తొంభై ఏళ్ల వయసు.. తొమ్మిదేళ్ల మనసు | inter net in this week | Sakshi
Sakshi News home page

తొంభై ఏళ్ల వయసు.. తొమ్మిదేళ్ల మనసు

Published Tue, Dec 29 2015 10:47 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

తొంభై ఏళ్ల వయసు.. తొమ్మిదేళ్ల మనసు - Sakshi

తొంభై ఏళ్ల వయసు.. తొమ్మిదేళ్ల మనసు

ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద అన్న పాట కచ్చితంగా గుర్తొస్తుంది ఈ తొంభై ఏళ్ల అవ్వని చూస్తే. మనం చెప్పిందే మనకు వేదం, మనకు తోచిందే చేసి చూద్దాం అనుకుంది ఈ అవ్వ. ‘ఉన్న కొన్నాళ్లూ గుండె నిండా సరదా పండించనీ’ అని నిర్ణయించేసుకుంది ఈ అవ్వ. అందుకే ఎవరేమనుకుంటారో అనుకోకుండా పార్కులో ఉయ్యాల ఎక్కి ఊగేస్తోంది సరదా సరదాగా. తమాషా ఏమిటంటే తలపై ముసుగు మాత్రం తీయకుండా పాత పద్ధతుల్ని గౌరవిస్తూనే పార్కులో ఎంజాయ్ చేస్తోంది ఈ అవ్వ. అవ్వ ఉయ్యాల సరదాని ఎవరో వీడియో తీసి యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో పెడితే ఏకంగా 8.79లక్షల మంది చూసి షేర్ చేశారు. అవ్వ స్పిరిట్‌ను ప్రశంసిస్తూ కామెంట్ల వాన కురిపించారు. అవ్వ ఎవరో, ఎక్కడిదో తెలియదు కానీ, చత్వారం కళ్ల జోడు రాగానే ప్రపంచ భారం మోస్తున్న పోజులిచ్చే యువ ముసలోళ్లకు ఉమర్ పచ్ పన్ అయినా, దిల్ బచ్ పన్ (బాల్యం) లో ఉండేలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉందని గొప్ప పాఠాన్ని మాత్రం చెబుతోంది. హాట్సాఫ్ అవ్వా! ఇంకెన్నో కొత్త సంవత్సరాలు నీ ఖాతాలో పడాలి. ఉత్సాహం ఇలాగే ఊయలలూగుతూనే ఉండాలి.
 http://www.buzzfeed.com/imaansheikh/daadi-cool#.nb27EY4PV

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement