చైనా మగాళ్లకు ముందుంది మొసళ్ల పండగ!
మనదేశంలో స్తీ, పురుష జనాభా నిష్పత్తి ్రపమాదకర స్థితిలో ఉంది... ఇది అంతిమంగా అబ్బాయిల జీవితాలపై ప్రభావం చూపుతోంది, సామాజిక దుష్పరిణామాలకు దారి తీస్తోందని ఒకవైపు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో పక్కదేశం చైనాలో పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 1000:840 గా ఉంది చైనాలో పురుష, స్త్రీల జనాభా నిష్పత్తి! దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు పెళ్లిడుకొచ్చిన అబ్బాయిలు.
వెయ్యిమంది అబ్బాయిల్లో 160 మందికి అమ్మాయి దొరికే పరిస్థితి లేదంటే... 120 కోట్ల పై బడ్డ జనాభా ఉన్న జనచైనాలో మొత్తం ఎంతమంది బ్రహ్మచారులుగా మిగులుతారో అంచనా వేయడానికి గణాంక నిపుణులు దిగిరావాలి! రానున్న రోజుల్లోఈ సమస్య మరింత తీవ్రస్థాయికి చేరుతుందని అంటున్నారు. 2030 నాటికి చైనాలోని పాతికశాతం మంది అబ్బాయిలకు పెళ్లి చేసుకొందామంటే, పిల్ల దొరికే పరిస్థితి ఉండదట. ఇది సామాజిక సంక్షోభానికి దారితీయవచ్చని, జనాభా నియంత్రణ అంటూ జననాల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యవహరించిన తీరే దీనికి కారణం అని విశ్లేషకులు అంటున్నారు.