Pudding
-
చిటికెలో హెల్దీగా..చియా కర్డ్ పుడ్డింగ్
చియా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అందులో ఒకటి చియా కర్డ్ పుడ్డింగ్. ఇందులో పెరుగు, క్యారెట్, కీరా లాంటి కూరగాయలు జోడించడం వల్ల రుచికీ రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. చియా కర్డ్పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలికావలసినవి: చియా సీడ్స్ (నల్ల గసగసాలు) – 4 టేబుల్ స్పూన్లు (రెండు గంటల సేపు నానబెట్టాలి); క్యారట్ తురుము-పావు కప్పు; బీట్ రూట్ తురుము-పావుకప్పు, కీరకాయ తురుము-పావుకప్పు. పెరుగు – కప్పు; పచ్చిమిర్చి – 2 (నిలువుగా తరగాలి); దానిమ్మగింజలు -పావుకప్పు ఉప్పు రుచిని బట్టి; ఇంగువ – చిటికెడు; తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూన్;పోపు కోసం...: నెయ్యి– టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు – 2 రెమ్మలు; పచ్చి శనగపప్పు – గుప్పెడు; వేరుశనగపప్పు – గుప్పెడు.తయారీ: ఒక పాత్రలో నానబెట్టిన చియా సీడ్స్, పెరుగు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారట్ , బీట్రూట్, కీరకాయ తురుము వేసి బాగా కలపాలి. ∙ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి అందులోఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేయించి కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర చల్లి వడ్డించాలి. పోషకాలు: మ్యాక్రో న్యూట్రియెంట్స్: కేలరీలు – 230; ప్రొటీన్ – 8 గ్రాములు;కార్బోహైడ్రేట్లు – 20 గ్రాములు;ఫైబర్– 7 గ్రాములు;చక్కెర – 6 గ్రాములు;ఫ్యాట్ – 12 గ్రాములు;సాచ్యురేటెడ్ ఫ్యాట్ – 3 గ్రాములు;మైక్రో న్యూట్రియెంట్స్: క్యాల్షియమ్– 280 మిల్లీగ్రాములు;ఐరన్– 2.5 మిల్లీగ్రాములు;మెగ్నీషియమ్– 90 మిల్లీగ్రాములు; పొటాషియమ్– 450 మిల్లీగ్రాములు;విటమిన్ సి– 8– 1– మిల్లీగ్రాములు;విటమిన్ ఏ – 350 మైక్రోగ్రాములు;ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు – 3–4 గ్రాములు ఇదీచదవండి : అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఅలాగే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ చియా కర్డ్ పుడ్డింగ్. అంతేకాదు సులువుగా చేసుకునే అల్పాహారం. స్ట్రాబెర్రీ, దానిమ్మ, యాపిల్, ఇలా పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే మరింత ఆరోగ్యకరమైంది కూడా. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ పుడ్డింగ్ చాలాసేపు పొట్టనిండుగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. చదవండి: లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ : శారీ స్నీకర్స్ -
చేదు పాయసం
‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’అని ప్రశ్నించాడు నవాబు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది. దాన్ని మేమెలా తినగలం?’’ అని సమాధానం వచ్చింది. పూర్వకాలంలో సులేమాన్ ఒక నవాబు ఉండేవాడు. అతని దగ్గర రియాజ్ అనే నమ్మకస్తుడైన ఒక పల్లెటూరి యువకుడు సేవకుడుగా ఉన్నాడు. అతడంటే నవాబుకు అంతులేని ప్రేమ, అభిమానం. అంత నమ్మకంగా సేవలందించేవాడు రియాజ్. రాజుగారి కొలువులో ఎంతో తెలివైన, గొప్పగొప్ప మంత్రులు కూడా ఉండేవాళ్లు. వారందరికీ ఈ పల్లెటూరి యువకుడిపై అసూయ కలిగింది. ఎలాగైనా ఇతణ్ణి రాజదర్బారునుండి గెంటించి వేయాలని పథకం పన్నారు. రాజుకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. రాజు వీళ్ల దుర్బుద్ధిని పసిగట్టి, ఏదో ఒకరోజు వీళ్లకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒకరోజు పాయసం వండించాడు. అందులో చక్కెరకు బదులు ఉప్పువేసి, వరుసగా మంత్రులందరికీ వడ్డించారు. అందరూ ఒక్క చెంచా నోట్లో పెట్టుకోగానే ముఖం మాడ్చుకొని ‘యాక్ థూ’ అంటూ ఉమ్మేశారు. కాని పల్లెటూరి యువకుడయిన రియాజ్ మాత్రం లొట్టలేసుకుంటూ సంతోషంగా తినేశాడు. అప్పుడు రాజు వారినుద్దేశించి, ‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’ అని ప్రశ్నించాడు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది. దాన్ని మేమెలా తినగలం?’’ అని సమాధానం వచ్చింది. వెంటనే నవాబు ఆ పల్లెటూరి యువకుణ్ణి ఉద్దేశించి, ‘‘అంత ఉప్పగా, చేదుగా ఉన్న పాయసాన్ని నువ్వు ఎలా తినగలిగావు? నీకు చేదుగా అనిపించలేదా?’’ అని ప్రశ్నించాడు. అందుకు ఆ యువ కుడు.. ‘‘అయ్యా! పాయసం ఉప్పగా, చేదుగా ఉన్నమాట నిజమే. కాని జీవితాంతం తమరు నాకు ఎంతో తియ్యనైన, రుచికరమైన పదార్థాలు పెట్టారు. నేను అడగకుండానే నా సమస్త అవసరాలు తీరుస్తున్నారు.అలాంటిది ఒక్కపూట ఉప్పు ఎక్కువైతే ఏమౌతుంది? ఒక్కపూట కాస్త ఇబ్బంది పడ్డందుకే జీవితాంతం చేసిన మేలును ఎలా మరిచిపోగలను?’‘ అన్నాడు కృతజ్ఞతగా. నిజమే, అల్లాహ్ అనునిత్యం మనపై అసంఖ్యాక అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. అడగకుండానే అన్నీ సమకూరుస్తున్నాడు. కాని కాస్త బాధ కలగగానే మనం అవన్నీ మరచిపోతాం. దేవుడు నాకు ఏంచేశాడు? అనేస్తాం. పుట్టిన దగ్గరి నుండి మరణించే వరకు చేసిన మేళ్లను మరచిపోయి, కాస్తంత కష్టం కలగగానే బాధపడిపోవడం దైవాన్ని నమ్మినవారికి ఉండవలసిన గుణం కాదు. – మదీహా -
అటుకుల పాయసం
క్విక్ ఫుడ్ కావలసినవి : మీగడ పాలు – ఒక లీటరు; అటుకులు – 100 గ్రా; పంచదార – 1/4 కిలో; ఏలకులు – 4 (పొడి చేయాలి); జీడిపప్పు – 4 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు తయారి : ► ముందుగా అటుకుల్ని కడిగి నీళ్లు లేకుండా పిండి పది నిమిషాల సేపు ఆరబెట్టాలి. ► మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి. ► అందులో అటుకులు వేసి తక్కువ మంట మీద కాసేపు ఉడకనివ్వాలి. ► తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి పాలు సగమయ్యే వరకు ఉడికించి దించాలి. ► బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పాయసంలో కలపాలి. ► దీనిని వేడిగా తినవచ్చు, చల్లగా కూడా బావుంటుంది.