సాంకేతిక రంగంలో ఉజ్వల భవిష్యత్తు
హైదరాబాద్, న్యూస్‌లైన్: సాంకేతిక రంగంలో రాణిస్తున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఈ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని వాటికి అనుగుణంగా రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలో ఉన్న బిట్స్ పిలానీలో ‘అట్మాస్-13’ టెక్నోఫెస్ట్‌ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో ఇతర దేశాలకు భారత్ మార్గదర్శిగా ఉందన్నారు. బిట్స్ విద్యార్థులు పరిశ్రమలు నెలకొల్పేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉప రాష్ట్రపతి భేటీని సైతం వాయిదా వేసుకుని ఈ కార్యక్రమానికి హాజరైనట్టు జైపాల్ రెడ్డి చెప్పారు. అనంతరం బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు మంత్రిని ఘనంగా సత్కరించారు.