నవంబర్ 1న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On November 1 birthday Celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 1న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Mon, Nov 16 2015 10:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM

నవంబర్  1న  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 1న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు   రోజా (నటి), కీర్తి రెడ్డి (నటి)
 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంఖ్య కాబట్టి జన్మతః నాయకత్వ లక్షణాలు, కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మీకున్న ఉద్యోగ, వ్యాపార సంబంధాల ద్వారా మంచి ఆదాయం చేకూరుతుంది. అయితే సహజసిద్ధంగా ఉండే జంకును, భ యాన్ని విడిచిపెట్టి, ఆత్మవిశ్వాసాన్ని అలవరచుకోవడం వల్ల బాగా రాణిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వీరి పుట్టిన తేదీ 17. ఇది వృత్తికారకుడయిన శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తితోపాటు వ్యాపారాలు చేయాలనుకునే వారు వారి అభీష్టానుసారం కొత్తవ్యాపారాలు చే యడం లేదా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, కోపం మూలంగా బీపీ, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండి వైద్యసలహాలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 3, 5,6,9; లక్కీ కలర్స్: రెడ్, ఆరంజ్, బ్లూ, ఎల్లో. లక్కీడేస్: ఆది, మంగళ, శనివారాలు. సూచనలు: ఆస్తులు అమ్మే ఆలోచన విరమించుకోవడం మంచిది. వికలాంగులకు అన్నదానం, మూగ, చెవిటి వారికి తగిన సాయం చేయడం, రక్తదానం చేయడం లేదా చేయడాన్ని ప్రోత్సహించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement