విషయాన్ని కొందరు ఆమె చెవిన వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల రమణమూర్తి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో బల వంత పెట్టి పోటీలో నిలబెట్టిన నాయకులే ఓటు సమయం వచ్చేసరికి ఇంకొకరికి వేయిం చారన్న వింత కబుర్లు ఆయన చెవిలో పడుతున్నాయి.
చీపురుపల్లిలో ఇన్వర్టర్లు, టీవీలు, ఇతర త్రా గృహోపకరణాలు భారీగా పంపిణీ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆ పార్టీ అభ్యర్థి దృష్టికి అక్కడి అనుచరులు తీసుకొస్తున్నారు. మన వద్ద తీసుకుని ఇంకొకరికి ఓటు వేసేశార ని నమ్మకస్తులు చెప్పడంతో ఆ అభ్యర్థి మేనల్లు డు.. అలా దెబ్బకొట్టిన ఓటర్లు ఎవరా అనేదానిపై ఆరాతీస్తున్నారు. ఇక, మరో పార్టీ అభ్యర్థి అయితే..సొంత పార్టీ నాయకులే తనను వ్యతిరేకించారన్న విషయాన్ని తమను కలుస్తున్న అనుచరుల ద్వారా తెలుసుకుని నిర్ఘాంతపోతు న్నారు. గజపతినగరంలో కూడా చీపురుపల్లి సీన్ కనిపిస్తోంది. ఇక్కడ భారీగా ఖర్చు చేసినా ఓట్లు పడకపోవడాన్ని ఆ పార్టీ అభ్యర్థి చెవిలో కార్యకర్తలు వేస్తున్నారు. ఫలానా చోట ఫలానా వ్యక్తులు దెబ్బకొట్టారని వివరిస్తున్నారు. సొంత పార్టీ నాయకులే వ్యతిరేకంగా ఓటు వేశారన్న సమాచారం తెలుసుకుని మరో పార్టీ అభ్యర్థి భ యాందోళన చెందుతున్నారు. చావో రేవో అనుకున్న ఎన్నికల్లో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.
పార్వతీపురంలో కుప్పిగంతులేసి ఓ పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకున్న నాయకుడికి ఆ పార్టీ నాయకులే గట్టి ఝలక్ ఇచ్చారని ఆయన అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆ అభ్యర్థికి నేరుగా చెబుతుం డడంతో ఓట్ల కోసం అనుచరులకు ఇచ్చిన సొమ్మును రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా రు. సాలూరు, ఎస్‌కోట నియోజకవర్గాల్లో సొంత పార్టీ నాయకులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని అక్కడి అభ్యర్థుల దృష్టికి ద్వితీయశ్రేణి నాయకులు తీసుకెళ్తున్నారు. ఆ క్రాస్ ఓటింగ్ తమకెటువంటి నష్టం తెచ్చిపెడుతుందోనని అభ్యర్థులు భయపడుతున్నారు. ఈ విధంగా ప్రతి అభ్యర్థికి ఒక్కొక్కరు ఒక్కోరకంగా వచ్చి చెబుతుండడంతో స్పష్టమైన అం చనా వేసుకోలేకపోవడం ఒక వంతు అయితే అవన్నీ విన్న తర్వాత కొందరు నిర్ఘాంతపోతున్నారు. మరికొందరు వాస్తవమేదో తెలుసుకోలేక అయోమయానికి గురవుతున్నారు.