సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్! | Salman Khan is the proper planning! | Sakshi
Sakshi News home page

సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్!

Published Thu, Jun 25 2015 12:14 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్! - Sakshi

సల్లూ భాయ్ పక్కా ప్లానింగ్!

ప్లానింగ్ విషయంలో బాలీవుడ్ వాళ్లు చాలా పక్కాగా ఉంటారు. సినిమా స్టార్ట్ చేయకముందే, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేంత పక్కా ప్లానింగ్ ఉంటుంది వాళ్ల దగ్గర. సల్మాన్‌ఖాన్ అయితే ఈ విషయంలో మరీ పర్‌ఫెక్ట్. ఇందుకు తాజా ఉదాహరణ ఆయన నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’.
 
 ఈ చిత్రాన్ని రంజాన్‌కి రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేసేశారు. తాజాగా యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సల్మాన్ హీరోగా అలీ అబ్బాస్ ఖాన్ తెరకెక్కించనున్న చిత్రం ‘సుల్తాన్’. ఈ సినిమా షూటింగే ఇంకా మొదలు కాలేదు.
 
 అప్పుడే సల్మాన్ ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం రంజాన్‌కు విడుదల చేస్తామని ప్రకటించేశారు. దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో సల్మాన్ రెజ్లర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోవడానికి సిద్ధమైపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement