ఫ్యామిలీ డాక్టర్
నా వయసు 30 ఏళ్లు. నా వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సంతానం కలగలేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. అంటే ఏమిటి? దీనికి కారణాలు ఏమిటి? హోమియోలో పరిష్కారం ఉందా? - ఒక సోదరి, హైదరాబాద్
ఇటీవల చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ లోపాలు మహిళలలోనూ, పురుషుడిలోనూ లేదా ఇద్దరిలోనూ ఉండవచ్చు.
సాధారణ కారణాలు
మహిళల్లో కనిపించేవి : జన్యుసంబంధిత లోపాలు
హార్మోన్ లోపాలు థైరాయిడ్ సమస్య
అండాశయంలో లోపాలు, నీటి బుడగలు
గర్భాశయ సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్స్‌కు సంబంధించిన సమస్యలు డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం.
పురుషుల్లో కనిపించేవి: హార్మోన్ సంబంధిత సమస్యలు థైరాయిడ్ సమస్య పొగతాగే అలవాటు
శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం
సంతాన లేమిలో రకాలు
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ
దంపతుల్లో అసలు సంతానమే కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ముఖ్యంగా జన్యు సంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఇది ఏర్పడుతుంది.
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ
మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావడం దీనికి కారణం.
గుర్తించడం ఎలా
సమస్యను బట్టి తగిన పరీక్షలు చేసి సంతానలేమిని గుర్తిస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటివి చేస్తారు.
హోమియో చికిత్స
కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, సమస్య తీవ్రతను తగ్గిస్తూ క్రమక్రమంగా చక్కదిద్దుతూ... అలా పూర్తిగా తగ్గించడం హోమియో చికిత్సలో జరుగుతుంది. ఇన్‌ఫెర్టిలిటీ సమస్యను హోమియో ద్వారా పూర్తిగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్