అతనితో జంట కుదిరిందా?
గాసిప్
సల్మాన్‌ఖాన్ హీరో... దీపికా పదుకొనే హీరోయిన్... ఈ ఇద్దరి జంటను వర్కవుట్ చేయాలని గత కొన్నాళ్లుగా పలువురు బాలీవుడ్ దర్శక-నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘ప్రేమ్త్రన్ ధన్‌పాయో’, ‘సుల్తాన్’ చిత్రాల్లో మొదట దీపికనే అనుకున్నారు. కానీ, డే ట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఆమె ఈ చిత్రాల్లో నటించలేకపోయారు.
ఎట్టకేలకు తాజాగా ఈ ఇద్దరి జంట కుదిరిందని సమాచారం. మరోసారి ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ కబీర్‌ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా దీపికను అడిగారట. సల్మాన్‌తో సినిమా అంటే కాదంటానా? అంటూనే మంచి పాత్ర అయితేనే చేస్తానని దీపిక మెలిక పెట్టారట. మరి... పాత్ర విన్నాక దీపిక ఏమంటారో?