డిజిటల్ 3డి మామోగ్రఫీతో రొమ్ముక్యాన్సర్‌ను ముందే గుర్తించండి! | Identify the digital 3-D mamographito breast cancer! | Sakshi
Sakshi News home page

డిజిటల్ 3డి మామోగ్రఫీతో రొమ్ముక్యాన్సర్‌ను ముందే గుర్తించండి!

Published Sun, Dec 8 2013 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

డిజిటల్ 3డి మామోగ్రఫీతో రొమ్ముక్యాన్సర్‌ను ముందే గుర్తించండి!

డిజిటల్ 3డి మామోగ్రఫీతో రొమ్ముక్యాన్సర్‌ను ముందే గుర్తించండి!

రొమ్ముక్యాన్సర్ అంటే గతంలో ఒక ఆందోళన. బిడ్డకు ఆహారాన్ని, ఆరోగ్యాన్ని సమకూరుస్తూ, స్త్రీత్వానికి ప్రతీకగా నిలుస్తూ పరిపూర్ణనిచ్చే రొమ్ముకు అనారోగ్యం వస్తే గుండెకే గాయం అయినట్లవుతుంది. ఆ గాయాలు గడ్డల రూపంలో, కణుతుల రూపంలో ఉంటాయి. వాటిని తొలిదశలోనే గుర్తిస్తే ... అవి ఒకవేళ రొమ్ము క్యాన్సర్ రూపాన్ని సంతరించుకున్నా సరే పూర్తిగా తగ్గిపోతాయి. ఇక ఇలా రొమ్ముక్యాన్సర్‌నుంచి ప్రాణాపాయం తప్పడం అనే ప్రధాన వరం దక్కాక, మరో చిన్న అనుగ్రహమూ చిక్కితే బాగుంటుందనే ఆశ. అదే రొమ్మును తొలగించకుండా దాన్ని యథాతథంగా ఉంచడమనే కోరిక. ఇలా ఆరోగ్యమూ అందమూ... ఈ రెండూ దక్కాలనే ఆకాంక్ష. ఆ ఆశా, ఆకాంక్షా నెరవేరే రోజులు వచ్చేశాయి. ఇప్పుడు క్యాన్సర్‌కు శస్త్రచికిత్స, అందాన్ని పరిరక్షించే మేలుచికిత్సా ఒకేసారి దక్కే అవకాశాలు విచ్చేశాయి. దీన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు.
 
దీనికి మనం చేయాల్సిందేమిటి? ముందుగా తెలుసుకొని, సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే రొమ్ముక్యాన్సర్‌పై, రొమ్ములోని గడ్డలపై తిరుగులేని పోరాటం చేయడమే. రొమ్ములో గడ్డలనే ఆ శత్రువులను తెలుసుకోడానికి ఇప్పుడు మరింత మెరుగైన ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. అవే... డిజిటల్ మామోగ్రాఫీ. మామోగ్రఫీ మునుపు కూడా ఉన్న పరిజ్ఞానమే. దీనికి మరింత ఆధునిక సాంకేతికత తోడై... బ్రెస్ట్ టోమోసింథసిస్ / 3డి మామోగ్రాఫీ అనే అత్యంతాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఒమెగా హాస్పిటల్స్‌లో నెలకొల్పిన ఈ అత్యాధునిక ఉపకరణంతో సంప్రదాయ పద్ధతుల్లో కంటే మరింత ముందుగానే గడ్డను చూడవచ్చు. దాని పరిణామాన్ని ముందుకంటే ప్రభావపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఫలితంగా రొమ్ములో కేవలం క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాన్ని తొలగించడానికి వీలవుతుంది. పక్కనున్న కణజాలం క్యాన్సర్ గడ్డతో కలగలసి పోయి, రెండింటినీ స్పష్టంగా,  నిర్దిష్టంగా గుర్తించలేని పరిస్థితి పూర్తిగా తొలగిపోయి, కాన్సర్ గడ్డ, కణితి ఉన్న భాగం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

దాంతో చికిత్స మరింత సులువుగా, సమర్థంగా, ప్రభావపూర్వకంగా అవుతుంది. దాంతో గతంలోలా వ్యాధి తిరగబెట్టడానికి ఉండే అవకాశాలు 30 శాతం తగ్గుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు... గతం కంటే ఇప్పుడు పరిస్థితి ఎంతగా మెరుగుపడిందో!
 
 డిజిటల్ మామోగ్రఫీ గురించి తెలుసుకునే ముందు అసలు మామోగ్రఫీ ఎన్ని రకాలో చూద్దాం. మొదటిది ఇంతకు ముందూ అందుబాటులో ఉన్న సంప్రదాయ స్క్రీన్ మామోగ్రఫీ, రెండోది 2-డి  మామోగ్రఫీ, మూడోది 3-డి మామోగ్రఫీ.
 
 డిజిటల్ మామోగ్రఫీ ఎంత మెరుగైనదంటే...

 గతంలో రొమ్ము పరీక్ష చేసే సంప్రదాయ మామోగ్రఫీతో పోలిస్తే డిజిటల్ మామోగ్రఫీతో ఏయే ప్రయోజనాలున్నాయో చూద్దాం. ఇప్పటివరకూ మనం తీస్తూ వచ్చిన సంప్రదాయ స్క్రీన్ మామోగ్రఫీలో గడ్డలు లేదా కణుతుల సైజు 9 మి.మీ. కంటే ఎక్కువగా ఉంటేనే అవి తెలుస్తాయి. పైగా స్క్రీన్ తీసే ప్రక్రియలో విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ. ఒకవేళ మొదటిసారి తీసింది అంత బాగా రాకపోతే మళ్లీ మళ్లీ తీయల్సి వచ్చేది. దీన్ని ఎంత సైజ్ కావాలో అంతగా పెంచి చూడటానికి వీలయ్యేది కాదు. నలభై లోపు వయసున్న మహిళల్లో ఉపయోగించడానికి సరికాదు. అంటే మెనోపాజ్ కంటే ముందుగా లేదా ఆ ప్రాంతంలో ఉన్న మహిళలపై దీన్ని ఉపయోగిస్తే ప్రయోజనం ఉండదు.
 
 అయితే ఇక డిజిటల్ మామోగ్రఫీ (2డి మామోగ్రఫీ) విషయానికి వస్తే పైన పేర్కొన్న పరిమితులన్నింటినీ అది అధిగమించగలదు. అయితే ఇందులో గడ్డ తాలూకు చిత్రం కేవలం పరిమాణం తెలుసుకోడానికే వీలవుతుంది తప్ప... దాని 3-డి ప్రతిబింబం కనిపించదు. పైగా ఏదో ఒక వైపు నుంచి చూస్తే కనిపించే దృశ్యమే తప్ప... అన్ని కోణాల్లోనూ గడ్డ/కణితి ఎలా కనిపిస్తుందో తెలిసే అవకాశం ఉండదు. అయితే 3-డి డిజిటల్ మామోగ్రఫీలో మాత్రం సాధారణ సంప్రదాయ స్క్రీన్ పద్ధతిలోనూ, 2-డిలోనూ ఉన్న అన్ని పరిమితులను అధిగమించి, గడ్డ లేదా కణితి తాలూకు స్పష్టమైన చిత్రాన్ని చూడటానికి వీలువుతుంది. అందుకే అన్ని వైద్య ఆరోగ్య విషయాల్లో సురక్షితత్వానికి ప్రాధాన్యం ఇచ్చే అమెరికా అత్యున్నత సంస్థ అయిన ఎఫ్‌డీఏ ‘3-డి డిజిటల్ మామోగ్రఫీ చిత్రం ద్వారా క్యాన్సర్ గడ్డ లేదా సాధారణ గడ్డను చూడటం అన్నది చాలా త్వరితంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఒక స్పష్టమైన మార్గం’ అంటూ కితాబిస్తూ... సాంకేతిక రంగంలో ఇదో మైలురాయి, అద్భుతమైన పురోగతి అంటూ పేర్కొంది.
 
 3డి డిజిటల్ మామోగ్రఫీతో ప్రయోజనాలివి...


 ఒక మందపాటి ఆకును అడ్డుగా కోశామనుకోండి. అప్పుడు దాని తొడిమ దగ్గర ఉన్న అడ్డుకోత చిత్రానికీ, మధ్య భాగం అడ్డుకోత చిత్రానికీ, అంచున ఉండే అడ్డుకోత చిత్రానికీ తేడా ఉంటుంది కదా. అదే తరహాలో రొమ్ము తాలూకు 3-డి చిత్రం కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రతిబింబిస్తుందనుకుందాం. అక్కడ గడ్డ మొదలైన చోట ఎలా ఉంది, మరో మూడు నాలుగు మిల్లీ మీటర్ల ఆవల ఎలా ఉంది, మరో ఆరేడు మిల్లీమీటర్ల అవతల ఎలా ఉంది అన్నది బయటి నుంచి చూస్తే తెలియదు. రొమ్మును అలా ప్రతి మిల్లీ మీటరుకు ఒకసారి కోసి చూడలేం. కానీ ఈ 3డి డిజిటల్ మామోగ్రఫీ (టోమోసింథసిస్) ప్రక్రియలో రొమ్ము లోపలి  గడ్డను చూడదలచుకుంటే... రొమ్మును ఒక మూతలాగా తొలగించి, ఆ గడ్డను పై నుంచి ఎంత స్పష్టంగా చూడటానికి వీలవుతుందో ... అలాగే, ప్రతి మిల్లీమీటరు లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ గడ్డ స్వరూపం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి వీలైనన్ని సూక్ష్మ భాగాలుగా చూడటానికి వీలవుతుందన్నమాట. మనం ఈ గడ్డ ప్రతిబింబాన్ని 3డి లో చూస్తున్న సమయంలోనే ఒకవేళ మనకు 2డి చిత్రం కావాలనుకున్నా... అప్పటికప్పుడు అదే సమయంలో దాన్ని తీసుకోవచ్చు.
 
 సాధారణ మామోగ్రఫీలో కణితి లేదా గడ్డ తాలూకు చిత్రాన్ని చూడటానికి కాస్తంత వ్యవధి పడుతుంది. అదే 2-డి మామోగ్రఫీలోనైతే అదే ప్రతిబింబాన్ని  కంప్యూటర్ స్క్రీన్‌పై చూపించాలంటే ప్రత్యేకంగా ఒక డిజిటల్ కెమెరా కావాలి. కానీ... 3డి డిజిటల్ మామోగ్రఫీలో మాత్రం ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా కంప్యూటర్ స్క్రీన్‌పై వచ్చిన చిత్రాన్ని తక్షణం చూడవచ్చు.
 
 డాక్టర్ సిహెచ్.మోహనవంశీ
 చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
 ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
 ఫోన్: 9848011421

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement