అల్లం: అల్లంతో ఎన్నో లాభాలు. అల్లాన్ని పసుపు, తులసిరసంతో కలిపి సేవిస్తే చర్మరోగాలు ముఖ్యంగా దద్దుర్లు (అర్టికేరియా) తగ్గిపోతాయి. దీన్ని దంచి, మజ్జిగలో కలిపి తాగితే వాతవ్యాధులు తగ్గుతాయి. చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి, నిప్పులపై కొంచెం వేడిచేసి కొంచెం ఉప్పును అద్ది, పరగడుపున నమిలితింటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులన్నింటినీ పోగొడుతుంది. గొంతుకి ఇన్ఫెక్షన్ రాదు. అల్లానికి రక్తప్రసరణను పెంచే గుణం ఉండటం ంది. దీనివల్ల గుండెకు, మెదడుకు, మూత్రపిండాలకు, జననాంగాలకు చక్కటి రక్తప్రసరణ జరిగి హార్ట్‌ఎటాక్‌ను, పక్షవాతాన్ని నివారించడానికి ఉపకరిస్తుంది. కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. నిమ్మరసంలో కొంచెం సైంధవలవణం కలిపి, అల్లపు ముక్కలను దాంట్లో వారం రోజులు నాన్చి, ఎండబెడితే ‘భావన అల్లం’ తయారవుతుంది. దీన్ని చప్పరించి నమిలితే అరుచి తగ్గి, ఆకలి పుట్టి, జీర్ణక్రియ బాగవుతుంది. అల్లపురసం తేనెతో సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
కరివేపాకు : రోజూ రెండు చెంచాల కరివేపాకు రసం తాగితే డయాబెటిస్ వ్యాధిని నివారించుకోవచ్చు. నరాల బలహీనతను తగ్గించడానికి కరివేప ఎంతగానో తోడ్పడుతుంది. కడుపులో గ్యాస్ తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణకోశ క్యాన్సర్లను నివారిస్తుంది.
ఏలకులు : ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే నోటి దుర్వాసన పోతుంది. వీటిని నిమ్మరసంతో సేవిస్తే వాంతులు తగ్గుతాయి. దోసగింజల చూర్ణంతో కలపి, పల్లేరు కషాయంతో తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయంటారు. మూలవ్యాధికి కూడా మంచిది. ఏలకులను పాలమీగడలో కలిపి ఆ ముద్దను నోటిలో చప్పరిస్తే నాలుక, దవడ పూత తగ్గుతుంది. ఈ చూర్ణాన్ని బట్టలో పెట్టి వాసన చూస్తే తుమ్ములు, తలనొప్పి తగ్గుతాయి. మధుమేహానికి కూడా మంచిదే. అయితే ఒక్క జాగ్రత్త పాటించాలి. ఏలకుల చూర్ణాన్ని ఎప్పుడైనా కొద్దిమోతాదులో మాత్రమే వాడాలి.
చిట్కావైద్యం... ఇలా ఆరోగ్యం
Published Thu, Apr 12 2018 12:25 AM | Last Updated on Thu, Apr 12 2018 12:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment