హాయ్ అన్నయ్యా! నేను బీటెక్‌లో ఉన్నప్పటి నుంచి తను నన్ను అన్నయ్యా అని పిలుస్తోంది. నేను కూడా తనని చెల్లెల్లానే చూసుకునేవాడిని! తనకి జాబ్ హైదరాబాద్‌లో వచ్చింది! నేను కూడా హైదరాబాద్‌లో ఉండే ప్రిపేర్ అవుతుండటంతో తన మంచిచెడులన్నీ నేనే చూసుకునేవాడిని. దాంతో కొంచెం క్లోజ్ అయ్యాం. రోజూ గంటలు గంటలు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. తను కూడా అదే అంటోంది. ఈ మధ్య తనకి సంబంధాలు చూస్తున్నారు. దాంతో నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. మా మధ్యలోకి థర్డ్ పర్సన్ వస్తున్నాడనేనా? ఎందుకో తెలియదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. కానీ ఎప్పటికైనా అదే కదా జరిగేది! నేను కంప్లీట్‌గా మారిపోయి నా వర్క్ ఏంటో నేను చూసుకోవాలి. నాకు సలహా ఇవ్వండి సార్ ప్లీజ్!? - నాగరాజ్
‘నీలాంబరి అక్కా.. ఇదే మనకు బెస్ట్ ఛాన్స్..!’ ‘‘దేనికి బెస్ట్ ఛాన్స్ అరటిపండూ..?’’ ‘ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇస్తే... మీసాలోడు బుట్టలో పడ్డట్టే... నీలాంబరి అక్కా!’ ‘‘బుట్టలో అంటే? నా బుట్టలోనా? నీ బుట్టలోనా!?! అరటిపండూ..?’’ ‘ఈ తొక్క క్వశ్చన్ మీద కాలు పడితే డైరెక్ట్‌గా చెత్త బుట్టే అక్కా!’ ‘‘ఆ తరువాత నేనే లవ్ డాక్టరా?.. పండూ?’’ ‘చెలరేగిపో అక్కా.. అదిగో వస్తున్నాడు. ఎలాగయినా ఆన్సర్ ఇప్పించు!’ ‘‘సార్ మీ ఆన్సర్ కోసం నాగరాజు వెయిటింగ్!’’ స్నేహాన్ని లవ్ అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని సమాజాన్ని గౌరవిస్తే వెధవ ఆలోచనలు రావు! ముందు మాటలు తగ్గించండి. చేసే పనిమీద ఫోకస్ పెట్టండి. అనవసరమైన ఆలోచనలతో మనసు ఇంకా అసహ్యంగా తయారు చేసుకోవద్దు. జీవితంలో చాలా వదిలేసుకోవాల్సొస్తుంది. దాంట్లో ఇది చాలా చిన్న విషయం నాగరాజ్! ఐ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యు. శహబాష్!! ‘‘సార్......’’ ఏమైంది నీలాంబరీ! కళ్లు తిరిగి పడిపోయావా? అరే అదేంటి? అరటిపండు చెత్త బుట్టలో పడిపోయింది...!?
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment