నిస్వార్థ ప్రేమ | Selfless love | Sakshi
Sakshi News home page

నిస్వార్థ ప్రేమ

Published Thu, Mar 12 2015 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

నిస్వార్థ ప్రేమ

నిస్వార్థ ప్రేమ

దేశ సంచారం చేస్తున్న ఒక జ్ఞానికి ఒక మామిడి పండు దొరుకుతుంది. ఆ మామిడిపండు ప్రత్యేకత ఏమిటంటే, ఆ పండు తిన్న వారి ఆయుష్షు పెరుగుతుంది. విషయం తెలిసిన జ్ఞాని ఆ పండును తాను తినడం కన్నా ప్రజలకు మేలు చేసే రాజు తింటే మంచిదని అనుకుంటాడు.

అనుకున్నదే తడవుగా జ్ఞాని తనంతట తానుగా రాజసభకు వెళ్ళి రాజుకిస్తాడు. రాజు ఆ పండు తీసుకుని తాను తినడం కన్నా తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న భార్యకు ఇస్తే బాగుంటుంది కదా అనుకుని ఆమెకు ఇస్తాడు. అయితే ఆమె దానిని తినకుండా కుంటివాడైనా తన శక్తియుక్తులతో గుర్రపుస్వారీలో విశేష ప్రతిభతో తనను ఆశ్చర్యపరచిన గుర్రపురౌతుకు ఇస్తుంది.
 ఆ వికలాంగ రౌతు ఆ పండు తీసుకుని ఇంటికెళతాడు. తన భార్యది ఎంతో గొప్పమనసు అని, తనకన్నా ఆమె దీర్ఘకాలం జీవిస్తే బాగుంటుందని అనుకుని ఆ పండుని తన భార్యకు ఇస్తాడు. కానీ ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న రాజుకు ఇస్తే ఆయన ఆయుష్షు పెరిగి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనుకుంది. ఆమె పండు ప్రాధాన్యాన్ని చెప్పి రాజుకు ఇమ్మంటుంది తన భర్తను. అతను అలాగే అని ఆ పండు తీసుకువెళ్ళి రాజుకు అందజేస్తాడు.
 
మామిడి పండు తిరిగి తన చేతికి రావడం తెలిసి రాజు ఆశ్చర్యపోతాడు. మరుసటిరోజే రాజు రాజ ్యపాలనను కొడుకుకి అప్పగించి సన్యసిస్తాడు. ప్రేమ అనేది ఏదో ఆశించి, లోలోపల ఏదో అనుకుని స్వార్థచింతనతో కూడినదై ఉండకూడదనేదే ఈ కథ సారాంశం. ఆశించడానికి అతీతంగా ఉండాలి ప్రేమ. అప్పుడే ప్రేమతోపాటు ప్రేమను ప్రేమించే వ్యక్తులూ విజయం సాధిస్తారు.
 
 యామిజాల జగదీశ్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement