
⇔ ఈ కాలంలో తరచుగా గొంతు నొప్పి బాధపెడుతుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. టీలో కూడా వేసుకోవచ్చు.
⇔ గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు కలిపి రోజుకు రెండు– మూడుసార్లు గార్గిలింగ్ చేస్తే (గొంతులో పోసుకుని గరగరలాడించడం) గొంతు ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
⇔ పొట్ట పనితీరు క్రమం తప్పినట్లనిపిస్తే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగుతూ మధ్యలో కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్, సూప్‌ల వంటివి తీసుకోవాలి. వారంలో కనీసం ఒకరోజు ఇలా తీసుకుంటే జీర్ణవ్యవస్థ శుభ్రపడి పొట్ట యథాస్థితికి వస్తుంది.
⇔ ఫ్లూ జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా కొద్ది రోజులు ఒళ్లునొప్పులు ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ ముల్లంగి రసంలో అంతే మోతాదు ఆలివ్ ఆయిల్ కలిపి అరగంట సేపు అలాగే ఉంచి శరీరానికి మర్దన చేస్తే ఒంటి నొప్పులు తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment