ఆశ్వయుజ శుద్ధ చవితి, శనివారం 13–10–2018
శ్రీలలితా త్రిపురసుందరీదేవి
ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణి కుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వ ఫాల దేశమ్ ‘‘
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మశ్రీలలితాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ చెరకుగడను చేతపట్టుకొని శివుని వ„ý స్థలంపై కూర్చొని లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తులు చేసే పూజలను అందుకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment