
చిన్నవయసులోనే వెంట్రుకలు తెల్లబడటం అనే సమస్యను ఇటీవల ఎక్కువగా గమనిస్తున్నాం. వంశపారంపర్యం, పోషకాహార లోపం... వీటికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. జుట్టుకు డై వేయడం ఇష్టపడని వారు ఒక పద్ధతిని అనుసరించవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ మెంతిపొడి, టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల పుదీన రసం, రెండు టీ స్పూన్ల తులసి రసం బాగా కలపాలి. గంట సేపు అలాగే ఉంచి, తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత నేచురల్ షాంపూతో శుభ్రపరుచుకోవాలి. ఇలా నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి.
ఇంకా: ∙అల్లం, తేనె çసమపాళ్లలో కలిపి, రోజూ టీ స్పూన్ చొప్పున ఉదయం పూట తీసుకోవాలి. ∙ఉసిరి (సి–విటమిన్), ఆకుకూరలు, ఖర్జూర (ఐరన్), చేప ఉత్పత్తులు (విటమిన్–ఇ) ఉండేవి ఆహారంగా తీసుకోవాలి. మసాజ్‌కు నల్లనువ్వుల నూనె లేదా ఆవ నూనె ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు వెంట్రుకలు తెల్లబడటం, పొడిబారడం సమస్యను నివారిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment