Tourist Visa
-
చైనాకు 2 రోజులు.. భారత్‌కు రెండేళ్లు.. మరీ ఇంత వ్యత్యాసమా?
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు పర్యాటక వీసా రావాలంటే దాదాపు రెండేళ్లకుపైగా వేచి ఉండాల్సిందే. అయితే.. చైనా వంటి దేశాల ప్రజలకు ఆ సమయం రెండు రోజులుగానే ఉండటం గమనార్హం. పర్యాటక వీసా పొందాలనుకునే ఢిల్లీ వాసులు అపాయింట్మెంట్ కోసం సుమారు 833 రోజులు వేచి చూడాలి. అలాగే ముంబయి ప్రజలకు 848 రోజులుకుపైగా వేయింట్ లిస్ట్ ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వెబ్సైట్ సూచిస్తోంది. అయితే.. బీజింగ్‌కు రెండు రోజులు, ఇస్లామాబాద్‌కు 450 రోజులు సమయం పడుతోంది. విద్యార్థి వీసాల కోసం వెయిటింగ్ టైమ్ ఢిల్లీ, ముంబైవాసులకు 430 రోజులుగా ఉంది. ఆశ్చర్యకరంగా విద్యార్థి వీసాల విషయంలో పాకిస్థాన్‌కు కేవలం ఒకే రోజు సమయం ఉంది. అలాగే చైనాకు రెండు రోజులు పడుతోంది. ఢిల్లీ వాసులకు 833 రోజులుగా చూపిస్తున్న అమెరికా వెబ్సైట్ అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వద్ద లేవనెత్తారు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని తెలిపారు బ్లింకెన్. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. భారత్ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు తగిన ప్రణాళిక చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. కరోనా సమయంలో తక్కువ దరఖాస్తులు రావటం వల్ల సిబ్బందిని తొలగించటమూ ప్రస్తుత సమస్యకు ఒక కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కరోనా తర్వాత పర్యటక, విద్యార్థి వీసాల దరఖాస్తులు భారీగా పెరిగినట్లు వెల్లడించాయి. భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలను జారీ చేస్తుంది. ఇందుకోసం దరఖాస్తుదారులకు వీసా అపాయింట్మెంట్కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్సైట్లో పొందుపరుస్తుంటుంది. అయితే, ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాలను బట్టి ఈ సమయాన్ని ప్రతివారం అప్డేట్ చేస్తుంది. తాజాగా వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్సైట్లో పరిశీలించగా ఢిల్లీ ఎంబసీ నుంచి పర్యటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారు అపాయింట్మెంట్ కోసం 833 రోజులు వేచి ఉండాల్సిన ఉంటుందని తెలియజేస్తోంది. అలాగే.. మిగతా వివరాలు పరిశీలిద్దాం. బీజింగ్వాసులకు కేవలం 2రోజుల వెయిటింగ్ టైమ్ ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
అసలు పేరు చెప్పిన డెత్ సర్టిఫికెట్!
సాక్షి, హైదరాబాద్: ఇక్కడి పోలీసులు అరెస్టు చేసినా... తమ పాస్‌పోర్టు స్వాదీనం చేసుకున్నా...లుక్ఔట్ సర్క్యులర్ జారీ చేసినా... రాకపోకలు, దందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నైజీరియన్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తమ దేశంలోనే అసలు, నకిలీ పేర్లతో రెండు పాస్‌పోర్టులు తీసుకుంటున్నారు. అసలుది దాచేసి, నకిలీ పేరుతో తీసుకున్న దాంతోనే ప్రయాణాలు చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినప్పుడూ ఇందులోని పేరే చెప్తున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ), నారాయణగూడ ఠాణా అధికారులు ఇటీవల అరెస్టు చేసిన వసిగ్వీ చిక్వమేక జేమ్స్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇతడి అసలు పేరు, వివరాలు సైతం ఓ డెత్ సర్టిఫికెట్ ద్వారా బయటకు వచ్చాయి. డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్లు అవలంభిస్తున్న కొత్త పంథా ఇదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. గోవాకు వచ్చిపోతూ డ్రగ్స్ దందా... నైజీరియాకు చెందిన వసిగ్వీ జేమ్స్ 2013 నుంచి టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చిపోతున్నాడు. 2016, 2019ల్లోనూ రాకపోకలు సాగించిన ఇతడికి గోవా, బెంగుళూరుల్లో ఉండే డ్రగ్ పెడ్లర్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ జాక్స్ సరఫరా చేస్తున్న సింథటిక్ డ్రగ్స్‌కు అక్కడి పెడ్లర్స్‌కు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. ఇలాంటి నేరాలు చేస్తూ చిక్కిన వారి నుంచి పోలీసులు పాస్‌పోర్టు స్వాదీనం చేసుకుంటారు. వీళ్లు బెయిల్ పొందినా దేశం దాటి వెళ్లిపోకుండా విమానాశ్రయాలకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తారు. తనకు ఇలా జరిగితే స్వదేశానికి వెళ్లడం ఇబ్బందని భావించాడు. దీంతో 2021 నవంబర్ 19న నైజీరియాలోనే అలమాంజో మాసెక్సూ్య పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకున్నారు. నకిలీవి వాడుతూ వ్యవహారాలు.. డబ్బు అవసరమైన ప్రతిసారీ భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందా చేయడం మొదలెట్టాడు. ఈ నకిలీ పేరుతో తీసుకున్న పాస్‌పోర్టు వాడి 2021–22ల్లో గోవాకు వచ్చాడు. తనకు పరిచయం ఉన్న కస్టమర్లను డ్రగ్స్ అమ్ముతూ ఈ ఏడాది మార్చిలో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఆ సందర్భంలో అలమాంజో పేరు చెప్పి, దాంతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. మూడు వారాలు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్లీ దందా మొదలెట్టాడు. తాజాగా గత వారం నారాయణగూడ పరిధిలోని కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేయడానికి వచ్చి హెచ్–న్యూ పోలీసులకు చిక్కాడు. ప్రాథమిక విచారణలో తన పేరు అలమాంజో అని చెప్తూ ఆధారంగా ఆ పేరుతో ఉన్న పాస్‌పోర్టే చూపించాడు. సాధారణ దర్యాప్తులో భాగంగా అధికారులు అతడి సెల్‌ఫోన్‌ను విశ్లేషించారు. ఆమె డెత్ సర్టిఫికెట్తో గుట్టురట్టు... ఇందులోని ఈ–మెయిల్స్, ఇతర పత్రాల్లో వసిగ్వీ జేమ్స్ అనే పేరు కనిపించింది. దీనిపై ప్రశ్నించగా... అసలు ఆ ఫోనే తనది కాదంటూ తప్పించుకున్నాడు. గోవాలో తనతో సహజీవనం చేసిన ఓ యువతి గతంలోనే అనారోగ్యంతో మరణించిందని, ఆమె మీద ఒట్టేసి చెప్తున్నానంటూ బుకాయించాడు. అయితే అనుమానం నివృత్తి కాని దర్యాప్తు అధికారులు ప్రతి ఈ–మెయిల్‌ను విశ్లేషించారు. ఓ మెయిల్లో సదరు యువతికి సంబంధించిన డెత్ సరి్టఫికెట్ లభించింది. అందులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆమె పేరుతో పాటు భర్తగా వసిగ్వీ చిక్వమేక జేమ్స్ పేరు ఉంది. దీని ఆధారంగా పోలీసులు అతగాడిని తమదైన శైలిలో విచారించారు. దీంతో తన అసలు పేరు అదేనని అంగీకరించడంతో పాటు అలా ఎందుకు చేశాడో వివరించాడు. ఇటీవల అనేక మంది నైజీరియన్లు ఇలానే చేస్తున్నట్లు బయటపెట్టడంతో అ«ధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారంపై ఆ దేశ ఎంబసీకి లేఖ రాయాలని నిర్ణయించారు. (చదవండి: మునా‘వార్’... కామెడీ షో కోసం వస్తున్న మునావర్ ఫారూఖీ) -
పరాయి దేశాల్లో పడరాని పాట్లు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్‌మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్‌పోర్ట్, విమానం టికెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. సిక్కోలు (శ్రీకాకుళం) జిల్లాకు చివర్లో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులను మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్‌చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగుల యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. నా భర్త ఏమయ్యాడో.. నా పేరు పుచ్చ అనుసూయమ్మ. మాది వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడు గ్రామం. నా భర్త కుర్మారావు 2019లో సౌదీకి ఉపాధి కోసం వెళ్లాడు. అల్ మసాలిక్ కంపెనీలో చేరాడు. రెండు నెలలుగా అచూకీలేదు. నా భర్తకు ఏమైందో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీడంలేదు. ఎస్పీ, జిల్లా కలెక్టర్లను ఆశ్రయించాం. చివరికి నా భర్త పనిచేస్తున్న కంపెనీని మెయిల్ ద్వారా సమాచారం కోరాం. ఎలాంటి సమాచారంలేదు. మన వారిని చూసి కన్నీళ్లొచ్చాయి.. విదేశాల్లో మనవారు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. టూరిస్ట్ వీసాలతో మోసపోయి సుమారు 60 మంది దుబాయ్‌లో అనేక కష్టాలుపడ్డారు. కడుపు నింపుకోవడం కోసం ప్రతీ శుక్రవారం మసీదుల వద్ద ఉచితంగా అందించే రొట్టెలు, పండ్లు కోసం క్యూ కట్టేవారు. రాత్రి సమయంలో ఇసుక తిన్నెలపై పడుకునేవారు. పోలీసుల కంటపడకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయా.. – హెచ్చర్ల కుమారస్వామి, బాధితుడు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం. ఉద్యోగాలివ్వకుండా మోసం.. సింగపూర్‌లోని రొమేనియాలో ఉద్యోగాలిప్పిస్తామని కంచిలి మండల పరిధి కత్తివరం రోడ్డులోగల శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని బసవ వెంకటేష్ మోసం చేశాడు. మా వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశాడు. డబ్బులు కట్టినప్పటికీ ఉద్యోగాలకు పంపించలేదు. రెండేళ్లుగా మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ ఇవ్వడంలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. మోసగాడు తప్పించుకు తిరుగుతున్నాడు. – దుంగ తారకేశ, ఇన్నీసుపేట, ఈరోతు తారకేశ్వరరావు, సన్యాసిపుట్టుగ, సంగారు సురేష్, కపాసుకుద్ది మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ► ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్‌పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ► కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి 70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ► అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమ్మబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. ఒక ఉద్యోగం అని చెప్పి.. వేరే ఉద్యోగం ఇచ్చి.. శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు ఓటీతో కలిపి రూ.25వేలు వరకు వచ్చే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశారు. తీరా వారం రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి అక్కడి గమేజ్ ట్రేడింగ్ కంపెనీలో నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలిచ్చి మోసంచేశారు. ఏజెంట్ చెప్పిన ప్రకారం ఏదిలేదు. మాకు జరిగిన మోసంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మేం కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలి. – శ్రీలంక నుంచి బాధితులు పురుషోత్తం, బినోద్ నాయక్, శివ -
యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్
అబుదాబి: యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్. ఆన్లైన్ పేమెంట్ల విషయంలో భారతీయ సందర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు లైన్ క్లియర్ అయ్యింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించింది యూఏఈ. తద్వారా UPI పేమెంట్లకు అనుమతి ఇచ్చిన మూడో దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిచింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NCPI).. మష్రెక్యూ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించనుంది. ఇండియాలో ఎలాగైతే యూపీఐ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటున్నారో.. యూజర్లు ఇక అదే రీతిలో విదేశీ ట్రాన్జాక్షన్లు చేసుకోవచ్చు. తద్వారా వ్యాపార, ఇతరత్ర వ్యవహారాలపై యూఏఈని సందర్శించే 20 లక్షల మంది భారతీయులకు లబ్ది చేకూరనుందని అంచనా వేస్తున్నారు. సందర్శకులతో పాటు యూఏఈ వాసులకు సైతం క్యాష్‌లెష్ పేమెంట్స్‌కు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుందని ఎఐపీఎల్ సీఈవో రితేష్ శుక్లా వెల్లడించారు. ఇంతకు ముందు సింగపూర్, భూటాన్‌లు యూపీఐ పేమెంట్స్‌కు అనుమతి ఇచ్చాయి. భారత్‌లో మొత్తం 50 థర్డ్‌పార్టీ యూపీఐ యాప్స్ ఉండగా.. అందులో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, అమెజాన్ పే మార్కెట్లో పాపులర్ అయ్యాయి. చదవండి: అఫ్గన్ కార్మికుల సంగతి ఏంటి? ప్రయాణికులకు ఊరట పాస్‌పోర్టులు ఉన్న భారతీయ ప్రయాణికులు టూరిస్ట్ వీసాలపై తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో కాకుండా విదేశాల్లో గత 14 రోజులుగా ఉన్న భారతీయులు మాత్రమే రావచ్చని స్పష్టం చేసింది. ఇదే సౌకర్యాన్ని నేపాల్, నైజీరియా, పాకిస్థాన్, శ్రీలంక, ఉగాండా ప్రయాణికులకూ కల్పిస్తున్నట్లు యూఏఈ వివరించింది. యూఏఈ చేరుకున్న రోజుతో పాటు తొమ్మిదో రోజు కూడా ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: భార్య ఎఫైర్లన్నీ వెబ్సైట్లో.. సొంతవాళ్లపైనే భర్త అఘాయిత్యాలని ఆరోపణలు -
ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కోవిడ్ ప్రభావిత రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ పథకం సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఎనిమిది కీలక చర్యలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. వీటితో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పడే మరో ఎనిమిది సహాయక చర్యలు కూడా ఉన్నట్టు ఆమె తెలిపారు. వీటి ప్రకారం.. అత్యవసర రుణ సదుపాయ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) పరిమితిని మరో రూ. 1.5 లక్షల కోట్ల మేర పెంచి రూ. 4.5 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా చిన్న సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గైడ్లు, టూరిస్ట్ ఏజెన్సీలకు రుణ సదుపాయం లభించేలా చర్యలు ప్రకటించారు. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకాన్ని నవంబర్ దాకా పొడిగించినందుకు అదనంగా అయ్యే రూ.93,869 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద ఇచ్చే మరో రూ. 14,775 కోట్లతోపాటు కేంద్రం ఇటీవలి కాలంలో ప్రకటించిన ఉద్దీపన చర్యల విలువ సుమారు రూ. 6.29 లక్షల కోట్లకు చేరినట్లవుతుంది. ప్యాకేజీలో చాలా మటుకు భాగం.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణాలిచ్చే బ్యాంకులు, సూక్ష్మ రుణాల సంస్థలకు ప్రభుత్వ హామీ రూపంలోనే ఉండనుంది. ► 11 వేల మంది టూరిస్ట్ గైడ్లు, ఏజెన్సీలకు తోడ్పాటు.. పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా మూలధన రుణాలు, వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు కేంద్రం కొత్తగా లోన్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించింది. కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 10,700 టూరిస్ట్ గైడ్లు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన గైడ్లకు ఇది వర్తిస్తుంది. అలాగే పర్యాటక శాఖ గుర్తింపు పొందిన 907 మంది పర్యాటక రంగంలోని ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏజెన్సీకి గరిష్టంగా రూ. 10 లక్షలు, టూరిస్ట్ గైడ్లకు రూ. 1 లక్ష రుణం అందేలా 100% గ్యారంటీని కేంద్రం సమకూరుస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు వంటివేవీ ఈ రుణాలకు వర్తించవు. ► 5 లక్షల మందికి ఉచిత టూరిస్ట్ వీసా అంతర్జాతీయ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యాక భారత్‌కు వచ్చే తొలి 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచిత టూరిస్ట్ వీసా ఇవ్వనున్నారు. 31 మార్చి 2022 వరకు లేదా 5 లక్షల టూరిస్ట్ వీసా ల లక్ష్యం పూర్తయ్యే వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనితో కేంద్రంపై రూ.100 కోట్ల భారం పడనుంది. ► హెల్త్‌కేర్ ప్రాజెక్టులకు రూ. 50వేల కోట్లు.. కోవిడ్ ప్రభావిత రంగాలకు రుణ వితరణలో భాగంగా ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 50 వేల కోట్ల మేర రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (ఎన్సీజీటీసీ) గ్యారంటీ ఇస్తుంది. ఇది విస్తరణకు, కొత్త ప్రాజెక్టులకు కూడా వర్తిస్తుంది. విస్తరణ ప్రాజెక్టులకైతే 50 శాతం, కొత్త ప్రాజెక్టులకైతే 75 శాతం గ్యారంటీ వర్తిస్తుంది. 8 మెట్రోపాలిటన్ నగరాలు కాకుండా మిగిలిన నగరాలకు ఇది వర్తిస్తుంది. గరిష్టంగా 7.95 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలి. అలాగే కోవిడ్ ప్రభావిత టూరిజం, ఇతర రంగాలకు మరో రూ. 60 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ప్రకటించింది. ► ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పొడిగింపు ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని 2022 మార్చి 31 వరకు వర్తించేలా కేంద్రం పొడిగించింది. ఈపీఎఫ్ఓలో నమోదైన సంస్థలు అంతకుముందు ఈపీఎఫ్ చందాదారు కాని రూ. 15 వేల లోపు వేతనంతో కొత్త ఉద్యోగిని తీసుకున్నప్పుడు, అలాగే మహమ్మారి వల్ల 1–3–2020 నుంచి 30–09–2020 మధ్య ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగికి 1 అక్టోబరు 2020 నుంచి 30 జూన్ 2021 మధ్యలో ఉద్యోగం కల్పించినప్పుడు (రూ.15 వేల వేతనం వరకు) ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రెండేళ్లపాటు ప్రయోజనం లభిస్తుంది. వెయ్యి మంది వరకు ఉద్యోగులు ఉన్న సంస్థల విషయంలో ఈపీఎఫ్‌లో ఉద్యోగి చందా(వేతనంలో 12%), యాజమాన్య చందా(వేతనంలో 12 శాతం) మొత్తంగా 24% కేంద్రం భరిస్తుంది. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో కేవలం ఉద్యోగి చందా 12% మాత్రమే కేంద్రం భరిస్తుంది. ► ఈసీఎల్‌జీఎస్‌కు అదనంగా 1.5 లక్షల కోట్లు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) పరిధిని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల కోట్ల నుంచి అదనంగా రూ. 1.5 లక్షల కోట్లు పెంచుతూ లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 4.5 లక్షల కోట్లు అందేలా ఉపశమన చర్యలు ప్రకటించారు. ► మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రుణాలు మైక్రో ఫైనాన్స్ సంస్థల ద్వారా 25 లక్షల మందికి గరిష్టంగా రూ. 1.25 లక్షల మేర రుణం అందేలా కేంద్రం .. షెడ్యూల్డు బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. మార్జిన్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) కంటే 2% ఎక్కువకు బ్యాంకుల నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఈ రుణాలు లభిస్తాయి. రూ. 7,500 కోట్ల మేర రుణ వితరణ జరిగే వరకు లేదా మార్చి 31, 2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ► చిన్నారుల ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు కొత్తగా రూ. 23,220 కోట్ల మేర ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసేందుకు కొత్త పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నియామకం, జిల్లా, సబ్ జిల్లా స్థాయిలో ఐసీయూ పడకలు, ఆక్సిజన్ సరఫరా ఏ ర్పాట్లు, వైద్య పరికరాలు, మందులు, టెలీకన్సల్టేషన్, ఆంబులెన్స్ వసతులపై ఈ నిధులు వెచ్చిస్తారు. ► డీఏపీపై అదనపు సబ్సిడీ... డీఏపీ ఎరువులకు అదనంగా రూ. 14,775 కోట్ల మేర సబ్సిడీని ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు వర్తించేలా ఆర్థిక శాఖ ఆమోదించింది. ఈ సబ్సిడీ పెంపును కేంద్రం ఇదివరకే ప్రకటించింది. నిధులను తాజాగా విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ► ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పొడిగింపు కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను నవంబరు వరకు పొడిగించారు. ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రతి ఒక్కరికి అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఈ అంశాన్ని గతంలో ప్రధాన మంత్రి ప్రకటించగా, ఇటీవలే కేబినెట్ ఆమోదించింది. ► ఇతరత్రా 8 సహాయక చర్యలు ♦ రైతు ఆదాయం రెట్టింపు చర్యలు, పౌష్ఠికాహార లోప నివారణ చర్యలు.. ♦ ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ సంస్థకు రూ. 77.45 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీ ♦ నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ (ఎన్‌ఈఐఏ)కు రూ. 33,000 కోట్ల మేర లబ్ధి. ♦ ఐదేళ్లలో ఎగుమతులకు బీమా కవరేజీని రూ. 88 వేల కోట్ల మేర పెంచే దిశగా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కు నిధులు. ♦ పంచాయతీలకు నెట్ సౌకర్యం దిశగా భారత్‌నెట్‌కు అదనంగా మరో రూ. 19,041 కోట్లు. ♦ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) 2025–26 వరకు పొడిగింపు. ♦ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవస్థను ఆధునీకరిస్తారు. దీనికి రూ. 3,03,058 కోట్ల వెచ్చింపు. ఇందులో కేంద్రం వాటా రూ. 97,631 కోట్లు ఉంటుంది. ♦ పీపీపీ ప్రాజెక్టుల ఆమోద ప్రక్రియను సరళీకరిస్తూ ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు కొత్త విధానం. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు, ఉత్పత్తి.. ఎగుమతులతో పాటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేవిగా ఈ చర్యలు ఉన్నాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపడేందుకు, మెడికల్ ఇన్ఫ్రాలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేలా తోడ్పడగలవు. రైతుల వ్యయాలు తగ్గేందుకు, వారి ఆదాయాలు పెరిగేందుకు దోహదపడగలవు‘ – నరేంద్ర మోదీ, ప్రధాని ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో ప్రైవేట్ వైద్య రంగం చాలా కీలక పాత్ర పోషించింది. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలు హెల్త్‌కేర్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఎకానమీ సత్వరం కోలుకోవడానికి కూడా తోడ్పడగలవు‘ – ప్రతాప్ సి. రెడ్డి, చైర్మన్, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వృద్ధికి ఊతం.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్దీపన చర్యలు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లాక్డౌన్లతో కుదేలైన వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కష్టాలు తీరేందుకు ఇవి తోడ్పడగలవని సీఐఐ అభిప్రాయపడింది. వీటితో ఎగుమతులు మెరుగుపడటానికి ప్రోత్సాహం లభించగలదని ఎఫ్ఐఈవో పేర్కొంది. కోవిడ్‌తో దెబ్బతిన్న అనేక రంగాలకు ఈ ప్యాకేజీ ప్రాణం పోయగలదని అసోచాం తెలిపింది. -
యూపీలో నర్సులపై వెకిలి వేషాలు
న్యూఢిల్లీ/ఘజియాబాద్: బ్లాక్ లిస్ట్‌లో చేర్చి, టూరిస్ట్ వీసాలను రద్దు చేసిన 960 మంది తబ్లిగీ జమాత్‌కు చెందిన విదేశీ కార్యకర్తల్లో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారని కేంద్ర హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. వారితో పాటు, ప్రస్తుతం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉన్న తబ్లిగీ విదేశీ కార్యకర్తల్లో 379 మంది ఇండోనేసియన్లు, 110 మంది బంగ్లాదేశీయులు, 63 మంది మయన్మార్ వారు, 33 మంది శ్రీలంక వారు ఉన్నారని పేర్కొంది. కిర్గిస్తాన్(77), మలేసియా(75), థాయిలాండ్(65), ఇరాన్(24), వియత్నాం(12), సౌదీ అరేబియా(9), ఫ్రాన్స్(3)లకు చెందిన విదేశీ తబ్లిగీ కార్యకర్తల వీసాలను కూడా రద్దు చేశామంది. ఆ 960 మందిలో కజకిస్తాన్, కెన్యా, మడగాస్కర్, మాలి, ఫిలిప్పైన్స్, ఖతార్, రష్యా తదితర దేశాల వారు కూడా ఉన్నారని తెలిపింది. టూరిస్ట్ వీసాపై వచ్చిన వీరిని ఇప్పుడు ఆయా దేశాలకు తిరిగి పంపే ఆలోచన లేదని, వారిపై ఫారినర్స్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద వీసా నిబంధనలను ఉల్లంఘించిన నేరాల కింద చర్యలు తీసుకోనున్నామని హోంశాఖ జాయింట్ సెక్రటరీ పున్య సలిల శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘వారిపై చర్యలు ప్రారంభమైన ప్రస్తుత సమయంలో వారిని వెనక్కు పంపే ప్రశ్నే లేదు. ఎప్పుడు పంపిస్తామన్నది నిబంధనలకు లోబడి నిర్ణయిస్తాం’ అన్నారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమాల్లో పాల్గొని తమ దేశాలకు వెళ్లిన 360 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్ చేసే కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించింది. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించామని శ్రీవాస్తవ తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తగా 1930 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రారంభించామన్నారు. కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా ఉన్నాయన్నారు. ► కరోనా, లాక్‌డౌన్‌కు సంబంధించి ఢిల్లీ ప్రజలు తమ సమస్యలు తెలిపేందుకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్ 8800007722ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు శుక్రవారం రాజస్తాన్‌లోని టోంక్ జిల్లాలో పర్యటించారు. కరోనా వ్యాప్తిపై సర్వే నిర్వహించారు. యూపీలో నర్సులపై వెకిలి వేషాలు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసుపత్రిలో నర్సులపై తప్పుగా ప్రవర్తించిన ఆరుగురు తబ్లిగీ జమాత్ సభ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేసింది. వారిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. నర్సులపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ప్యాంటు వేసుకోకుండా ఆసుపత్రుల్లో తిరిగారని, వెకిలి వ్యాఖ్యలు చేస్తూ, బూతు పాటలు పాడుతూ, వెకిలి చర్యలకు పాల్పడ్డారని, భౌతిక దూరం పాటించలేదని, తామిచ్చే ఔషధాలను తీసుకునేందుకు నిరాకరించారని ఆ ఆరుగురిపై నర్సులు ఫిర్యాదు చేశారు. దేశ భద్రతకు, శాంతి భద్రతలకు ప్రమాదమని భావిస్తే ఎన్ఎస్ఏ కింద ఎవరినైనా ఎలాంటి అభియోగాలు లేకుండానే, సంవత్సరం పాటు నిర్బంధంలోకి తీసుకోవచ్చు. కనౌజ్‌లోని జామామసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు గుమికూడటాన్ని నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ► మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోవిడ్–19 బాధితుల కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగును క్వారంటైన్ చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడి చేసిన నలుగురిపై జాతీయ భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌పై పోరుకు ఆ ఘటనలతో విఘాతం ఆనంద్ విహార్ వద్ద భారీ సంఖ్యలో వలస కార్మికులు గుమికూడటం, నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ యావత్ దేశం కరోనా కట్టడికి చేస్తోన్న ప్రయత్నాలకు విఘాతం కలిగించాయని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. -
యూఏఈకి ఐదేళ్ల టూరిస్ట్ వీసా..
మోర్తాడ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యాటకులను ఆకర్షించడానికి అక్కడి ప్రభుత్వం ఐదేళ్ల మల్టీ ఎంట్రీ వీసాల జారీకి శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరం ఆరంభంలో తొలిసారి సమావేశం నిర్వహించిన దుబాయి రూలర్, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఐదేళ్ల టూరిస్ట్ వీసా జారీపై ప్రకటన చేశారు. యూఏఈ పరిధిలోని దుబాయి, షార్జా, అబుదాబి తదితర పట్టణాల్లో పర్యటించడానికి 30 రోజులు లేదా 90 రోజుల కాల పరిమితితో కూడిన టూరిస్ట్ వీసాలను జారీచేసేవారు. ఈ వీసాలను విజిట్ వీసాలు అని కూడా అనేవారు. విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన ఎంతో మంది అక్కడ కల్లివెల్లి కావడం లేదా కంపెనీ వీసాలను తీసుకుని అక్కడే స్థిరపడిపోవడం జరిగేది. అయితే, గతంలో కంటే విజిట్ వీసా లేదా టూరిస్ట్ వీసాలపై కఠిన తరమైన నిబంధనలను విధించిన యూఏఈ ప్రభుత్వం తాజాగా ఐదేళ్ల కాలపరిమితితో కూడిన టూరిస్ట్ వీసాలను జారీచేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ వీసాలను పొందిన వారు ఐదేళ్ల కాల పరిమితిలో యూఏఈకి చేరిన తరువాత ఆరు నెలల కాలంఉండటానికి అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు తమ సొంత దేశంలో లేదా ఇతర దేశాల్లో నివాసం ఉండాలి. కాగా, యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదేళ్ల టూరిస్ట్ మల్టీ వీసాలతో ఎవరికి ప్రయోజనం కలుగుతుంది.. మరెవరికి ఇబ్బంది ఎదురవుతుందనే విషయంపై యూఏఈ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తరువాతనే వెల్లడి కానుంది. -
వాళ్లిద్దరూ ఒకే గదిలో ఉండవచ్చు!
రియాద్ : యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని సౌదీ అరేబియా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయనున్న ముస్లిం రాజ్యం... వారికి మరిన్ని వెసలుబాట్లు కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టూరిస్ట్ వీసాల కోసం 49 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్న సౌదీ... తాజాగా తమ దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు, పురుషులు సంయుక్తంగా హోటల్ గదుల్లో బస చేయవచ్చని తెలిపింది. అదే విధంగా వాళ్లు బంధువులు కాకపోయినా తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. అంతేగాకుండా సౌదీ మహిళలు కూడా తమ బంధువులతో కలిసి లేదా ఒంటరిగానైనా బస చేసేందుకు హోటల్ గదులను బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు... ‘ రూంలు బుక్‌చేసుకున్న సౌదీ జాతీయులు తమ కుటుంబ గుర్తింపు కార్డు చూపించి హోటల్లో బస చేయవచ్చు. అయితే విదేశీ పర్యాటకులకు ఈ నిబంధన వర్తించదు. విదేశీ పురుషులు లేదా మహిళలు విడివిడిగా గానీ, సంయుక్తంగా గానీ హోటల్లో దిగవచ్చు’ అని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ శాఖ ప్రకటన విడుదల చేసినట్లు వార్తా సంస్థ ఒకాజ్ వెల్లడించింది. (చదవండి : పొరుగింటి మీనాక్షమ్మను చూశారా!) కాగా కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో గత కొంతకాలంగా ఆహ్వానించదగ్గ మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్నారు. అదే విధంగా మహిళల పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇక సౌదీకి చెందిన లేదా విదేశీయులైన పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి కలిసి బయటికి వస్తే బహిరంగంగానే కఠిన శిక్షలు అమలుచేసేవారన్న సంగతి తెలిసిందే. అయితే బిన్ ఆదేశాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే దిశగా తాజాగా సౌదీ ప్రభుత్వం ఈ నిబంధనలకు చరమగీతం పాడింది. 2030 నాటికి సుమారు 100 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు సౌదీని సందర్శించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక పెళ్లికి ముందు శృంగారాన్ని తీవ్ర నేరంగా పరిగణించే సౌదీ ప్రభుత్వం.. దానిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి
గుంటూరు: స్నేహితుని మాటలు నమ్మిన ఓ యువకుడు దేశం గాని దేశం వెళ్లి జైలు పాలయిన ఘటన వెలుగు చూసింది. తన కొడుకును రక్షించాలంటూ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పందన కేంద్రంలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి వేడుకోవడంతో విషయం బహిర్గతమయ్యింది. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులో నివాసం ఉంటున్న బత్తుల గురూజీ కథనం మేరకు.. గురూజీ ఆటో నడుపుకుంటూ భార్య పద్మ, కుమార్తె చంద్రకళ, కుమారుడు నరసింహారావుతో కలసి జీవిస్తున్నాడు. 10వ తరగతి చదివిన కొడుకు నరసింహారావు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు సైదారావుతో నరసింహారావు స్నేహంగా ఉండేవాడు. అతను గతేడాది చివరిలో మలేషియా వెళ్లి రెండు నెలల పాటు కూలి పనులు చేసి డబ్బుతో తిరిగొచ్చాడు. నరసింహారావును కూడా మలేషియా తీసుకెళ్తానని గురూజీ దంపతులను సైదారావు ఒప్పించాడు. రూ.లక్ష అప్పు చేసి.. కొడుకు జీవితం బాగు పడటంతో పాటుగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడని బావించిన తండ్రి లక్ష రూపాయలు అప్పుచేసి ఐదు నెలల క్రితం నరసింహారావును మలేషియా పంపాడు. అక్కడకు వెళ్లిన అనంతరం ఓ కంపెనీలో ప్యాంకింగ్ విభాగంలో పని దొరికిందని నరసింహారావు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనంద పడ్డారు. అయితే అనంతరం అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సైదారావును తమ కొడుకు సమాచారం కోసం విచారిస్తే నరసింహారావు జైలులో ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెప్పాడు. గురూజీ సెల్ ఫోన్‌కు కుమారుడి దగ్గర నుంచి వచ్చిన లేఖ టూరిస్టు వీసా కావడంతో.. సైదారావు గతంలో టూరిస్ట్ వీసాతో మలేషియా వెళ్లొచ్చాడు. అదే తరహాలో నరసింహారావు వెళ్లాడు. పర్యాటకులుగా వెళ్లిన వ్యక్తులు అక్కడ ఎలాంటి ఉద్యోగం చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో నరసింహారావు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నిఘా విభాగం వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొంతమంది సహాయంతో తనను తీసుకెళ్లాలంటూ వాట్సాప్‌లో మూడు లేఖలను తండ్రికి పంపించాడు. అధికారులు స్పందించి తమ కుమారుడిని కాపాడాలని గురూజీ దంపతులు వేడుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 8179827921 నంబర్లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసాకు ఓకే
న్యూఢిల్లీ: విదేశీ పౌరుల్ని వివాహం చేసుకునే భారతీయులకు కేంద్రం శుభవార్త తెలిపింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న విదేశీయులు తమ పర్యాటక వీసాలను ఎక్స్2(డిపెండెంట్) వీసాలుగా మార్చుకునేలా నిబంధనల్ని సవరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ భారతీయుడు ఫిలిప్పైన్స్ మహిళను అక్కడే వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చాలని వధువు దరఖాస్తు చేసుకోగా నిబంధనలు అంగీకరికపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. ఫిలిప్పైన్స్కు వెళ్లి ఎక్స్2 వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె భర్త ఈ విషయమై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్ ఆదేశాలతో వెంటనే స్పందించిన హోంశాఖ.. పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చేందుకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని సవరించనున్నట్లు తెలిపింది. అలాగే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకుంటే వారి జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసా ఇచ్చేందుకు ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని మార్చనున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వెసులుబాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్ దేశాలు, పాక్ సంతతి పౌరులు, ఏ దేశానికి చెందనివారికి వర్తించబోదని పేర్కొంది. -
బ్రిటన్‌కు వలసల్లో పడిపోయిన భారత్ స్థానం
లండన్: బ్రిటన్‌లో ఉండే విదేశీయుల్లో సంఖ్యాపరంగా భారతీయులు నాలుగో స్థానంలో నిలిచారు. అయితే, ఈ విషయంలో 2016లో భారత్ రెండో స్థానం ఆక్రమించగా 2017 లెక్కల ప్రకారం నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ వలసలపై జాతీయ గణాంకాల కార్యాలయం(ఓఎన్ఎస్) తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం పోలండ్(10 లక్షలు) ప్రథమ స్థానంలో, రుమేనియా(4.11 లక్షలు), రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ (3.50 లక్షలు), భారత్(3.46 లక్షలు) నాలుగో స్థానంలో ఉంది. యూరోపియనేతర దేశాలతో పోలిస్తే వలసల్లో భారతీయులదే ప్రథమ స్థానం, ఆ తర్వాత పాకిస్తాన్(1.88లక్షలు) నిలుస్తోంది. అయితే, పర్యాటక వీసాపై బ్రిటన్‌కు వెళ్లే వారిలో అత్యధికులు భారతీయులు కాగా రష్యా, పాకిస్తాన్, చైనా దేశీయులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వలస జనాభా పెరుగుదల రీత్యా చూస్తే రుమేనియా మొదటి స్థానంలో ఉందని ఓఎన్ఎస్ అధికారి నికోలా వైట్ తెలిపారు. -
క్వికర్‌లో యాడ్ చూసి..
సాక్షి, సిటీబ్యూరో: క్వికర్‌లో కనిపించిన ఓ యాడ్ ముగ్గురు నగరవాసులను నిండా ముంచింది. అజార్బైజాన్ దేశంలో ఉద్యోగం పేరుతో టూరిస్ట్ వీసాపై తీసుకువెళ్లిన మోసగాళ్లు నెల తర్వాత తరిమేశారు. బిహార్ రాజధాని పట్నాకు చెందిన ఓ వ్యక్తి చేతిలో రూ.7.15 లక్షలు మోసపోయిన బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు సుధీర్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్ మహంతి గురువారం తెలిపాడు. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్బర్ అలీ ఖాన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేసి తన కుటుంబానికి చేదోడువాదోడుగా మారాలని భావించిన అతను తన ఆలోచనను స్నేహితులైన ఇమ్రోజ్ ఖాన్, షేక్ మినాజ్లకు చెప్పాడు. ముగ్గురూ కలిసి విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనే ఆశతో ఆన్లైన్ పోర్టల్ క్వికర్ ద్వారా అన్వేషించారు. ఈ నేపథ్యంలో పట్నాకు చెందిన సుధీర్‌కుమార్ అలియాస్ రాజేష్‌కుమార్ ఇచ్చిన ప్రకటన వీరిని ఆకర్షించింది. అజార్బైజాన్ దేశంలో అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయని, భారత కరెన్సీలో నెలకు కనీసం రూ.లక్ష జీతం వస్తుందంటూ అందులో పేర్కొన్న సుధీర్ తన ఫోన్ నెంబర్ సైతం పొందుపరిచాడు. దీంతో ఈ ముగ్గురూ ఆ నెంబర్లో సంప్రదించగా... రిజిస్ట్రేషన్ చార్జీల నిమిత్తం రూ.15 వేలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయడంతో పాటు పూర్తి వివరాలు పంపాలని కోరాడు. దీంతో ఈ త్రయం ఆ మొత్తం డిపాజిట్ చేసి, వివరాలు పంపిన కొన్ని రోజులకే టూరిస్ట్ వీసాలు వీరి చిరునామాలకు పంపాడు. ఈ వీసాలను చూసిన ముగ్గురూ పూర్తిగా సైబర్ నేరగాళ్ల వల్లో పడిపోయారు. ఆ తర్వాత అసలు కథ ప్రారంభించిన నేరగాళ్లు ఇతర చార్జీల కింద ఒక్కొక్కరు రూ.1.5 లక్షల చొప్పున చెల్లించాలని చెప్పాడు. అయితే బేరసారాల తర్వాత ముగ్గురూ కలిసి రూ.3.5 లక్షలు చెల్లించారు. దీంతో వీరికి విమాన టిక్కెట్లు పంపిన సైబర్ నేరగాడు సుధీర్ అజార్బైజాన్ వెళ్లిన తర్వాత అక్కడ తమ భాగస్వామి సమీర్ కలుస్తాడని, అతడికి ఒక్కొక్కరు 2 వేల డాలర్ల చొప్పున చెల్లించిన తర్వాతే జాబ్ వీసా, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాడని సుధీర్ చెప్పాడు. మూడేళ్ల వర్క్ పర్మిట్ ఉంటుందని నమ్మబలికాడు. అప్పటికే వీసా, విమాన టిక్కెట్ల అందడంతో ఈ ముగ్గురూ పూర్తిగా సైబర్ నేరగాడి మాయలో పడిపోయారు. గతేడాది డిసెంబర్లో ఆ దేశం వెళ్లిన ఈ ముగ్గురినీ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకున్న సమీర్‌కు సంబంధించిన వ్యక్తి ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లాడు. మొత్తం ఆరు వేల డాలర్లు చెల్లించిన తర్వాత దాదాపు నెల పాటు అక్కడి ఓ అపార్ట్మెంట్లో ఉంచి ఆహారం అందించారు. ఆపై హఠాత్తుగా మీ టూరిస్ట్ వీసా గడువు ముగుస్తోందని చెప్పిన సమీర్ తక్షణం స్వదేశం వెళ్లకపోతే ఇక్కడి పోలీసులు జైల్లో పెడతారని, అంత తేలిగ్గా బెయిల్ సైతం లభించదని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక సిటీకి తిరిగి వచ్చిన బాధితులు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడు వాడిన ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పట్నా వెళ్లిన ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సుధీర్‌కుమార్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇతను అక్కడ ఎస్వీఎస్ ఇంటర్నేషనల్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
పెరుగుతున్న మలేషియా బాధితులు
వేంపల్లె : మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు రాబట్టి.. వారికి టూరిస్టు వీసా ఇచ్చి మోసం చేసిన కేసులో మామాఅల్లుళ్లు ఫకృద్దీన్, సలీం బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. వేంపల్లె, చిలంకూరు, కడపకు చెందిన ఏడుగురు యువకులకు వారు ఈ విధంగా చెప్పి మోసం చేశారు. ఈ కారణంగా బాధితులు విదేశాల్లో అష్టకష్టాలు ఎదుర్కొని స్వదేశానికి తిరిగి వచ్చారు. వారితోపాటు మరికొందరు మంగళవారం వేంపల్లె గరుగువీధిలో నివసిస్తున్న ఫకృద్దీన్, సలీం ఇంటి వద్దకు వెళ్లారు. తమకు జరిగిన మోసంపై పలువురు నిలదీశారు. దీనికి వారు సానుకూలంగా స్పందించకపోగా.. ఏం చేసుకుంటారో చేసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మామ, అల్లుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మరి కొంత మంది బాధితులు వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వస్తున్నారు. బాధితులు ఇంకెంత మంది ఉన్నారోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొంత మంది మలేషియాలోని జైలులోనే ఉన్నట్లు తెలియవచ్చింది. ఫిర్యాదుదారులతో నిందితులు బేరసారాలు సాగిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ చలపతిని వివరణ కోరగా.. ఇప్పటి వరకు 15 మంది బాధితులు తమను సంప్రదించారని తెలిపారు. -
25 ఏళ్లు, ఆపై మహిళలు ఒంటరిగా రావచ్చు!
ఇన్నిరోజులు సౌదీ అరేబియాను సందర్శించాలంటే మహిళలకు కచ్చితంగా పక్కన ఓ తోడు ఉండాలి. లేదంటే ఆ దేశం టూరిస్ట్ వీసానే జారీచేయదు. కానీ ప్రస్తుతం 25 సంవత్సరాలు, ఆపైబడిన మహిళలు ఇక ఒంటరిగా టూరిస్ట్ వీసాపై సౌదీ అరేబియాను సందర్శించవచ్చట. ఈ విషయాన్ని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం, నేషనల్ హెరిటేజ్ అధికార ప్రతినిధి చెప్పారు. కుటుంబ సభ్యులు లేదా ఎలాంటి సహచరులు అవసరం లేకుండానే మహిళలు సౌదీ అరేబియా సందర్శించే స్వేచ్ఛను తాము కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కానీ 25 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలు మాత్రం సౌదీ అరేబియాకి ప్రయాణించాలంటే కచ్చితంగా కుటుంబసభ్యులు లేదా సహచరులు అవసరమని తెలిపారు. ''టూరిస్ట్ వీసా అనేది సింగిల్-ఎంట్రీ వీసా. గరిష్టంగా 30 రోజులు వాలిడ్‌లో ఉంటుంది. ఇది వర్క్, విజిట్, హజ్, ఉమ్రా వీసాలు నుండి స్వతంత్రంగా ఉంటుంది'' అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది కమిషన్స్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ఉమర్ అల్-ముబారక్ తెలిపారు. టూరిస్ట్ వీసాలకు సంబంధించిన నిబంధనలు తుది రూపకల్పన జరిగాయని, ఈ నిబంధనలను 2018 తొలి క్వార్టర్లో ప్రకటించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర సమాచార సెంటర్, విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కలిసి టూరిస్ట్ వీసాల జారీ కోసం ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను కమిషన్ ఐటీ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేస్తుందని అల్-ముబాకర్ తెలిపారు. మహిళల భద్రత దృష్ట్యా ముస్లింలతో పాటు సాధారణ మహిళలు కూడా సౌదీలో పర్యటించాలంటే భర్త లేదా సహచరులు అవసరం ఉండేది. ఇదే రకమైన నిబంధనను ప్రపంచంలో చాలా మతాల వారు అనుసరిస్తున్నారు. -
ఉద్యోగం ఆశచూపి.. అమ్మేయాలనుకున్నాడు..
మలేషియాలో చాక్లెట్ కంపెనీలో ఉద్యోగమని చెప్పి తన భార్యను అమ్మడానికి ప్రయత్నించారని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివీ.. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బారాయుడు, రమణమ్మలు భార్యాభర్తలు. వెంకట సుబ్బారాయుడు రైతు. వ్యవసాయం కలిసిరాక రూ.4.5 లక్షల వరకు అప్పు అయింది. దానిని తీర్చే దారి కానరాక సతమతమవుతున్నాడు. ఇదే సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన ఏజెంటు సుభాన్‌వలీ పరిచయమయ్యాడు. భార్యాభర్తలకు మలేషియా చాక్లెట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. నెలకు చెరో రూ.20వేలు చొప్పన వస్తుందని చెప్పడంతో వారు నిజమేననుకున్నారు. ఈ ఒప్పందం మేరకు మళ్లీ అప్పుచేసి ఆ ఏజెంటుకు రూ.1.20 లక్షలు చెల్లించగా గత నెల 16వ తేదీన రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో మలేషియాకు పంపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత.. టూరిస్టు వీసా ఇచ్చి ఏజెంటు మలేషియాకు పంపినట్లు అక్కడి తెలుగు వారు తెలపటంతో మోసపోయినట్లు గ్రహించారు. అనంతరం వలి పరిచయం చేసిన అక్కడి ఏజెంటు కృష్ణ ఆ దంపతులను తనతోపాటు తీసుకెళ్లి నిర్బంధించాడు. రమణమ్మను ఏజెంటు సుభాన్‌వలి తనకు రూ.60వేలకు అమ్మినట్లు కృష్ణ తెలిపాడు. అంతేకాకుండా రమణమ్మను పలురకాలుగా హింసించాడు. ఇది చూసి తట్టుకోలేక సుబ్బారాయుడు ఆత్మహత్యకు యత్నించాడు. వీరు మాట వినేలా లేరని గ్రహించిన కృష్ణ వదిలిపెట్టాడు. దీంతో వారు బంధువుల సహకారంతో మరో రూ.35 వేలను కృష్ణకు చెల్లించి తిరిగి గత నెల 27వ తేదీన స్వగ్రామానికి చేరుకోగలిగారు. ఈ విషయమై గురువారం బాధితులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
వీసాలలో ఎన్ని రకాలుంటాయి?
ఒక దేశం మీద నుంచి మరొక దేశానికి వెళ్లడానికి ఇచ్చేది ట్రాన్సిట్ వీసా! కొన్ని రోజులు లేదా కొన్ని, నెలల పాటు విదేశాలలో ఉండటానికి ఇచ్చేది విజిటర్ వీసా! పరిమిత కాలానికి మాత్రమే ఇచ్చేది టూరిస్ట్ వీసా! ఈ వీసాతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. ఇతర దేశాలలోని ఆసుపత్రులకు వ్యాధుల నిర్ధారణ, చికిత్సకు వెళ్లేది మెడికల్ వీసా! ఇతర దేశాలలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు ఇచ్చేది బిజినెస్ వీసా! దీర్ఘకాలం విదేశాలలో నివసించడానికి రెసిడెన్స్ వీసా, వలస వెళ్లడానికి అనుమతిపొందేందుకు ఇమ్మిగ్రెంట్ వీసా, విదేశాలకు వెళ్లడానికి పొందే అనుమతి ఆన్ ఎరైవల్ వీసా, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలలో లావాదేవీలకు ఎలక్ట్రానిక్ వీసాలు ఉంటాయి. పాస్‌పోర్ట్ నిర్ధారణ జరిగిన తర్వాతే వీసాపై సంబంధిత లేబుల్‌ను ముద్రిస్తారు.