ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు పుట్టిన తేదీ 13. ఇది కూడా రాహు సంఖ్యే. చాల మంది 13 మంచిది కాదనుకుంటారు కాని, 13 సూర్య, గురుల కలయికతో ఏర్పడటం వల్ల రాజయోగాన్నిస్తుంది. అయితే ఈ యోగం జీవితం ప్రథమార్ధంలో కొంత కష్టాలను ఇచ్చి 35 సంవత్సరాల తరవాత నుంచి మంచి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, స్థిర ఆస్తులు ఇస్తుంది. అంతేకాదు, రాహుగ్రహ అనుకూల ప్రభావం వల్ల టెక్నికల్ రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కొత్త బంధాలు ఏర్పడి, వాటిని లాభదాయకంగా మార్చుకోగలుగుతారు.
కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి, అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు. అయితే, ప్రేమ వ్యవహారాలు అనుకూలించకపోవచ్చు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. మితిమీరిన క్రమశిక్షణ పాటించడం వల్ల తోటి ఉద్యోగుల అసహనానికి, విమర్శలకు గురవుతారు. లక్కీ నంబర్స్: 1, 4,5,6; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
అక్టోబర్ 13 న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
Published Mon, Oct 12 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement
Advertisement