
కొంతమంది ఇంటిని ఎంతో చక్కగా ఉంచుకుంటారు కానీ వంటగదిని మాత్రం పట్టించుకోరు. వాడిన గిన్నెలను శుభ్రం చేసుకోకుండా బాక్టీరియా చేరేవరకు అలానే వదిలేస్తారు లేదా ఎవరికోసమో ఎదురుచూస్తూ వాటిని అక్కడే పడేస్తారు. తీసుకొనే ఆహారం శుభ్రంగా ఉండాలంటే వంటగది శుభ్రత అవసరమే కదా! మీరు ఈ విషయంలో ఎలా ఉంటారు?
1. బాగా పొద్దుపోయాక అతిథులు వచ్చినా ఏ మాత్రం తడుముకోకుండా వంట పూర్తిచేయగలరు.
ఎ. కాదు బి. అవును
2. తెలిసినవారి ఇంటికెళ్లినప్పుడు వంటగది శుభ్రంగా లేకపోతే, దాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తారు.
ఎ. కాదు బి. అవును
3. కిచెన్ శుభ్రత విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తుంటాయి.
ఎ. అవును బి. కాదు
4. ఫ్రిజ్‌లో ఉన్న ఐటమ్స్ చెడిపోయి వాసన వస్తున్నా పట్టించుకోరు.
ఎ. అవును బి. కాదు
5. హోమ్ అప్లికేషన్స్ ఇతరులనుంచి అరువు తెచ్చుకోవటం మీకు ఇష్టం ఉండదు.
ఎ. కాదు బి. అవును
6. ప్రతిరోజూ వంట పూర్తయ్యాక విధిగా వంటింటిని శుభ్రం చేస్తారు.
ఎ. కాదు బి. అవును
7. కిచెన్‌లో పాత్రలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటారు. వస్తువులకోసం వెతకకుండా అన్నింటినీ అందుబాటులో ఉంచుకుంటారు.
ఎ. కాదు బి. అవును
8. వంటగది అరలు క్లీన్‌గా ఉండాలనుకుంటారు.
ఎ. కాదు బి. అవును
9. ఇతరులు మీ వంటగదిని చూసి అభినందిస్తుంటారు.
ఎ. కాదు బి. అవును
10. కొత్తకొత్త వంటసామాన్లు కొంటానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.
ఎ. కాదు బి. అవును
‘బి’ లు నాలుగు వస్తే కిచెన్‌పై శ్రద్ధ తీసుకుంటున్నట్లే. ‘బి’ లు ఏడు దాటితే వంటగదిపై విపరీతమైన శ్రద్ధ కనబరుస్తారు. ఇతరులను వంటగదిలోకి చేరనివ్వరు. ఇల్లు, వంటగది నీట్‌గా ఉంచుకోవటం అవసరమే. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే వంటగదిపై మీరు సరైన శ్రద్ధ తీసుకోవడం లేదని అర్థం.