వీసాలలో ఎన్ని రకాలుంటాయి?
ఒక దేశం మీద నుంచి మరొక దేశానికి వెళ్లడానికి ఇచ్చేది ట్రాన్సిట్ వీసా! కొన్ని రోజులు లేదా కొన్ని, నెలల పాటు విదేశాలలో ఉండటానికి ఇచ్చేది విజిటర్ వీసా! పరిమిత కాలానికి మాత్రమే ఇచ్చేది టూరిస్ట్ వీసా! ఈ వీసాతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. ఇతర దేశాలలోని ఆసుపత్రులకు వ్యాధుల నిర్ధారణ, చికిత్సకు వెళ్లేది మెడికల్ వీసా!
ఇతర దేశాలలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు ఇచ్చేది బిజినెస్ వీసా! దీర్ఘకాలం విదేశాలలో నివసించడానికి రెసిడెన్స్ వీసా, వలస వెళ్లడానికి అనుమతిపొందేందుకు ఇమ్మిగ్రెంట్ వీసా, విదేశాలకు వెళ్లడానికి పొందే అనుమతి ఆన్ ఎరైవల్ వీసా, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలలో లావాదేవీలకు ఎలక్ట్రానిక్ వీసాలు ఉంటాయి. పాస్‌పోర్ట్ నిర్ధారణ జరిగిన తర్వాతే వీసాపై సంబంధిత లేబుల్‌ను ముద్రిస్తారు.