రారండోయ్‌ | Telugu Literature Events | Sakshi
Sakshi News home page

రారండోయ్‌

Published Mon, Aug 13 2018 1:20 AM | Last Updated on Mon, Aug 13 2018 1:20 AM

Telugu Literature Events - Sakshi

  • సమకాలీన ముస్లిం నేపథ్య కథల సంకలనం ‘కథా మినార్‌’ ఆవిష్కరణ ఆగస్టు 18 శనివారం సాయంత్రం 6.30 కు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. సంపాదకులు: మహమ్మద్‌ ఖదీర్‌బాబు, వేంపల్లె షరీఫ్‌.
  • తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ రాష్ట్రస్థాయి నవలల పోటీ నిర్వహిస్తోంది. ఇతివృత్తం, తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించాలి. నిడివి ప్రచురణలో 100–200 పేజీలుండాలి. ప్రథమ బహుమతి లక్ష రూపాయలు. ద్వితీయ: 75 వేలు. తృతీయ: 50 వేలు. అక్టోబర్‌ 10 చివరి తేది. పంపాల్సిన చిరునామా: కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, రవీంద్రభారతి, కళాభవన్, సైఫాబాద్, హైదరాబాద్‌–4.
  • ‘జలియన్‌వాలాబాగ్‌ నూరేళ్ల సందర్భం: శతవత్సర జ్ఞాపక జ్వాల’ పేరుతో ఆగస్టు 13న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో కార్యక్రమం జరగనుంది. ప్రసంగం: రామతీర్థ. నిర్వహణ: మొజాయిక్‌ సాహిత్య సంస్థ.
  • హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 11–15 వరకు వనపర్తిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో పుస్తక మహోత్సవం జరగనుంది.
  • ఆగస్టు 19న ఉ. 11 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయం రెండో గేటు ముందు గల అరసం, వరంగల్‌ కార్యాలయంలో ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో నా సాహితీ పాత్ర’ అంశంపై మెట్టు రవీందర్‌ ప్రసంగిస్తారు. ప్రతి నెలా మూడో ఆదివారం జరిగే ఈ కార్యక్రమ నిర్వహణ: వరంగల్‌ అరసం.
  • మఖ్దూం మొహియుద్దీన్‌ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మూకదాడులు’ అంశంపై కవి సమ్మేళనం జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహితి. వివరాలకు: 8897765417.
  • సత్యోదయ్‌ కవితా సంపుటి ‘వ్యతిరిక్త ప్రవాహమ్‌’ ఆగస్టు 18న ఉదయం 10.30 గం.కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నిర్వహణ: బేర్‌ ఫుట్‌ పేజెస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement