
బ్యూటిప్స్
కొబ్బరి పాలలో అరటిపండు గుజ్జుని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకి మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఒక స్పూను తేనెలో కొద్దిగా పెసరపిండి, అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం తేమగా, కాంతివంతంగా ఉంటుంది.