మెదడుకు ఆహారం... గాలి!
మీకు తెలుసా
మెదడు బరువు మనిషి బరువులో మూడు శాతానికి మించదు. అయితే మనిషి పీల్చుకున్న ప్రాణవాయువు (ఆక్సిజన్) 20 శాతానికి పైగా మెదడుకే చేరుతుంది. ప్రహేళికలను పరిష్కరించడం, చదవడం, ఏకాగ్రతతో వినడం వంటి పనులు చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆక్సిజన్ కావాలి. దేహం పని చేయడానికి ఆహారం ఎలాగో మెదడు పని చేయాలంటే గాలి అలాగన్నమాట.
ఆక్సిజన్ తగినంత అందకపోతే మతిమరుపు, ఏకాగ్రత లోపించడం, మానసిక సమతౌల్యంలో లోపం వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయి. వీటితోపాటు తగినంత ప్రాణవాయువు కోసం శ్వాస త్వరత్వరగా, వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇది అసంకల్పితంగా జరిగిపోతుంది.