
ఏ ఇద్దరూ ఒకరకంగా ఆలోచించరు. అందుకే పుర్రెకో బుద్ధి అంటారు. అయితే కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా ప్రతి విషయంలోనూ లౌక్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కొందరు అన్నింట్లోనూ సూటిగా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటారు. మనం ఎలా ఉంటున్నాం?
1. ఎవరైనా మీకు ఒకసారి పరిచయమైతే చాలు, ఇక ఎప్పటికీ వాళ్లు మీతో స్నేహపూరకంగానే ఉంటారు.
ఎ. అవును బి. కాదు
2. తరచుగా ఎదుటివారి నుంచి సహాయం పొందే వారి జాబితాలో మీరు ఉండరు, సహాయం చేసే జాబితాలోకే వస్తారు.
ఎ. అవును బి. కాదు
3. మీ స్నేహితులు అత్యంత రహస్యమైన సంఘటనలను కూడా మీతో పంచుకుంటారు. వారిని మిస్‌లీడ్ చేస్తారేమోనన్న సందేహం వారికి కలగదు.
ఎ. అవును బి. కాదు
4. మీరు ‘సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు, అలాగే వ్యవహరిస్తారు’ అని మీ గురించి తెలిసిన వాళ్లు కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలున్నాయి.
ఎ. అవును బి. కాదు
5. మీ కళ్లముందు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఏమీ పట్టనట్లు ఉండడం మీకు సాధ్యం కాదు. చేతనైన సహాయాన్ని చేస్తారు.
ఎ. అవును బి. కాదు
6. మీది పై చేయి అనిపించుకోవడానికి నిస్సహాయులపై చిరాకు పడడం వంటి చవకబారు ప్రవర్తనకు మీరు దూరం.
ఎ. అవును బి. కాదు
7. ఫ్రెండ్స్ కాని, బంధువులు కాని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముందు మీరే గుర్తుకువస్తారు.
ఎ. అవును బి. కాదు
8. మీరు ఎవరికి ఎన్ని రకాలుగా సహకరించినప్పటికీ ప్రతిఫలంగా వారి నుంచి ఏమీ ఆశించరు. కాని మీకు అవసరమైనప్పుడు వారి నుంచి సహకారాన్ని కోరడానికి బిడియపడరు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీది పారదర్శకమైన మనస్తత్వం. కుళ్లు, కుత్సితాలు మీకు దరిదాపుల్లో ఉండవు. స్నేహాన్ని పంచడం, ఆత్మీయతలను పెంచుకోవడంలో మీరు దిట్ట. ‘బి’లు ఎక్కువైతే మీరు నిష్కల్మషంగా, నిస్వార్థంగా ఉండడానికి మరికొంత ప్రయత్నించాల్సిందే.