Technical sector
-
నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
హసన్ పర్తి: సాంకేతిక రంగంలో నూతన మార్పులు వస్తున్నాయని.. వీటిని విద్యార్థినులు అందిపుచ్చుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సూచించారు. విద్యాసంస్థలు-పరిశ్రమల నడుమ అంతరాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్‌లో రాణించడం సులువవుతుందని ఆమె అన్నారు. వరంగల్ నగర శివారు అన్నాసాగరంలోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో డీఎస్టీ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్ ్స అండ్ టెక్నాలజీ) ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన ఉమెన్ ్స టెక్నాలజీ పార్క్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సాంకేతిక విద్యపై ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ చూపకపోవడంతో పదిహేనేళ్లుగా అదే సిలబస్ కొనసాగుతోందన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఫైనలియర్‌కు వచ్చాక ఉద్యోగాల కోసం ప్రయత్నించడం కంటే.. ఫస్టియర్ నుంచే భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటే ఫలితముంటుందని కవిత తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలకు పార్క్‌లో వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్పిస్తారని, ఇందుకు కావాల్సిన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కవిత తెలిపారు. తెలంగాణ విమోచనకు ఎందరో పోరాడి ప్రాణాలర్పించారని, వారందరికీ నివాళులర్పిస్తున్నానని ఎంపీ కవిత తెలిపారు. నిజామాబాద్‌కు అన్యాయం చేసిన సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్క్ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజామాబాద్‌కు అన్యాయం చేశారని ఎంపీ కవిత పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్క్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని తాను సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తే.. ఆయన సున్నితంగా తిరస్కరించి.. వరంగల్‌లో ఏర్పాటు చేస్తే మంచిదని సమాధానం చెప్పారన్నారు. అరుుతే, ఎక్కడ నిర్మించినా తెలంగాణ అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కవిత అన్నారు. కేంద్రమంత్రిగా కవితకు అన్ని అర్హతలు.. కేంద్రమంత్రి పదవి చేపట్టే అన్ని అర్హతలు కవితకు ఉన్నాయని, ఆమె ఆ బాధ్యతలు స్వీకరించాలని అందరం ఎదురుచూస్తున్నామని ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. -
డిసెంబర్ 3న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు జిమ్మీ షేర్గిల్ (నటుడు), సారా జేన్ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు టెక్నికల్ రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. అయితే, ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ప్రమోషన్లు వస్తాయి. రాజకీయ నాయకులకు పదవులు వరిస్తాయి. ఈ రోజు పుట్టిన తేదీ 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు జన్మతః మంచి తెలివితేటలు, మధురంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. మీడియా రంగంలోని వారికి అనుకూలిస్తుంది. అయితే గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం అంత అనుకూలించకపోవచ్చు కాబట్టి నిరాశపడకుండా ఉండటం లేదా వచ్చే సంవత్సరం ప్రయత్నించడం మంచిది. లక్కీ నంబర్స్: 1, 4,5,6,; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను గౌరవించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
అక్టోబర్ 13 న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు పుట్టిన తేదీ 13. ఇది కూడా రాహు సంఖ్యే. చాల మంది 13 మంచిది కాదనుకుంటారు కాని, 13 సూర్య, గురుల కలయికతో ఏర్పడటం వల్ల రాజయోగాన్నిస్తుంది. అయితే ఈ యోగం జీవితం ప్రథమార్ధంలో కొంత కష్టాలను ఇచ్చి 35 సంవత్సరాల తరవాత నుంచి మంచి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, స్థిర ఆస్తులు ఇస్తుంది. అంతేకాదు, రాహుగ్రహ అనుకూల ప్రభావం వల్ల టెక్నికల్ రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కొత్త బంధాలు ఏర్పడి, వాటిని లాభదాయకంగా మార్చుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి, అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు. అయితే, ప్రేమ వ్యవహారాలు అనుకూలించకపోవచ్చు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. మితిమీరిన క్రమశిక్షణ పాటించడం వల్ల తోటి ఉద్యోగుల అసహనానికి, విమర్శలకు గురవుతారు. లక్కీ నంబర్స్: 1, 4,5,6; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
సాంకేతిక రంగంలో ఉజ్వల భవిష్యత్తు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సాంకేతిక రంగంలో రాణిస్తున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఈ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని వాటికి అనుగుణంగా రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలో ఉన్న బిట్స్ పిలానీలో ‘అట్మాస్-13’ టెక్నోఫెస్ట్ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో ఇతర దేశాలకు భారత్ మార్గదర్శిగా ఉందన్నారు. బిట్స్ విద్యార్థులు పరిశ్రమలు నెలకొల్పేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉప రాష్ట్రపతి భేటీని సైతం వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి హాజరైనట్టు జైపాల్ రెడ్డి చెప్పారు. అనంతరం బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు మంత్రిని ఘనంగా సత్కరించారు.