అటుకుల పాయసం
క్విక్ ఫుడ్
కావలసినవి : మీగడ పాలు – ఒక లీటరు; అటుకులు – 100 గ్రా; పంచదార – 1/4 కిలో; ఏలకులు – 4 (పొడి చేయాలి); జీడిపప్పు – 4 టేబుల్ స్పూన్లు; కిస్‌మిస్ – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
తయారి :
► ముందుగా అటుకుల్ని కడిగి నీళ్లు లేకుండా పిండి పది నిమిషాల సేపు ఆరబెట్టాలి.
► మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి.
► అందులో అటుకులు వేసి తక్కువ మంట మీద కాసేపు ఉడకనివ్వాలి.
► తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి పాలు సగమయ్యే వరకు ఉడికించి దించాలి.
► బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి పాయసంలో కలపాలి.
► దీనిని వేడిగా తినవచ్చు, చల్లగా కూడా బావుంటుంది.