పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Mon, Jun 22 2015 10:54 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు - Sakshi

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: రాజ్‌బబ్బర్ (నటుడు); ముకేష్ ఖన్నా (టీవీ, సినీ నటుడు)
 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి ఇది ల్యాండ్ మార్క్ ఇయర్‌గా చెప్పవచ్చు. వీరికి ఈ ఏడాది నూతనోత్సాహం, ధైర్యం, తెగువ, ఏదైనా చేయగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహం, కొత్త పరిశ్రమలు, కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వాటి వలన కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కష్టపడి పని చేయాలనే మనస్తత్వం ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి, అదృష్టం కలిసి వస్తాయి. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది. విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు పేరు ప్రతిష్ఠలతోపాటు సన్మానాలు జరుగుతాయి. అయితే అహంభావం వృద్ధి చెందటం వల్ల సన్నిహితులు, స్నేహితులు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల సంయమనంతో వ్యవహరించడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,5,9; లక్కీ డేస్: మంగళ, బుధ, ఆదివారాలు; లక్కీ కలర్స్: గ్రీన్, రోజ్, ఆరంజ్, రెడ్, పర్పుల్. సూచనలు: ఆదిత్య హృదయ పారాయణం చేయడం, లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, శివారాధన, నేత్రదానాన్ని ప్రోత్సహించడం, వృద్ధాశ్రమంలో సేవ చేయడం
- డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement