అగ్రతాంబూలాన్ని సమర్పించారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినపుడు అది సంకల్పబలం చేతనే విజయవంతం అవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీ దేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి. ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుంది. సూత్రవతీదేవి, జయదేవి అనేవారిద్దరూ విష్ణుసైన్యానికి అధిపతి అయిన విష్వక్సేనుని భార్యలు. మంగళసూత్రాలకు పిన్నీసులు తదితరాలు పెట్టకూడదు ∙మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి ∙మంగళ సూత్రాలకి పగడం, ముత్యం, నల్లపూసలు ఉండాలి.
పొరపాటున మంగళ సుత్రాలు పెరిగిపోతే (తెగిపోతే) ఏమి చెయ్యాలంటే..?
వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు లేదా భర్త చేత కట్టించుకోవాలి. వారు అందుబాటులో లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి మధ్యాన్నం 12 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి.
తాళి బొట్టు... గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు
భార్య మెడలో మంగళసూత్రం, నుదుటి సింధూరం భర్త ఆయురారోగ్యాలకు బాసటగా నిలుస్తుంది. అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది. అయితే మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్ర, మంగళవారాలలో అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదవతనాన్ని ఇచ్చే పార్వతీ దేవి కటాక్షిస్తుంది.