ఇంద్రనీలాద్రిపై గుజరాతీ మేఘమాల | indraneeladri meghana interivew | Sakshi
Sakshi News home page

ఇంద్రనీలాద్రిపై గుజరాతీ మేఘమాల

Published Tue, Sep 10 2013 11:53 PM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

ఇంద్రనీలాద్రిపై గుజరాతీ మేఘమాల

ఇంద్రనీలాద్రిపై గుజరాతీ మేఘమాల

గలగలా మాట్లాడటం మేఘన నైజం.
 వింటూ ఉండటం ఇంద్రనీల్‌కి ఇష్టం.
 స్టార్ కావాలని టీవీలోకి వచ్చారు మేఘన.
 ఇష్టం లేకుండానే టీవీ స్టార్ అయ్యారు ఇంద్రనీల్.
 విజాతి ధ్రువాలు ఎట్రాక్ట్ అవుతాయంటారు కదా...
 అలా... అభిరుచులు, అభిప్రాయాలు వేరైనా
 ఇద్దరూ దగ్గరయ్యారు.
 పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
 వీరి దాంపత్యంలోని కొన్ని ఎపిసోడ్‌లే...
 ఈవారం ‘మనసే జతగా!’
 
 ఇంద్రనీల్, మేఘనల ఇంటి గడపలో అడుగుపెడితే అపార్ట్‌మెంట్‌లో కూడా పొదరిల్లు ఉంటుందా... అనుకోకుండా ఉండలేం. ‘‘మేం ఎక్కడికి వెళ్లినా ఇంటికి నప్పేవి తెచ్చుకుని ఇలా అలంకరించుకుంటాం. ఇల్లంటే ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండి, మనసులను రంజింపజేయాలి. ఇంటికి కావలసిన ప్రతి వస్తువూ మా కష్టార్జితంతోనే కొనుక్కున్నాం!’’ అని వారు చెబుతుంటే కలిసికట్టుగా పంచుకునే ఆనందం తాలూకు గర్వం వారి కళ్లలో తొణికిసలాడింది.
 
 మేఘన గుజరాతీ అమ్మాయి. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. చెల్లెలు, తను, అమ్మ, నాన్న ఇదే ఆమె ప్రపంచం. ఇంద్రనీల్ విజయవాడలో పుట్టి పెరిగి, తండ్రి ఇష్టంమేరకు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమ్ముడు, చెల్లెలు, అమ్మ, నాన్న... వీరితో పాటు డ్యాన్స్, మ్యూజిక్ అంటే ప్రాణం. డిగ్రీ వరకు చదివిన ఈ ఇద్దరినీ కలిపింది బుల్లితెరే! యూక్టింగ్‌లోకి రాకవుుందు ఇంద్రనీల్ పేరు రాజేష్, మేఘన పేరు అనుపవు. సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి పేర్లు మార్చుకున్నా మని చెప్పారిద్దరూ!
 తొలి పరిచయం
 తవు ఇద్దరి పరిచయుం గురించి ఇంద్రనీల్ చెబుతూ- ‘‘కాలచక్రం సీరియల్‌లో నటిస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్‌లో ఒకమ్మాయిని చూసి, ‘బొద్దుగా బొమ్మలా ఉందే’ అనుకున్నాను. అదే సవుయుంలో ఇలాంటి అవ్మూరుుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా అనుకున్నాను. కాని ఈ అమ్మాయే నాకు అమ్మలా నటించడానికి వచ్చిందని తెలిసి ఆశ్చర్య పోయాను. సీరియల్స్‌లో కలిసి నటించేవాళ్లం. కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్లం. కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. నాలుగేళ్లు స్నేహితులుగానే ఉన్నాం. ఓసారి నేను ‘యూక్టింగ్ నాకు ఇష్టం లేదు. నాన్న బలవంతం మీద వచ్చాను. ఊరెళ్లిపోతాను’ అని చెప్పినప్పుడు మేఘన నన్ను ఫ్రెండ్‌లా గైడ్ చేసింది. ఆమె గెడైన్స్‌లో తర్వాత నటనే వృత్తిగా వూరింది. కొన్నిరోజుల తరవాత మా మధ్య స్నేహానికి మించి ఏదో ఉందని అర్థమైంది...’’ అన్నారు.
 
 ఇంద్రనీల్ మాటలను మేఘన కొనసాగిస్తూ - ‘‘ఈయన మొదటిసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నామీద సింపతీ చూపిస్తున్నట్టు అనిపించింది. అందుకే వద్దనడమే కాకుండా పెద్ద లెక్చర్ ఇచ్చేశాను. ఒకసారి నాన్న ఆరోగ్యరీత్యా అందరూ చెన్నైలో, నేను ఇక్కడ ఆరునెలలపాటు ఇంట్లో ఒక్కదాన్నే ఉండవలసి వచ్చింది. అప్పుడు ఈయన నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. నా పైన చూపే కన్‌సర్న్ నన్ను ఆలోచింపజేసింది. తీరా నేను ప్రపోజ్ చేస్తే ‘ఫ్రెండ్స్‌గా ఉండిపోదాం’ అన్నాడు. కాని చివరకు తనే వాళ్ల తల్లిదండ్రులను ఒప్పించడానికి కష్టపడ్డాడు. ఒక సమయంలో అరుుతే ఈ పెళ్లి జరగదేమోనన్న అనుమానంతో పేరెంట్స్‌ను భయుపెట్టడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగేశానన్నాడు! అదంతా యాక్టింగే అని తర్వాత తెలిసి ‘హమ్మయ్య’ అనుకున్నాను’’ అని చెప్పారు.
 
 మలుచుకున్న దాంపత్యం
 సీరియల్స్‌లో ఇంద్రనీల్‌కి అత్తగా, అమ్మగా నటించేవారు మేఘన. ‘‘పెళ్లైన కొత్తలో కలిసి బయుటకు వెళితే దారినపోయేవారు ‘మీ అబ్బాయా?’ అని అడుగుతుండేవారు. ఎంత ఇబ్బంది పడేదాన్నో! ఇప్పటికీ ఎవరైనా అడుగుతున్నా పట్టించుకోను. నిజానికి నేను ఈయనకన్నా ఆరునెలలు పెద్ద’’ అన్నారు మేఘన. ‘‘మా పెళ్లప్పుడు మా నాన్నగారు మేఘనతో ‘వాడికేమీ తెలియదు. నీ చేతిలో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోవ్మూ!’ అని చెప్పారు. మేఘన బాధ్యత గల అవ్మూయని నాన్నగారు అప్పుడే కనిపెట్టేశారన్నవూట. నేనీ రోజు ఇలా ఉన్నానంటే అది మేఘన వల్లే.
 
 అందుకే ఉదయం లేస్తూనే ఈవిడకు ‘గుడ్మార్నింగ్ టీచర్’ అని చెబుతుంటాను’’ అని నవ్వేశారు ఇంద్రనీల్! మేఘన తమ దాంపత్యాన్ని మార్చుకున్న విధానం గురించి చెబుతూ -‘‘పెళ్లయ్యాక మొదటి ఆరునెలలు మా మధ్య చాలా గొడవలు వచ్చేవి. అప్పట్లో ఇద్దరం వర్క్ చేసేవాళ్లం. ఇద్దరికీ డబ్బు వచ్చేది. ఇంటి ఖర్చులకు ‘నీ డబ్బు, నా డబ్బు’ అనే తేడాలు వచ్చేవి. ఒక దశలో నేనే రియలైజ్ అయ్యి, నా పద్ధతులు మార్చుకున్నాను. తర్వాత ఈయున్ని వూర్చుకున్నాను. ఇప్పుడు మా పెళ్లై ఎనిమిదేళ్లయింది(26 మే, 2005). అంతకుముందు మేం స్నేహంగా ఉన్నది నాలుగేళ్లు. ఇన్నేళ్లు సంతోషంగా ఉన్నామనే ఆలోచనే బలాన్నిస్తుంటుంది’’ అన్నారు.
 
 ‘నీ, నా’ నుంచి ‘వున’ వరకు...
 అంతా సాఫీగా సాగినా వునసులు కలవడానికి సవుయుం పడుతుందేమో! అందుకే కలిసి పంచుకోవడానికి చిటికెడు కష్టాలు దాంపత్యబంధంలో కలుపుతుంటాడు దేవుడు -‘‘మేం పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను మా అమ్మ వుుందుంచినప్పుడు ‘ఉద్యోగస్తుడిని చేసుకుంటే బాగుండేది. ‘చక్రవాకం’ సీరియుల్ తర్వాత మీ పరిస్థితి ఏంటి?’ అంది. సంపాదిస్తున్నాం కదా అనే ధైర్యం ఉండేది ఇద్దరికీ! పెళ్లయిన ఆరునెలల తర్వాత ఓ రోజు మాకు సీరియల్‌లో కంటిన్యూ అయ్యే అవకాశం లేదని  తెలిసింది. ఏడాదిపాటు చేతిలో పని లేదు. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఈయన చెన్నైలో కొన్ని సీరియల్స్‌లో యాక్ట్ చేయడంతో సంసారం గాడిలో పడింది. తర్వాత ‘మొగలిరేకులు’ ఆఫర్ వచ్చింది. ఓ రోజు ఫోన్ చేసి ‘నేను వర్క్ మానేసి ఇంటికి వచ్చేస్తే రేపు మన పరిస్థితి ఏంటి?’ అని అడిగాడు. ‘ఏం పర్వాలేదు ఎలాగోలా బతికేద్దాం’ అన్నాను’’ అంటూ తవు ఆర్థికస్థితి కన్నా భర్త వూనసిక స్థితే వుుఖ్యంగా భావించానని పరోక్షంగా చెప్పారు మేఘన.
 ‘‘వచ్చిన సీరియుల్స్‌లో యూక్ట్ చేస్తున్నాం. వూ డ్యాన్స్ అకాడెమీ పనులు చూసుకుంటున్నాం. మేమిద్దరం కలిసి ఎప్పటికైనా స్టేజ్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వాలని ఉంది’’ అని తెలిపారు ఇంద్రనీల్!    
 ఒకరికొకరుగా...
 ‘‘వునిషి జీవితంలో భార్యాభర్తల అనుబంధం సుదీర్ఘమైనది. జీవన ప్రయాణంలో తల్లిదండ్రులు, పిల్లల కంటే ఎక్కువ ఏళ్లు జీవితభాగస్వామితోనే గడుపుతాం. కష్టసుఖాలలో కలిసిమెలిసి ఉండేది దంపతులు మాత్రమే! అందుకే ఇద్దరి మధ్య బంధం పటిష్టంగా చేసుకోవడానికి ఇరువురూ ఎల్లకాలమూ ప్రయత్నించాలి ’’ అని చెప్పింది ఈ జంట.
 ఇద్దరి మాటల్లోనూ భాగస్వామి మనసు నొచ్చుకునే ఏ సందర్భమైనా సానుకూలంగా స్పందించడం, సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలనే తపన కనిపించింది.
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 మా పెళ్లయ్యాక నా మొదటి పుట్టినరోజున మేఘన నాకో పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. షామిర్‌పేట దగ్గర రిసార్ట్‌లో రూమ్ బుక్ చేసి, అందంగా అలంకరించి నాతో మాట మాత్రం చెప్పకుండా ఎటో వెళ్లాలని తీసుకెళ్లింది. ఆ సెటప్ చూసి చాలా థ్రిల్ అయ్యూను.
 - ఇంద్రనీల్
 పెళ్లయిన మొదటి ఏడాది ప్రతి నెలా వూ వ్యూరేజ్ డేట్‌ని సెలబ్రేట్ చేసేవారు. ఒక
 సంవత్సరం ఫిబ్రవరి 14న నేను ఊరు నుంచి వచ్చేసరికి ఇల్లంతా అలంకరించి, దిండు కింద నాకు నచ్చిన రంగు కొత్త చీర, జాకెట్టు, చెవికమ్మలు పెట్టి సర్‌ప్రైజ్ చేశారు.
 - మేఘన
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement