డీహైడ్రేషన్‌తో చాలా సమస్యలు..
కొత్త పరిశోధన
డీహైడ్రేషన్‌ను అంత తేలికగా తీసుకోరాదని, నిజానికి అదే పెద్ద సమస్య అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల నోటి దుర్వాసన, చర్మం పొడిబారటం, మలబద్ధకం వంటి సమస్యలే కాకుండా, అలాంటి పరిస్థితిలో డ్రైవింగ్ చేసినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల వ్యాయామం చేసేటప్పుడు త్వరగా అలసట ముంచుకొస్తుందని...
శరీరంలో కేవలం రెండు శాతం నీరు లోపిస్తే, శారీరక శ్రమతో కూడిన పనుల్లో పదిశాతం మేరకు పనితీరు తగ్గుతుందని వివరిస్తున్నారు. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు రక్తపోటు పడిపోవడంతో పాటు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని, కండరాల్లో నీరు తగ్గిపోవడం వల్ల కాస్త శ్రమని కూడా శరీరం తట్టుకోలేని స్థితి ఏర్పడుతుందని లాస్ ఏంజెలిస్‌లోని కెర్లాన్-జోబ్ ఆర్థొపెడిక్ క్లినిక్‌కు చెందిన క్రీడా వైద్య నిపుణుడు లుగా పొడేస్టా వివరిస్తున్నారు.