possible
-
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్‌లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. -
ఉక్రెయిన్‌దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా?
Battlefield developments unclear, Russian and Ukrainian militaries: ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి యుద్ధంలో చాలా అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. తొలుత రష్యా ధాటికి ఉక్రెయిన్ సైన్యం నేలకొరిగిపోతుందేమో అన్నట్లు భయానకంగా విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్ గడ్డ ఎటూ చూసిన శవాల దిబ్బలతో హృదయవిదారకంగా మారిపోయింది. రష్యా బలగాలు మొదటగా కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా సాగిన దాడులు కాస్త విఫ్లలమయ్యాయి. దీంతో తూర్పు ఉక్రెయిన్ దిశగా బలగాలను మళ్లించి తీవ్రంగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రాంతాల నుంచి దాడులు చేసే వ్యూహంతో సాగి క్రమంగా పుంజుకోవడం ప్రారంభంమైంది. వేలాది ఉక్రెయిన్ సైనికులు నేలకొరగడంతో బలగాల కొరత, ఆయుధాల కొరతను ఎదుర్కొంది ఉక్రెయిన్. తదనంతరం పాశ్చాత్యదేశాల సహకారంతో రష్యాతో అలుపెరగని పోరు సాగించింది. అంతేకాదు రష్యా బలగాలు భీకరమైన దాడులతో ఉక్రెయిన్ భూభాగంలో ఐదోవంతును నియంత్రించింది. ఐతే అనుహ్యంగా ఈ నెలలో ఉక్రెయిన్ బలగాలు పుంజుకుంటూ రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి దక్కించుకుంది. తూర్పు డోన్బాస్ని స్వాధీనం చేసుకోవాలనుకున్న రష్యా అధ్యక్షుడు వ్యాదిమర్ పుతిన్ లక్ష్యాన్ని నిర్విర్వం చేసింది ఉక్రెయిన్ సైన్యం. ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధం రెండోవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చూసిన అతి పెద్ధ సాయుధ సంఘర్షణగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మేరకు యూఎస్ రక్షణ కార్యదర్శి లియోన్ పనెట్లా ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ...రష్యా ఒకవేళ ఓడుపోయే ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం అత్యంత ప్రమాదకరమైన అణుదాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉందన్న భయాందోళలను ఎక్కువ అవుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో లండన్ కింగ్స్ కాలేజ్‌లో యుద్ధ అధ్యయనాల ఎమెరిటస్ ప్రొఫెసర్, సైనిక చరిత్రకారుడు లారెన్స్ ఫ్రీడ్మాన్ మాట్లాడుతూ...ఈ యుద్ధం ఊహించని వాటిని తారుమారు చేస్తుందని చెప్పారు. ఇక రానున్న శీతకాలం యుద్ధ ప్రతిష్టంభనకు గురిచేస్తుందన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ...రష్యా పతనం దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు. రష్యా సైనిక ఓటమిని చవిచూస్తుందన్నారు. అదీగాక దళాల ఆయుధాలకు కీలకమైన ప్రాంతం ఇజియంను రష్యా వదిలివేయడం అదర్నీ ఆశ్చర్యపరిచిందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తన నివేదికలో పేర్కొంది. ఐతే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ దాని అసలు లక్ష్యాలను సాధించే వరకు దాడి కొనసాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరాఖండీగా చెప్పడం గమనార్హం. ఖార్కివ్ ఎదురు దాడిలో ఉక్రెయిన్ బలగాలు అనుహ్యంగా దాడులను తిప్పిడుతూ... మొహరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుందని రష్యన్ సైనిక నిపుణడు సీఎన్ఏ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ యుద్ధం రష్యన్ మిలటరీకి అనుకూలమైనది కాదని నర్మగర్భంగా చెప్పాడు. మానవశక్తి, సైనిక కొరత తదితర సమస్యలను రష్యా ఎదరుర్కొంటుందని తెలిపాడు. ఇటీవల రష్యా బలగాల తిరోగమనంతో రష్యా కూడా ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే ప్రజాభిప్రేయ సేకరణను నిలిపేసింది. మరోవైపు రష్యా ఈ దాడులను ఉపసంహరించుకోవాలనే రాజకీయ నిర్ణయం తీసుకోకపోతే తామే స్వయంగా వెళ్లి విజ్క్షప్తి చేస్తామని లండన్‌లోని ల్యాండ్ వార్ఫేర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో జాక్ వాట్లిగ్ చెబుతుండటం గమనార్హం. ఇదీ చదవండి: చందమామే దిగి వచ్చిందా! -
రక్షక – అనాథ
బెంగళూరుకి వచ్చి కాపురం పెట్టి ఇప్పటికే పదిహేనేళ్ళయింది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పరిచయం అయినవారు, ‘‘మీ ఊరు ఏది?’’ అని అడిగినపుడు ఒకట్రెండు క్షణాలు తబ్బిబ్బవుతాను. మొన్నమొన్నటివరకు ఊళ్ళో నేను పుట్టి పెరిగిన ఒక ఇల్లు ఉందనే ధైర్యముండేది. ఈ మధ్యనే దాన్ని కూడా అమ్మడం జరిగింది. వచ్చిన సొమ్ముతో బెంగళూరులో ఉన్న ఇంటి వంటింటిని ఆధునీకరించటమూ జరిగింది. ఇప్పుడు తప్పనట్టు ‘ఇదే ఊరివాడిని...’ అని బెంగళూరును అంగీకరిస్తున్నాను. విన్నవారు అకస్మాత్తుగా తాము బళ్లారి జిల్లా దగ్గరి ఊరివారని చెబితే చాలు, ‘‘అరే! నేనూ మీ ఊరివాడినేనండి’’ అని అనేటప్పుడు నాలో సంతోషం ఉప్పొంగేది. ఊళ్లోని ఇంటిని అమ్మటం అత్యంత బాధాకరమైన విషయం. పాలు తాగించి, పెంచిన ఇంటి పెద్ద ఆవును కసాయిఖానాకు అమ్మినట్టే. అయితే వాస్తవమైన విషయాలు మన భావుకతను నలిపివేస్తాయి. ఇంటిని అద్దెకు ఇస్తే దాని అద్దె సొమ్మును జనం సరిగ్గా ఇవ్వరు. ఖాళీగా వదిలేస్తే ఇల్లు పాడుబడి పరులపాలవుతుంది. బెంగళూరులోని రియల్ ఎస్టేట్ చూసిన నాకు, ఊళ్ళోని ఇల్లు కేవలం భావనాత్మకమైన సంబంధంగా మిగిలిపోవటం మాత్రం చేదు నిజం. చివరికి అమ్మటానికి నిర్ణయించుకున్నాను. సుమారు నాలుగేళ్లపాటు వాళ్ళకీ వీళ్ళకీ చెప్పుకున్న మీదట ఒకరు కొనటానికి ఒప్పుకున్నారు. రిజిస్ట్రేషన్ పనులు సాఫీగా ముగిశాయి. ఇంట్లో ఉన్న వస్తువులను నేను, అక్క మాకు కావలసినవన్నీ ఉంచుకుని మిగిలినవాటిని వాళ్ళకు వీళ్ళకు ఇచ్చాం. వస్తువులన్నీ పంచుకున్నప్పటికీ ఇంట్లో ఉన్న దేవుడి పాతపటాలను ఏమిచేయాలో తోచలేదు. ఒక్క మేకును కొట్టడానికీ సంకోచించేటటువంటి కొత్త ఇంటిని కట్టుకున్న మేము, ఈ పాత దేవుడి పటాలను ఎలా ఉపయోగించాలి? దగ్గర్లోని దేవాలయానికి వెళ్లి అర్చకులను ఈ పటాలు కావాలా అని అడిగితే కరాఖండిగా వద్దని నిరాకరించారు. ‘‘తరతరాలుగా ఈ ఊళ్ళో బతికిన ఇంటివాళ్లు ఇప్పుడు ఇల్లు అమ్ముకుని బెంగళూరు చేరుకుంటున్నారప్పా. అందరి ఇళ్ల దేవుడి పటాలను పెట్టుకుని నన్నేం చేయమంటావు?’’ అని అసహనం, దుఃఖం కలగలిసిన స్వరంతో అన్నారు. ఇంట్లోని ఇతర వస్తువులను వాళ్ళూ వీళ్ళూ సంతోషంతో తీసుకున్నప్పటికీ, పటాలను మాత్రం వద్దన్నారు. అడవికి వెళ్ళి ఏదైనా చెట్టుకింద పెట్టెయ్మని కొందరు సలహా ఇచ్చారు. మేము పూజించిన దేవుడి పటాలను అలా అనాథగా ఎక్కడో పెట్టి రాగలమా? అంతకు మించి అడవి అంటే భయం ఉన్న నాకు అలా త్యాజ్యవస్తువులను అడవిలో వదిలివేయటానికి కచ్చితంగా మనసొప్పలేదు. ఈ దేవుడి పటాలు నేను ఊహించినదానికన్నా పెద్ద సమస్యగా మారిపోయాయి. అమ్మా–నాన్నలు మహా దైవభక్తులు. ఇంటికి క్యాలెండర్ రూపంలో ఏ దేవుడు వచ్చినా సరే, దాన్ని ఇంటి నుంచి బయటికి పంపే ఊసే లేదు. ఆ క్యాలెండర్లో ఉన్న నెలలు–రోజుల వివరాలు కేవలం నెపం మాత్రమే. కళకళలాడే దేవుడి చిత్రం మాత్రం వారికి ముఖ్యమైంది. సంవత్సరం ముగిసేలోపు దానికి ఫ్రేవ్‌ు వేయించి, ఎలాంటి సంకోచం లేకుండా గోడకు మేకు కొట్టి, దేవుడి ఫొటోను వేలాడదీసి, మరుసటి రోజు నుంచి కుంకుమ పెట్టి మంగళారతి చేసేవారు. ఇక తీర్థక్షేత్రాలకు వెళితే, అక్కడి ప్రముఖమైన దేవుడి ఫొటోను తప్పకుండా తెచ్చేవారు. ధర్మస్థలానికి చెందిన మంజునాథుడు, తిరుపతి వెంకటేశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్రస్వామి, ఉడిపి కృష్ణప్ప, కుక్కె సుబ్రహ్మణ్యం, సన్నుతి చంద్రలాంబ, హంపి యంత్రోద్ధార, పూరీ జగన్నాథ, కాశీ విశ్వనాథ, బదిరి నారాయణ, కొల్హాపూర్ మహాలక్ష్మి... ఒకటా, రెండా? తాము వెళ్లివచ్చిన పుణ్యక్షేత్రాలు, ఇతరులు వెళ్లివచ్చి ప్రసాదంతోపాటు ఇచ్చిన దేవుడి ఫొటోలు అన్నీ ఇంటి గోడ మీద అలంకరింపబడేవి. ఇంటి బయట తలుపుమీద భూతరాజుగారు. రాత్రి మేము పడుకున్నప్పుడు ఆ దేవతలందరూ మెలకువగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నటువంటి భావం ఏర్పడేది. ఏదైనా తప్పుచేస్తే ఆ దేవుళ్ల కోపపుదృష్టిని ఎదుర్కోవడానికి గుండె వణికేది. మంచి పనులు చేస్తే నవ్వుముఖంతోనే అందరూ ఆశీర్వదించేవాళ్లు. ఒక విధంగా చూస్తే ఇంట్లో ఒక్కరమే ఉన్నామనే భావన మాకు ఎన్నడూ కలగలేదు. తీర్థ క్షేత్రాలకు సంబంధం లేని, అయితే కొన్ని పండుగలకు లేదా పూలకు మాత్రమే కావలసిన కొందరి దేవతల ఫొటోలు ఉన్నాయి. సత్యనారాయణస్వామి, వటసావిత్రి, సూర్యనారాయణస్వామి, పురందరదాసు, బుధబృహస్పతి, వరమహాలక్ష్మి మొదలైనవి. వటసావిత్రిని పున్నమినాడు పూజించి, సాయంకాలం పూట సావిత్రి కథను అమ్మ చదివేది. పాట వినడానికి మడికట్టుకున్న కాశవ్వ గుమ్మం దగ్గరికొచ్చి కూర్చునేది. సత్యవంతుడి ఆత్మను యమధర్మరాజు యమపాశం వేసి లాక్కునిపోతున్న సందర్భం వచ్చినపుడు వెక్కివెక్కి ఏడ్చేది. తెలిసిన ఆ కథనే ప్రతీ సంవత్సరం వింటున్నప్పుడు కూడా ఏడుపు తప్పకుండా వచ్చేది. ‘‘ఎంతటి పతివ్రత చూడమ్మా, యముడి వెంటపడి, ముత్తయిదువుతనం కాపాడుకుంది. నా భర్త చనిపోయినపుడు నాకూ అలాగే అతడి వెంటపోయి పోట్లాడి భర్తను తిరిగి తీసుకుని రావాలని అనిపించింది. అయితే మనలాంటి అల్పులకు ఆయన ఎలా కనిపిస్తాడో చెప్పు’’ అని తప్పకుండా చెప్పేది. పురందరదాసుల పుణ్యతిథిన ఉదయం నుంచి రాత్రి పడుకునేవరకు దాసులపాట, భజన జరిగేది. అమ్మ, అక్క ఇద్దరూ మధురంగా పాడేవారు. నాకు పాడటానికి రాకపోయినా భజనలో ఆడంబరంగా భాగం వహించేవాడిని. గుంపులో కలిసి పాడటానికి మంచి కంఠస్వరం అవసరం ఉండదు. పాడాలనే ఉత్సాహం వుంటేచాలు. ఇరుగుపొరుగు ఇళ్లవాళ్లంతా పాల్గొనేవాళ్లు. నేనే చిత్రించిన హనుమంతుడి చిత్రమొకటి ఇంట్లో ఉండేది. పాఠశాలలో జరిగిన చిత్రకళా పోటీలో నేను ఆ హనుమంతుడి చిత్రాన్ని వేశాను. పర్వతాన్ని చేత్తో మోసుకుని, సముద్రాన్ని లంఘించే హనుమంతుడి చిత్రమది. అతడి తోక అతడి పొడవైన దేహాన్ని చుట్టి తలమీదికి వచ్చింది. ఆ చిత్రానికి కన్సొలేషన్ బహుమతి ఇచ్చారు. అక్క ఆ చిత్రాన్ని చూసి పదేపదే తమాషా చేసింది. ‘‘నీ హనుమంతుడు సరిగ్గా భోజనమే చేయలేదు. కడ్డిపైల్వాన్లా ఉన్నాడు’’ అనేది. ‘‘తోక కిందికి కదిలిస్తూ ఉండాలి. అది ఎలా ఆకాశంవైపు నిటారుగా నిలబడి ఉంటుంది’’ అని తార్కికమైన ప్రశ్న వేసేది. అమ్మ మాత్రం అక్క వ్యంగ్యమైన మాటలను సమర్థించక ఆ చిత్రానికి ఫ్రేము వేయించి, మిగిలిన దేవుళ్ళ మధ్యన చేర్చింది. అయితే అక్క కూడా ఆ పటాన్ని భక్తితో పూజించే సమయం రానే వచ్చింది.అక్కకు రెండుమూడు సంబంధాలు చూసినా ఏవో కుంటిసాకులతో సంబంధాలు కుదరలేదు. అమ్మా, నాన్నలకు కలవరం మొదలైంది. అక్కలో విచిత్రమైన ఓటమి భావన. అప్పుడు ఎవరో పెద్దవాళ్లు రోజూ హనుమంతుణ్ణి పూజించి, తోకకు ఒక్కొక్క గంధపు బొట్టు పెట్టమని చెప్పారు. అక్క ఎలాంటి సలహా అయినా పాటించటానికి సిద్ధంగా ఉంది. నా హనుమంతుడి తోక రోజుకొక గంధపు చుక్కతో చల్లబడసాగింది. తోకంతా గంధపు చుక్కలతో మూసుకుపోయేటంతలో అక్కకు సంబంధం కుదిరింది. ‘‘ఈ పటంలోని హనుమంతుడు మహా సత్యవంతుడు’’ అని అమ్మ అందరి ముందు చెప్పుకుంటూ తిరిగింది. అక్కకూ ఆ హనుమంతుడి మీద ఎక్కడలేని భక్తి పెరిగి, ఆయన కడ్డి దేహం కానీ, తర్కానికి అందని నిటారుగా నుంచున్న తోకకానీ కనిపించకుండా పోయాయి. అమ్మ మాటను విని ఇంకో ఇద్దరు అమ్మాయిలు గంధం పూసి భర్తలను పొందారు. అందరిలా కృష్ణవేణమ్మ తన కూతురు మంజి చేత ఆ పటానికి పూజ చేయించింది. తోక మూసుకుపోయేటంతగా గంధం పూసినా మంజికి సంబంధం కుదరలేదు. ‘‘నా కూతురి నుదుట కళ్యాణ యోగం రాయకపోతే ఏ దేవుడు మాత్రం ఏం చేస్తాడులెండి’’ అని కృష్ణవేణమ్మ తప్పును కూతురి నుదుటి రాత మీద తోసి దేవుడి మహిమను కాపాడింది. గండి నరసింహస్వామి ఇంటి దేవుడైనప్పటికీ మూల విగ్రహం ఫొటో మాత్రం ఇంట్లో ఉండలేదు. దానికి కారణం లేకపోలేదు. ఆ దేవుడు ఎంతటి సత్యవంతుడంటే ఫొటో తీస్తే, ఫొటో వచ్చేదేకాదు. ఓ ఆంగ్ల మహిళ పట్టుబట్టి దొంగతనంగా ఆ దేవుడి ఫొటో తీసినప్పటికీ, ఉగ్ర నరసింహుడి కోపానికి గురై రక్తం కక్కుకుని చచ్చిపోయిందట. గుర్రం మీద వచ్చిన ఆమె ఫొటో గుడి గోపురం మీద ఇప్పటికీ ఉంది.మా అందరి నమ్మకాన్ని తలకిందులు చేసేలా గోపణ్ణ కుమారుడు ప్రహ్లాద బెంగళూరు నుంచి వచ్చాడు. పెద్దనగరం తళుకు బెళుకులను చూసిన ప్రహ్లాద ఎవరికీ తెలియకుండా దేవుడి ఫొటోను క్లిక్ చేశాడు. అతడికి మా అందరి మూఢనమ్మకాన్ని అబద్ధం చేసిన సంతోషం. ‘‘చూడండి...చూడండి..’’ అని నవ్వుతూ ఆ ఫొటోను అందరికీ చూపిస్తూ వచ్చాడు. మా తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది. ‘‘దేవుడిని అబద్ధం చేయాలనే పాడుబుద్ధి ఈ వెధవకి. అదేం సాధిస్తాడో...’’ అని అమ్మ సగం బాధ, సగం కోపంతో అంది. అయితే ఆ ఫొటోను మాత్రం ఇంట్లో పెట్టుకోవడానికి ఇద్దరూ అంగీకరించలేదు. ఊరికి వెళ్ళే రోజున అతడిని భోజనానికి పిలిచింది. వేడి పప్పుపులుసు, అన్నం మహాకారంగా ఉంది. ఒక ముద్ద మింగటం ఆలస్యం, ప్రహ్లాదకు కారం నెత్తికెక్కింది. కళ్లలోంచి, ముక్కులోంచి నీళ్లుకారి గుడ్లు మిటకరించసాగాడు. అతడికి నీళ్లు తెచ్చి ఇవ్వటం మరిచిన అమ్మ, ‘‘ఉగ్ర నరసింహుడికి తప్పయిందని వేడుకోప్పా... అంతా సరిపోతుంది...’’ అని ఒత్తిడి పెట్టసాగింది. ఇంట్లో ఉన్నవి కేవలం దేవుడి ఫొటోలు మాత్రమే కావు. పెద్దవాళ్ళ ఫొటోలూ ఎన్నో ఉన్నాయి. ఒళ్ళు కూలబడిపోయేటంతగా నగలు, వస్త్రాలను ధరించి కుర్చీమీద కూర్చున్న అమ్మమ్మ, ఆమె పక్కన కోటు–ధోవతి ధరించి, చేతిలో పొన్నుకర్ర పట్టుకుని నుంచున్న తాతయ్య. ఆ ఫొటో పక్కనే జంటగా నుంచున్న అమ్మానాన్నల ఫొటో. ఊటీకి హనీమూన్ కోసం వెళ్లినపుడు భుజం మీద చేయి వేసి నుంచున్న అక్కాబావల కలర్ ఫొటో. నేను పసివాడిగా ఉన్నప్పుడు జంబుఖానా మీద పడుకుని తల పైకెత్తిన ఫొటో. ఇందిరాగాం«ధీ ఊరికి వచ్చినపుడు ఆమెకు అక్కయ్య పూలదండ వేసేటప్పుడు తీసిన ఫొటో. నాన్న పట్టా పొందినపుడు నల్లకోటు, టోపీ వేసుకుని తీయించుకున్న ఫొటో. అమ్మ చేతికి వాచీ కట్టుకుని తన స్నేహితురాలితో తీయించుకున్న ఫొటో. ఇవికాక అక్క బొత్తాలతో అల్లిన బాతు బొమ్మ.మాకు తెలియని ఒక స్త్రీ ఫొటో ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆమె పేరు రిందమ్మ. పెద్దపెద్ద కళ్లున్న ఆమె ముఖం మీద కాస్త కూడా నవ్వు లేకుండా, భయంకరంగా, గంభీరంగా ఉండేది. నాన్నకు ఆ ఫొటో పట్ల చాలా గౌరవం. అయితే ఆయనకూ ఆమె ఎవరో తెలియదు. అయితే పితృపక్షం రోజున ఆమెకు తప్పకుండా పిండప్రదానం జరిగేది. నాన్న రెండవ చిన్నాన్న పెళ్ళిలో తీసిన ఒక గ్రూప్ ఫొటో ఉండేది. అందులో నాన్న అచ్చం నాలాగే ఉన్నారు. ఆ చిన్న వయస్సులోనే ధోవతి కట్టుకుని, కోటు వేసుకుని, తలకు ఒక టోపీ పెట్టుకున్నారు. పాఠశాల ఫ్యాన్సీ డ్రెస్ పోటీకి అక్క నాకు అదే వేషం వేసింది. మొదటి బహుమతి వచ్చింది. మా ఇంటికి పెద్దవాళ్లు ఎవరు వచ్చినా ఆ ఫొటోను గంటలకొద్దీ చూస్తూ కూర్చునేవారు. ఈమె సుందరమ్మ, ఇతను అనంతు, ఇతను గుండు చిన్నాన్న అని గుర్తించి సంతోషపడేవారు. అయితే నాన్న పిన్నికి మాత్రం ఈ ఫొటో చూస్తే సరిపడేదికాదు. ఎందుకంటే ఆమె ఆ ఫొటోలో లేదు. చిన్నాన్న పక్కన కూర్చున్న అతడి మొదటి భార్య పెళ్ళయిన సంవత్సరంలోనే కాన్పులో చనిపోయింది. ‘‘చచ్చిన తరువాత కూడా ఎంత పీడించిందమ్మా ఈ నా సవితి...’’ అని నఖశిఖపర్యంతం మండిపడేది. అయితే కాన్పులో బతికిపోయిన సరోజక్క మాత్రం కళ్లు విప్పార్చుకుని తను చూడని తల్లిని చూస్తూ నుంచునేది. రెండు వందలకు పైగా ఉన్న ఫొటోలను ఇల్లు కొన్నవారు తెచ్చి నాకు ఇచ్చారు. ఒక్కొక్క ఫొటోను చూసినప్పుడంతా తోసుకొచ్చే జ్ఞాపకాలు. అయితే వాటిని ఎలా రక్షించాలి? నా జీవితానికి అనుమతి ఇచ్చి నడిపించిన దేవాధిదేవతలు, పెద్దలు నా వైపు నిస్సహాయ దృక్కులతో ‘‘ఎలాగైనా కాపాడు’’ అని వేడుకోసాగారు. ఉగ్రనరసింహుడి గోర్లు మొండివయ్యాయి. లక్ష్మి చేతి నుంచి కురిసే బంగారు నాణేలు మెరుపు పోగొట్టుకున్నాయి. సత్యనారాయణుడి ఇరుపక్కలున్న అరటి ఆకులు వాడిపోయాయి. సూర్యభగవానుడికి గ్రహణం పట్టింది. రెండు రోజులు ఆలోచించిన తరువాత ఒక ఉపాయం స్ఫురించింది. ఫొటోల బొత్తిని విప్పి, ఫ్రేము, అద్దాలు తొలగించి, జాగ్రత్తగా ఫొటోలను బయటికి తీశాను. ప్రతీ చిత్రాన్ని స్కానర్‌లో పెట్టి, సాఫ్ట్ కాపీ తయారుచేశాను. అన్ని ఫొటోల చిత్రాలను ఒక సీడీలో సంగ్రహించాను. ఆ íసీడీని చిటికెన వేలికి చిక్కించి ఎత్తి పట్టుకున్నప్పుడు గోవర్ధనగిరిధారిలా పులకించాను. ముక్కోటి దేవతలను నా చిటికెనవేలి చివరన ఎత్తి పట్టుకున్నాను. ఇప్పుడు నా కంప్యూటర్ తెరమీద ఈ దేవతలూ, పెద్దలూ స్క్రీన్‌సేవర్ అయ్యారు. నేను కొద్దిసేపు పని ఆపితే చాలు, ఒక్కొక్కరుగా వచ్చి చిన్న తెరమీద దర్శనమిస్తారు. ఆ ఫొటోలను చూసినపుడు ఒక్కసారిగా బాల్యంలోకి పరుగులుపెట్టిన వెచ్చటి అనుభవం నాకు కలుగుతుంది. నా సహోద్యోగులు, ‘‘అరెరె, ఈ ఫొటో మా ఇంట్లో ఉండేది... ఈ ఫొటో మా ఇంట్లో ఉండేది...’’ అని గుర్తించేవారు. కన్నడ మూలం : వసుధేంద్ర అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారా?
ఏ ఇద్దరూ ఒకరకంగా ఆలోచించరు. అందుకే పుర్రెకో బుద్ధి అంటారు. అయితే కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా ప్రతి విషయంలోనూ లౌక్యాన్ని ప్రదర్శిస్తుంటారు. కొందరు అన్నింట్లోనూ సూటిగా క్రిస్టల్ క్లియర్‌గా ఉంటారు. మనం ఎలా ఉంటున్నాం? 1. ఎవరైనా మీకు ఒకసారి పరిచయమైతే చాలు, ఇక ఎప్పటికీ వాళ్లు మీతో స్నేహపూరకంగానే ఉంటారు. ఎ. అవును బి. కాదు 2. తరచుగా ఎదుటివారి నుంచి సహాయం పొందే వారి జాబితాలో మీరు ఉండరు, సహాయం చేసే జాబితాలోకే వస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీ స్నేహితులు అత్యంత రహస్యమైన సంఘటనలను కూడా మీతో పంచుకుంటారు. వారిని మిస్లీడ్ చేస్తారేమోనన్న సందేహం వారికి కలగదు. ఎ. అవును బి. కాదు 4. మీరు ‘సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు, అలాగే వ్యవహరిస్తారు’ అని మీ గురించి తెలిసిన వాళ్లు కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఎ. అవును బి. కాదు 5. మీ కళ్లముందు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఏమీ పట్టనట్లు ఉండడం మీకు సాధ్యం కాదు. చేతనైన సహాయాన్ని చేస్తారు. ఎ. అవును బి. కాదు 6. మీది పై చేయి అనిపించుకోవడానికి నిస్సహాయులపై చిరాకు పడడం వంటి చవకబారు ప్రవర్తనకు మీరు దూరం. ఎ. అవును బి. కాదు 7. ఫ్రెండ్స్ కాని, బంధువులు కాని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముందు మీరే గుర్తుకువస్తారు. ఎ. అవును బి. కాదు 8. మీరు ఎవరికి ఎన్ని రకాలుగా సహకరించినప్పటికీ ప్రతిఫలంగా వారి నుంచి ఏమీ ఆశించరు. కాని మీకు అవసరమైనప్పుడు వారి నుంచి సహకారాన్ని కోరడానికి బిడియపడరు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీది పారదర్శకమైన మనస్తత్వం. కుళ్లు, కుత్సితాలు మీకు దరిదాపుల్లో ఉండవు. స్నేహాన్ని పంచడం, ఆత్మీయతలను పెంచుకోవడంలో మీరు దిట్ట. ‘బి’లు ఎక్కువైతే మీరు నిష్కల్మషంగా, నిస్వార్థంగా ఉండడానికి మరికొంత ప్రయత్నించాల్సిందే. -
మిషన్ పాజిబుల్
పొడుగురావు ఆ అడవిలో తపస్సు మొదలు పెట్టి ఆరు వారాలు దాటిపోయింది. గడ్డంమీసాలు ఎడాపెడా పెరిగి భయపెడుతున్నాయి. ఒకానొకరోజు తపోసమాధిలో ఉన్న పొడుగురావును ఎవరో భుజం తట్టారు. ‘ఖచ్చితంగా... గాడే’ అనుకుంటూ కళ్లు తెరిచాడు. కానీ ఎదురుగా ఫారెస్ట్ గార్డ్!‘‘ఈ జంగల్ల ఏంచేస్తున్నవయ్యా పెద్దమనిషి?’’ అని పొడుగురావును అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. గార్డ్‌తో లొల్లి ఎందుకని, అతని కంటపడకుండా కాస్త దూరంలో పొదల చాటున తిరిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు పొడుగురావు. రెండో రోజు...ఎవరో రావు భుజం తట్టారు. ‘‘ఛ...ఇక్కడ కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకోనివ్వడం లేదు ఈ గార్డ్’’ అని తిట్టుకుంటూ కళ్లు తెరిచాడు.కాని ఎదురుగా ఉన్నది గార్డ్ కాదు...స్వయానా గాడ్! ‘భక్తా! టైమ్ వేస్ట్ చేయకుండా నీ బాధ ఏమిటో మూడు ముక్కల్లో చెప్పు’’ చేతికి ఉన్న డైమండ్ వాచ్‌ను చూస్తూ అడిగాడు గాడ్.‘‘నా భార్య నేను ఏది చెప్పినా అందుకు వ్యతిరేకంగా చేసి బాధ పెడుతుంటుంది. పెళ్లైన కొత్తలో...మీకు ఏ కూర అంటే ఇష్టం ఉండదు? అని అడిగింది. కాకరకాయ కూర అని పొరపాటున చెప్పాను. ఇక చూస్కోండి...మరుసటి రోజు నుంచే కాకర ఇడ్లీలతో పొద్దున టిఫిన్, కాకరపొడితో కాఫీ, కాకరకాయ వేపుడు, కాకర పులుసులతో లంచ్, ఇక రాత్రి కాకర పుల్కాలు...లేస్తే కాకరా... కూర్చుంటే కాకరా...నేనో బకరా’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు పొడుగురావు. ‘‘ఇప్పుడు నన్నెం చేయమంటావు?’’ సానుభూతిగా అడిగాడు గాడ్.‘‘నా భార్యకు నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా... నాకో వరం ఇవ్వు స్వామి’’ అని గాడ్‌ను దీనంగా వేడుకున్నాడు మిస్టర్ రావు. ‘‘వరాల స్కీమ్ ఎప్పుడో అటకెక్కింది. ఇప్పుడు ఎంత సిన్సియర్ భక్తులకైనా, సీనియర్ భక్తులకైనా వరాలు ఇవ్వడం లేదు. ‘దేవలోకం టైమ్స్’ న్యూస్‌పేపర్ చదవడం లేదా ఏమిటి?’’ ఆరా తీశాడు గాడ్. ‘‘ఆ న్యూస్‌పేపర్ సంగతి నాకెందుగానీ... నాకు విముక్తి లేదా స్వామీ?’’ మరింత దీనంగా అడిగాడు రావు.‘‘వరాలతో పనులయ్యే రోజులు పోయాయి. టెక్నాలజీ ఆ లోటును తీర్చుతుంది. ముంబైలో ఉండే పేరు మోసిన సైంటిస్ట్ జఫ్ఫా జమాల్కర్ ఫోన్ నంబర్ ఇస్తాను. జప్ఫా దగ్గరకు వెళ్లి ‘మిషన్ పాజిబుల్’ అనే మిషిన్‌ను కొంటే సరిపోతుంది. ప్రాబ్లం సాల్వ్’’ అభయం ఇచ్చాడు గాడ్.‘‘ఆ మిషిన్ వల్ల ఉపయోగం ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు పొడుగురావు.‘‘సైబోర్గ్ అనే పదం ఎప్పుడైనా విన్నావా? కచ్చితంగా విని ఉండవులే. చెప్తాను విను. మనుషుల్లా పనిచేసే రోబోల గురించి నీకు తెలుసు. ఇప్పుడు రివర్స్‌గేర్ అన్నమాట. మనుషులే రోబోల్లా పనిచేసే టెక్నాలజీని మీ సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. మనిషి శరీరంలోకి అతి సూక్ష్మమైన చిప్స్‌లను ప్రవేశపెట్టడం ద్వారా... రోబోతో సమానమైన శక్తిసామర్థ్యాలు మనిషికి వస్తాయి. సైబోర్గ్ సిస్టం ద్వారా ఎదుటి వ్యక్తి ఆలోచలను కూడా నియంత్రించే టెక్నాలజీని జఫ్ఫా జమాల్కర్ కనిపెట్టాడు. సపోజ్... ఒకడు కోపంగా నిన్ను తిట్టడానికి వచ్చాడు అనుకుందాం. ‘మిషన్ పాజిబుల్’లో ‘పొగిడింగ్’ అనే మీటను నొక్కితే చాలు తిట్టడానికి వచ్చినవాడు కాస్తా... నిన్ను వేనోళ్ల పొగిడి పోతాడు. ప్రత్యర్థి మెదడులోకి ‘మిషన్ పాజిబుల్’ చిప్‌ను ప్రవేశపెడితేనే మనం ఇచ్చే కమాండ్స్ వర్కవుటవుతాయి’’ చెప్పాడు గాడ్. ‘థ్యాంక్ గాడ్’ అని చెప్పి సెలూన్లో షేవింగ్ చేసుకోకుండానే డైరెక్ట్‌గా ముంబాయిలోని సైంటిస్ట్ జప్ఫా జమల్కార్ ఇంట్లో ప్రత్యక్షమైన రావు, ‘మిషన్ పాజిబుల్’ మిషిన్‌ను నిమిషాల్లో కొనేశాడు. ‘వెధవ నిద్రా నువ్వూనూ...లే...ఆఫీసుకు టైమవుతుంది’ అని రోజూ తిట్ల దండకం వినిపించే రావు భార్య పంకజం ఈరోజు మాత్రం తన కాళ్లు నొక్కుతూ...‘ఏమండీ...మధ్యాహ్నం వరకు హాయిగా నిద్రపోండి. తిన్నాక మళ్లీ పడుకోండి. అవసరమైతే ఆఫీసుకు సెలవు పెట్టండి’ అంటూ ‘భర్తను మించిన భాగ్యం ఉన్నదా!’ అనే పాట అందుకుంది. సంతోషం తట్టుకోలేక ఆనందబాష్పాలు తుడుచుకున్నాడు రావు. ఈ దెబ్బకు నిద్ర నుంచి మెలకువ వచ్చింది. ‘‘ఓస్...ఇప్పటి వరకు నేను కలకన్నానన్నమాట’’ అని నిట్టూర్చాడు విమానంలో నిద్ర నుండి లేచిన రావు. ఫ్లైట్ శంషాబాద్‌లో ల్యాండ్ కాగానే జెట్ స్పీడ్ వేగంతో ఇంట్లోకి వచ్చి పడ్డాడు. ‘మిషన్ పాజిబుల్’ సహాయంతో చిప్‌ను భార్య పంకజం మెదడులోకి పంపడంలో సక్సెస్ అయ్యాడు . మరుసటి రోజు...‘‘ఒసేయ్ పంకజం...నేనూ ఇవ్వాళ ఆఫీసుకు వెళ్లకుండా అదే పనిగా తాగుతుంటాను. నువ్వు మధ్య మధ్యలో చికెన్–65, మటన్–25లు వేడివేడిగా అందిస్తూ ఉండాలి. వెళ్లు ...వెళ్లి పనిచూడు’’ భార్యను ఆదేశించాడు రావు. క్షణం గ్యాప్ లేకుండా రావు గూబ గుయ్యిమంది పెద్ద సౌండ్‌తో. పంకజం చేతిలోని అప్పడాల కర్ర రావు తలపై అదేపనిగా సల్సా డ్యాన్స్ చేసింది.‘డ్యామిట్ కథ అడ్డం తిరిగింది’ అని మొత్తుకుంటూ సైంటిస్ట్ జఫ్ఫాను కలవడానికి తిరిగి ముంబైకి వెళ్లాడు రావు. జరిగినదంతా అతనికి చెప్పి ఏడ్చాడు. ‘‘నీ భార్య నీకన్నా తెలివైంది. ముందుగానే జాగ్రత్త పడింది. మిషన్ పాజిబుల్ చిప్‌ను ఎప్పుడో నీ మెదడులో ప్రవేశపెట్టింది. నీ మెదడులో ఆ చిప్ ఉన్నంత వరకు నీ కమాండ్స్ ఎదుటి వ్యక్తి మీద పని చేయవు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మెదడులో నుంచి ఆ చిప్‌ను తీసివేస్తే సరిపోతుంది. మిషన్ ఇంపాజిబుల్ బేషుగ్గా పనిచేస్తుంది. నువ్వు చెప్పినట్లే నీ భార్య వింటుంది. ముందు ఆ చిప్‌ను తీసివేయాలి. ఇలా కూర్చో’’ అని రావును కూర్చోపెట్టి ఏదో యంత్రం బిగించాడు జఫ్ఫా. అయిదు నిమిషాల తరువాత...‘‘అదేంటయ్యా...అసలు నీ తలలో మెదడే లేదు. ఖాళీ బుర్రతో ఇన్ని రోజులు నీ భార్య దగ్గర ఎలా మేనేజ్ చేశావు? ఆ చిప్ మెదడులో తప్పా ఏ శరీరావయవంలోనూ పనిచేయదు. మెదడేలేని నీలో ఆ చిప్ పనిచేయడం అసాధ్యం’’ అని పెదవి విరిచి రావును వెనక్కి పంపిచేశాడు సైంటిస్ట్ జఫ్ఫా. హైదరాబాద్ వెళ్లడానికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కూర్చున్న రావుకు ఏదో విషయం చటుక్కున గుర్తొచ్చింది. సంతోషం కట్టలు తెంచుకుంది. ‘వస్తున్నా సార్...’ అంటూ సైంటిస్ట్ ఇంటికి పరుగులు తీశాడు. ‘‘ఏమిటయ్యా మళ్లీ వచ్చావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు సైంటిస్ట్.‘‘సార్...నాకు మెదడు లేదని మీరు తేల్చి చెప్పారు. కాని అది నిజం కాదు సార్. నా భార్య పంకజం నన్ను ఎప్పుడూ ఒక తిట్టు తిడుతుంది. ‘నీకు మెదడు తలలో లేదు. మోకాళ్లలో ఉంది’ అని. మోకాళ్లలో ఉన్న ఆ చిప్‌ను తీసివేయండి సార్’’ అని సైంటిస్ట్ కాళ్ల మీద పడ్డాడు పొడుగురావు! – యాకూబ్ పాషా -
ముస్లింలకు రిజర్వేషన్లు సాధ్యమేనా..?
-
తడిసి ముద్దయిన రాజధాని న'గరం'!
న్యూఢిల్లీః నిన్నమొన్నటిదాకా నిప్పులు కురిపించిన దేశ రాజధాని నగరం ఢిల్లీ.. తడిసి ముద్దయింది. నల్లని మబ్బులతో చల్లని గాలులతో వచ్చిన వానజల్లులకు వాయువ్య, నైరుతి ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో ప్రజలు పులకించిపోయారు. వచ్చే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరునుంచి సాధారణ వర్షాలు అనేక ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వానజల్లులతో రాజధాని నగరం తడిసిముద్దయింది. వచ్చే 24 గంటల్లో వాయువ్య , నైరుతి ఢీల్లీ ప్రాంతాల్లోని జింద్, పానిపట్, గానౌర్, కర్నాల్, రోహ్తక్ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం, తుఫాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అలాగే బాగాదుర్గర్, ఝజ్జర్, ఐజిఐ విమానాశ్రయం, కోస్లీ, హసన్ పూర్ ప్రాంతాల్లో కూడ వచ్చే రెండు మూడ గంటల్లో వర్ష సూచన ఉన్నట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని వాతావరణం సుమారు 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో సాధారణ మబ్బులతో కూడి ఉందని, ఈ కాలంలో ఉండాల్సిన కంటే సగటున రెండు డిగ్రీలు తక్కువగా ఉన్నట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. గరిష్ణ ఉష్ణోగ్రత సుమారు 39 డిగ్రీల సెల్సియస్ ఉండగా, ఉదయం 8.30 గంటల సమయంలో వాతావరణంలో తేమ 60 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
వాటర్ గ్రిడ్ నిర్మాణం సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణం ముమ్మాటికీ సాధ్యమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పునరుద్ఘాటించారు. దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్లో విజయవంతమైన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు అక్కడి పంచాయతీరాజ్ వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర అధికారుల బృందంతో కలసి శనివారం ఆయున గుజరాత్ రాష్ట్రానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా.. తొలి రోజు శనివారం మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు గాంధీనగర్‌లో పర్యటించారు. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, వాటర్ బోర్డు చైర్మన్ రాజీవ్ కే గుప్తాతో సమావేశమై ప్రాజెక్టు డిజైన్, నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంపై వివరంగా చర్చించారు. వాటర్ గ్రిడ్ ఆలోచన మొదలుకుని ఆచరణ దాకా ఆ రాష్ట్ర అధికారులు రూపొందించిన ప్రణాళికను పరిశీలించారు. నర్మదా డ్యామ్ నుంచి వివిధ ప్రాంతాలకు మంచినీటిని తరలించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీకి ముందు గాంధీనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నీటిని సరఫరా చేసే ‘పానీ సమితి’ సభ్యులతో సవూవేశవుయ్యూరు. ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత, పరిమాణం, సౌకర్యాలపై జనం స్పందనను తెలుసుకున్నారు. గాంధీనగర్జిల్లా మానస తాలుకాలోని అమర్పూర్ గ్రామంలో ఈ-పంచాయతీ వ్యవస్థను మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. గతంలో ఉన్న విధానంతో పోల్చితే ప్రస్తుత ఈ-పంచాయతీ వ్యవస్థ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి వాకబు చేశారు. దేశంలోనే అత్యుత్తమ, అత్యాధునిక సాఫ్ట్వేర్, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో ‘ఈ-పంచాయతీ’లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ తోపాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఉమాకాంత్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మంత్రి కేటీఆర్ ఆదివారం మరోసారి గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిశీలన కోసం మరో రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. -
డిల్లీ తరహ హైదరాబాద్‌లో ఉచ్చిత నీరు సాద్యమే!
-
ప్రత్యేక రాష్ట్రంతోనే అభివృద్ధికి మోక్షం
ఘట్కేసర్ టౌన్, న్యూస్‌లైన్: స్వాతంత్య్రం రాకమునుపు ఏర్పాటుచేసిన ఘట్కేసర్ రైల్వేస్టేషన్ ఇప్పటికీ అబివృద్ధికి ఆమడదూరంలోనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం స్థానిక రైల్వే ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఘట్కేసర్లో రైల్వే హబ్ ఏర్పాటు, ఎంఎంటీఎస్ రైళ్ల పొడగింపు, స్టేషన్ ఆధునికీకరణ, మూడో రైలు మార్గం ఏర్పాటు తదితర ప్రతిపాదనలు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. కనీసం ఈ స్టేషన్లో ఒక క్యాంటీన్ కూడా లేదంటూ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజాంల కాలంలో ఏర్పాటు చేసిన ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమస్యలకు నిలయంగా మారింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రైల్వేలైను కావడంతో ఇక్కడ రోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపడం, రైల్వే పోలీసులను నియామకం, మండల ప్రజల చిరకాలవాంఛ అయిన ఎంఎంటీఎస్ రైళ్ల పొడగింపు తదితర ప్రతిపాదనలకు ప్రతిసారి నాయకుల నుంచి హామీలు తప్పా కార్యరూపం దాల్చడం లేదు. ఘట్కేసర్ నుంచి భువనగిరి వరకు మూడోరైలు మార్గం ఏర్పాటు ప్రతిపాదన ప్రతిసారీ చర్చకు వస్తున్నా.. బడ్జెట్లో మాత్రం నిధుల కేటాయింపు జరగడం లేదు. అదే సమయంలో ఇంతకంటే తక్కువ సంఖ్యలో రైళ్లు నడిచే ఆంధ్రా ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో సకల సౌకర్యాలు ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేంద్ర స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకురాకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్లో కేటాయించే నిధులన్నీ సీమాంధ్ర ప్రాంతానికి తరలుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రయాణికులు భావిస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా మూడో లైను నిర్మాణం, రైల్వేహబ్ ఏర్పాటు, ఎంఎంటీస్ లైన్ పొడగింపు తదితర సమస్యలన్నీ పరిష్కారానికి నోచుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగించాలి నగరానికి అతి సమీపంలో ఉన్న ఘట్కేసర్ మండలానికి ఎంఎంటీఎస్ రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన రైల్వేశాఖ ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. మండల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎంఎంటీఎస్ రైళ్లను పొడగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు వేలాది సంఖ్యలో రోజూ హైదరాబాదు, ఇతర ప్రాంతాలకు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. స్థానిక స్టేషన్ వరకూ ఎంఎంటీఎస్ రైళ్లను పొడగిస్తే వీరందరికీ మేలు చేకూరుతుంది. - వేములు మహేష్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూడోలైన్ నిర్మాణం చేపట్టాలి.. సికింద్రాబాదు నుంచి కాజీపేట్ మార్గంలో ఘట్కేసర్ మీదుగా మూడో రైల్వేలైన్ ఏర్పాటుచేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించవచ్చు. ఇప్పటికే రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ లైన్ ఏర్పాటుతో సికింద్రాబాదు-ఘట్కేసర్-కాజీపేట్ మార్గంలో నడిచే రైళ్లు ఏ విధమైన క్రాసింగులు లేకుండా నిరాటంకంగా రాకపోకలు సాగించవచ్చు. లేకపోతే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల పేరుతో గంటల తరబడి ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులకు పడుతున్న ఇబ్బందులకు మోక్షం లభించదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ ప్రాంత రైల్వే ప్రయాణికుల సమస్యలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. - మమత, నిర్మల పురస్కార్ అవార్డు గ్రిహీత, మాజీ సర్పంచ్, ఘనాపూర్ నిరుద్యోగ సమస్య తీరుతుంది.. మండలానికి ఎంఎంటీఎస్ రైళ్ల రాక, రైల్వేహబ్ నిర్మాణం, రైల్వేస్టేషన్ ఆధునీకరణతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. స్టేషన్ ఆధునికీకరణతో స్థానికంగా వందల మందికి ఉపాధి లభించే అవకాశం కలుగుతుంది. ఏ రాష్ట్రంలోనైనా పారిశ్రామిక అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యం ఉండి తీరాల్సిందే. అయితే ఘట్కేసర్ స్టేషన్లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం విచారకరం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొదటగా ఎంఎంటీఎస్ పొడగింపుపై దృష్టిపెట్టాలి. లేకపోతే ఘట్కేసర్ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటుదనడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. - బొక్క ప్రభాకర్‌రెడ్డి, కాంట్రాక్టర్ విద్యార్థులకు మేలు జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మండలానికి ఎంఎంటీఎస్ రైలు వ్యవస్థను పొడిగిస్తే ఈ ప్రాంతలో విద్యారంగం అభివృద్ధి చెందుతుంది. నగరానికి సమీపంలో ఉండటంతో ఇక్కడ వందలాది సంఖ్యలో ఇంటర్, ఇంజినీరింగ్ తదితర విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. మండలంలో జాతీయ రహదారి ఉండటంతో ప్రస్తుతానికి విద్యార్థులు బస్సులను ఆశ్రయిస్తున్నారు. అయితే సరిపోను బస్సులు లేక కిక్కిరిసి ప్రయాణిస్తూ విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎంఎంటీస్ రైళ్లను ఘట్కేసర్ వరకు పొడగిస్తే విద్యార్థులకు, ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. -రాములు, కల్లుగీత సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చౌదరిగూడ రైల్వేహబ్ నిర్మించాలి... సికింద్రాబాదు రైల్వేస్టేషన్లో రైళ్ల తాకిడిని తప్పించడానికి అక్కడి వరకు రైళ్లన్నీ వెళ్లకుండా మండలంలోనే రైల్వేహబ్ను నిర్మించాలని రైల్వే అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే స్థానికంగా ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉంటే మండలంలో దిగిన ప్రయాణికులు వాటి ద్వారా నగరానికి వెళ్లడానికి వీలుంటుంది. అయతే ఈ ప్రతిపాదనలు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్థానిక రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరిగేలా చూడాలి. తెలంగాణ ప్రభుత్వ కూడా ఎంఎంటీఎస్ లైన్ పొడగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. - బద్ధం గోపాల్‌రెడ్డి, స్థానికుడు వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుంది... మండలంలోని చెర్లపల్లి పారిశ్రామిక వాడ, నల్గొండ జిల్లా సరిహద్దు జాతీయ రహదారి సమీపంలో కొండమడుగు వద్ద ఉన్న పారిశ్రామిక వాడ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు రహేజా పార్కు, ఇన్ఫోసిస్ సంస్థలు మండలంలో నిర్మించబడ్డాయి. మండలంలోని ఏదులాబాదు గ్రామంలో పారిశ్రామిక వాడను నిర్మించాలని ఈ మధ్యనే ప్రభుత్వం సర్వే కూడా నిర్వహించింది. మండలంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేస్తే ఈ వ్యాపార సంస్థలకు మేలు చేకూరుతుంది. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటే మరికొన్ని వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. - బొమ్మక్ శ్రీనివాస్, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు