
చేస్తున్న పనికి కళను, సృజనాత్మకతను జోడిస్తే చాలు.. అద్భుతమైన కళాకృతులు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఈ సూత్రం కేన్వాసుకే కాదు.. పొలానికి కూడా వర్తిస్తుంది! వరి పొలానికి కళాకాంతులు అద్దితే.. అది సందర్శకులను ఆకర్షించే పర్యాటక స్థలంగా మారిపోతుంది. జపాన్‌లోని ఇనకటడె అనే గ్రామం రైస్ పాడీ ఆర్ట్‌కు పెట్టింది పేరు. డజన్ల కొద్దీ రంగు రంగుల దేశీ వరి వంగడాలను భారీ కళాకృతుల రూపంలో నాటి సాగు చేయడంతో పచ్చని వరి పొలాలు పర్యాటక స్థలాలుగా మారి కాసులు కురిపిస్తున్నాయి.
ఈ అగ్రి టూరిజం టెక్నిక్.. మహారాష్ట్రలోని దొంజె ఫట అనే గ్రామాన్ని సైతం పర్యాటక కేంద్రంగా మార్చి వేసింది. జపాన్‌లో సంచలనం సృష్టిస్తున్న పాడీ ఆర్ట్ గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న.. పుణేకి చెందిన శ్రీకాంత్ ఇంగాల్‌హలికర్ అనే ఇంజనీర్ తన ఐదెకరాల వరి పొలంలో 40 మీటర్ల భారీ వినాయకుడు, తదితర కళాకృతులను రూపొందించారు. ఆకుపచ్చని వరి పొలంలో నల్లగా ఉండే వరి మొక్కలను నాటడం ద్వారా ఆహ్లాదకర దృశ్యాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment