నిగనిగల కురులకు...
బ్యూటిప్స్
చలికాలం శిరోజాలు పొడిబారి నిస్తేజంగా మారుతాయి. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కురులు నిగనగలాడేలా చేయవచ్చు.కోడిగుడ్డు పచ్చ సొనలో టీ స్పూన్ తేనె, అరటిపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 10-30 నిమిషాలు వదిలేయాలి. తర్వాత జుట్టును శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. మాడు పొడిబారకుండా చేస్తుంది.
శనగపిండిలో తగినంత పెరుగు కలిపి మాడుకు, కురులకు బాగా పట్టించాలి. 15- 20 నిమిషాలు ఉంచి శుభ్రపరుచుకోవాలి. తలస్నానానికి వేణ్ణీళ్లు వాడితే జుట్టులోని తేమ కోల్పోయి నిస్తేజంగా కనిపిస్తుంది. గోరువెచ్చని నీరు మాత్రమే ఉపయోగించాలి.