‘సాక్షి అభయ’ యాప్ | 'Abhaya Sakshi' App | Sakshi
Sakshi News home page

‘సాక్షి అభయ’ యాప్

Published Wed, Nov 19 2014 12:42 AM | Last Updated on Mon, Oct 22 2018 7:57 PM

‘సాక్షి అభయ’ యాప్ - Sakshi

‘సాక్షి అభయ’ యాప్

ఏడాదిగా ఆపన్నులకు ‘అభయ’ హస్తం
ఆపదలో ఉన్నవారికి అభయహస్తం అందించడానికి ‘సాక్షి’ మీడియా చేసిన ప్రయత్నం - ‘సాక్షి అభయ’ అప్లికేషన్. సరిగ్గా యేడాది క్రితం అందరికీ అందుబాటులోకి వచ్చిందీ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఉద్యోగినులు, వృద్ధులు, ఒంటరి పిల్లలు - ఇలా ఎవరైనా, ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఒక్క క్లిక్‌తో వారికి సాయం అందేలా ఈ అప్లికేషన్‌కు రూపకల్పన చేశారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు వి.ఎం. కిరణ్‌కుమార్, మరో మిత్రుడు శ్రవణ్‌కుమార్ సాయంతో దీన్ని రూపొందించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ‘నిర్భయ’ ఘటన తరువాత 6 నెలలు శ్రమించి దీన్ని తయారు చేశారు. పూర్తిగా ఉచితమైన ఈ అప్లికేషన్‌కు గూగుల్ ప్లే స్టోర్ నుంచి స్మార్‌‌టఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆ ఆప్‌లో మీ కుటుంబ సభ్యులు, మిత్రుల మొబైల్ నంబర్, ఈ-మెయిల్, ఫేస్‌బుక్ ఐడీలను నమోదు చేస్తే చాలు. ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆప్‌లోని ‘హెల్ప్’ అనే మీటను నొక్కితే చాలు.. సన్నిహితులకు మీరున్న ప్రదేశంతో పాటు ఆదుకోవాలన్న ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్ వెళతాయి. ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్ అవుతుంది. అలాగే, రిజిస్టర్ చేసుకున్న ఫోన్ కు కాల్ కూడా వెళుతుంది. ‘‘గత నవంబర్ 18న వై.ఎస్. జగన్మోహనరెడ్డి గారు విడుదల చేసిన ఈ ఆప్‌ను ఇప్పటికి 10 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరింతమందికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాం’’ అని కిరణ్‌కుమార్ వివరించారు. ప్రత్యేకించి మహిళలకు ఈ ఆప్ అక్షరాలా అభయమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement