
రక్త పోటు... హెల్త్‌కి చేటు
ఇటీవల మన మారుతున్న జీవనశైలి, మనం అనుభవిస్తున్న వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఉద్వేగాలు, మనం తింటున్న ఆహారం... ఇవన్నీ కలగలసి మనకు తెలియకుండానే రక్తపోటును పెంచేస్తున్నాయి. సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రూపంలో మనకు ఉండాల్సిన బీపీ కొలత 120/80 మాత్రమే. కానీ అనేక అంశాలు దీన్ని ప్రభావితం చేస్తుండటంతో మనకు రక్తపోటు పెరుగుతుంది. కానీ ఆ విషయమే మనకు తెలియదు. దాంతో రక్తపోటు మన దేహంలోని అవయవాన్నైనా దెబ్బతీయవచ్చు. మెదడునూ, నాడీవ్యవస్థనూ, కళ్లను, గుండెనూ, మూత్రపిండాలను... ఇలా చాప కింది నీరులా అది దేన్ని దెబ్బతీసినా ఆ పరిణామాలు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నేడు ప్రపంచ హైపర్‌టెన్షన్ దినం సందర్భంగా మనం అలాంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండటం ఎలాగో చూద్దాం రండి!
దేశంలో రక్తపోటు తీవ్రతను గమనించారా?
ఇటీవలే ‘పబ్‌మెడ్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం 33 శాతం మంది నగరవాసులూ, 25 శాతం మంది పల్లెవాసులూ హైబీపీతో బాధపడుతున్నారు. కానీ చిత్రమేమిటంటే... ఈ సంఖ్యలోనూ తాము రక్తపోటుతో బాధపడుతున్నా తమకు ఆ కండిషన్ తెలిసిన వారు చాలా తక్కువ. అంటే పల్లెల్లో రక్తపోటుతో బాధపడుతున్నవారిలో 25 శాతం మందికి తమకు హైబీపీ ఉందని తెలిస్తే, పట్టణాల్లో అవగాహన ఒకింత ఎక్కువ కావడం వల్ల అది 38 శాతం. అయినా మిగతావాళ్లందరికీ తామెంత ప్రమాద స్థితిలో ఉన్నారో తెలియనే తెలియదు.
ఒత్తిడే ప్రథమ శత్రువు...
హైబీపీ రావడానికి ప్రధాన కారణం... మనం జీవితంలో అనుభవించే ఒత్తిడే. ఇటీవల ఒత్తిడి మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది వృత్తిపరమైనదే అయినా, కుటుంబపరమైన కారణంగా ఉద్వేగభరితమే అయినా, మానసిక-శారీరకమైన అన్ని కారణాలూ హైబీపీ వైపునకే దారితీస్తున్నాయి. ఫలితంగా గుండెజబ్బులూ, పక్షవాతాలూ, మూత్రపిండాలు పనికిరాకుండా పోవడం, చివరగా ఒక దశలో మృత్యువు... ఇలా అన్ని అనర్థాలకూ హైబీపీ కారణమవుతోంది.
హైబీపీని అనుమానిస్తుంటే ఈ పరీక్షలు చేయించుకోండి...
పూర్తిస్థాయి మూత్ర పరీక్ష ( కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) హీమోగ్లోబిన్ పాళ్లు రక్తంలో పొటాషియమ్ స్థాయి బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ లెవెల్స్ ఈసీజీ కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ పరీక్ష రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష
మరికొన్ని ప్రత్యేక పరీక్షలు :
అత్యధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరం. అవి... 24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్ పాళ్లు తెలుసుకునే పరీక్ష (మూత్రంలో పోయే ప్రోటీన్ల సంఖ్యను ఇటీవల కేవలం ఒక శాంపుల్‌తోనే తెలుసుకునే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి) కిడ్నీ బయాప్సీ మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ రీనల్ యాంజియోగ్రామ్.
ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరం
ఈ పరీక్షలన్నీ అందరికీ అవసరం కాకపోవచ్చు. కానీ తరచూ బీపీ చెక్ చేయించుకుంటున్నప్పుడు ఎప్పుడూ అది 120 / 80 కంటే ఎక్కువే ఉంటున్నవారికీ కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి డయాబెటిస్ పేషెంట్లు అందరికీ కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారికీ రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారికీ ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడే వారికి పైన పేర్కొన్న పరీక్షలు అవసరం.
రక్తపోటు నివారణ ఇలా...
ఒత్తిడిని గణనీయంగా తగ్గించుకోండి రోజూ 7-8 గంటల పాటు నిద్రపోండి ఆహారంలో ఉప్పు పాళ్లను గణనీయంగా తగ్గించండి ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉప్పు ఎక్కువగా వాడే బేకరీ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి టాబ్లెట్లూ (ఓవర్ ద కౌంటర్ తీసుకుని) వాడకండి.
రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు
గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్ కిడ్నీ దెబ్బతినడం పక్షవాతం ఆయుఃప్రమాణం (లైఫ్ స్పాన్) తగ్గడం కిడ్నీ దెబ్బతింటే డయాలసిస్ వంటివి చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియలు కావడంతో పాటు దాత దొరకడమూ చాలా కష్టం. పై అంశాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రక్తపోటు ఉన్నవారు తమ హైబీపీని అదుపులో ఉంచుకోడానికీ, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మంచి జీవనశైలిని పాటించాల్సిన అవసరం ఉంది.
ఆహారంతోనే రక్తపోటు నియంత్రణ ‘డ్యాష్’
అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవాళ్లు ఆహార నియువూలు తప్పనిసరిగా పాటించాల్సింది. హైబీపీకి ఇప్పుడు అవుల్లో ఉన్న ఆహార నియువూవళిని ’డ్యాష్’ అంటారు. ‘డయుటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్‌టెన్షన్’ అన్న వూటలకు సంక్షిప్తరూపమే ఈ డ్యాష్. హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి. వాటిలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. అలాగే వాళ్లకు క్యాల్షియుం కూడా అవసరం. అరుుతే ఇందుకోసం వాళ్లు కొవ్వు పాళ్లు (వెన్నపాళ్లు) తక్కువగా ఉన్న పాలూ, పాల ఉత్పాదనలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఉప్పు పాళ్లను తగ్గించాలి. బరువు పెరక్కుండా చూసుకోవాలి. హై బీపీ ఉంటే దాన్ని నియుంత్రించుకోవడం కోసం జీవన విధానంలోనూ (లైఫ్‌స్టైల్‌లో) వూర్పులు విధిగా పాటించాల్సి ఉంటుంది. అంటే... ఉప్పుతో పాటు సోడియుం పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలైన నిల్వ ఆహారం (ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్), బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు (పాపడ్), క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. అలాగే తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ఆపేయూలి. బరువు పెరగకుండా శారీరక కార్యకలాపాలు (ఫిజికల్ యూక్టివిటీస్) ఉండేలా చూసుకోవాలి.
డాక్టర్ పి. రాజేంద్రకుమార్ జైన్
డెరైక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్