
నర్సరీకి నాలుగడుగులు వెయ్యండి
పరి పరిశోధన
పచ్చగా పది కాలాలు బతకాలంటే పచ్చటి పరిసరాలలో గడుపుతూ ఉంటే చాలట! పాత మాటలాగే అనిపిస్తున్న కొత్త స్టడీ ఇది. అయితే ఈ మహద్భాగ్యం మహిళలకు మాత్రమేన ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సెన్సైస్ (ఎన్.ఐ.ఇ.హెచ్.ఎస్) అంటోంది. ఈ సంస్థ అమెరికాలో ఉంది.
వీళ్ల పరిశోధనలో తేలినదేమిటంటే.. ఇంటి చుట్టూ పూలమొక్కలు, కూరగాయల మొక్కలు, చెట్లు చేమలు ఉన్న మహిళ ల్లో.. ఇవేవీ లేని పరిసరాలలో ఉంటున్న మహిళలతో పోల్చిచూస్తే మరణాల రేటు 12 శాతం తక్కువగా ఉంటుందట. ఈ వ్యత్యాసం ముఖ్యంగా మూత్రపిండాలు, శ్వాసకోశాలు, క్యాన్సర్‌లకు సంబంధించిన అనారోగ్యాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు స్పష్టంగా కనిపించిందని ఈ అధ్యయన సంస్థ డెరైక్టర్ లిండా బిర్న్‌మామ్ చెబుతున్నారు. మరి మగవాళ్ల మాటేమిటి? పచ్చదనం ప్రభావితం చేయనంత శక్తిమంతంగా ఉంటాయి కదా సాధారణంగా మగవాళ్ల అలవాట్లు. అందుకే మన పరిశోధనా బృందం.. జెంట్స్ జోలికి వెళ్లినట్టు లేదు.