కండల బ్రదర్స్! | Muzzle Brothers! | Sakshi
Sakshi News home page

కండల బ్రదర్స్!

Published Wed, Oct 1 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

కండల బ్రదర్స్!

కండల బ్రదర్స్!

సమ్‌థింగ్
 
కుంబ్రియ (ఇంగ్లాండ్)కు చెందిన లెవీస్ హ్యారిసన్, ఒవెన్ హ్యారిసన్‌లు కవలసోదరులు. వారి పోలికలే కాదు... అభిరుచులు కూడా సేమ్ టు సేమ్. స్కూల్లో చదివే రోజుల్లో ఫుట్‌బాల్ ఆడడం అంటే ఇద్దరికీ తెగ ఇష్టం. చిన్నప్పుడు వాళ్లు సన్నగా ఉండేవారు. అడపాదడపా వెక్కిరింతలకు కూడా గురయ్యేవారు. సినిమాలో కండల వీరులను చూసినప్పుడల్లా ‘‘అలా మేము కూడా ఉండే బాగుండేది’’ అనుకునేవారు.

‘‘అది మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే అలా తయారవ్వడం పెద్ద విషయమేమీ కాదు’’ అని వాళ్ల నాన్న ఒకరోజు చెప్పాడు. అలా పదిహేను సంవత్సరాల ప్రాయంలో... ఈ ఇద్దరు సోదరులు బాడీబిల్డింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇద్దరు కలిసి ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేవారు. ఇద్దరు కలిసి ఫిట్‌నెస్ మ్యాగజైన్‌లు తెగ చదివేవారు.
 
రెండు సంవత్సరాలు గడిచేసరికి... సోదరులిద్దరూ శారీరక దారుఢ్యంతో ‘వావ్’ అనిపించేలా తయారయ్యారు. పీలగా ఉండే యువకులకు ఈ సోదరురులు ఇప్పుడు రోల్‌మోడల్‌లు!  ఇరవై మూడు సంవత్సరాల ఈ సోదరులు తమ దగ్గరకు వచ్చే యువకులుకు కేవలం తమ కండల గొప్పదనం గురించి మాత్రమే కాకుండా... ఏది తినాలి, ఏది తినకూడదు, వ్యామాయాలు ఎలా చేయాలి... మొదలైన మంచి విషయాలు కూడా చెబుతున్నారు. మంచిదే కదా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement