ఇంటిప్స్
పట్టు చీరలు ఉతికేటప్పుడు బకెట్ నీటిలో కొంచెం నిమ్మరసం, ఉప్పు కలిపితే రంగు పోవు.వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో టీ స్పూన్ పాలు కలపాలి.బిస్కెట్ ప్యాకెట్ బియ్యం డబ్బాలో ఉంచితే అవి మెత్తబడవు. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే గిన్నె అంచులకు నూనె రాయాలి. వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా వరకు తాజాగా ఉంటాయి.
ఈగల బెడద లేకుండా ఉండాలంటే పుదీనా ఆకుల్ని గది నాలుగు మూలల్లో ఉంచాలి. శనగపిండితో స్టీలు, వెండి సామాన్లు తోమితే చక్కగా శుభ్రపడతాయి. మజ్జిగ పల్చనైతే కొన్ని కరివేపాకులు, ఉప్పు కలిపి రుబ్బి ఈ మిశ్రమాన్ని అందులో కలపాలి. మజ్జిగ రుచిగానూ, చిక్కగానూ ఉంటుంది.