
నా కాలేయం 75 శాతం పాడైంది
బాలీవుడ్ బాత్
బాలీవుడ్ అసలే సంచనాలకు వేదికగా ఉంది. మొన్న ఆమిర్‌ఖాన్ సంచనలం నేడు అమితాబ్ బచ్చన్ సంచలనం. ఇటీవల హెపెటైటిస్ బి మీడియా అవేర్‌నెస్ కాంపెయిన్ జరిగింది. అందులో ముఖ్య అతిధిగా పాల్గొన్న అమితాబ్ బచ్చన్ తన కాలేయం 75 శాతం హెపెటైటిస్ బి వల్ల పాడైందని ప్రస్తుతం తాను 25 శాతం ఆరోగ్యంగా మిగిలిన కాలేయంతోనే సాధారణ జీవితం గడుపుతున్నానని తెలిపాడు. కూలీ సినిమా ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 40 బాటిళ్ల రక్తం ఎక్కించారనీ వాటిలో ఒక దానిలో హెపెటైటిస్ బి వైరస్ ఉండి అది తన శరీరంలో నిశ్శబ్దంగా చేరి కాలేయాన్ని తినేసిందనీ 2004 దాకా ఆ సంగతి తెలియలేదని ఆయన తెలిపాడు.
అప్పటి నుంచి మందులు స్థిరంగా తీసుకోవడంతో తాను సాధారణ జీవితం గడుపుతున్నానని కనుక కాలేయ ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరమని అమితాబ్ తెలియచేశాడు. అదే విషయాన్ని తన బ్లాగ్‌లో కూడా రాసుకున్నాడు.